Intermediate advanced supplementary examinations
-
ఇంటర్ ప్రత్యేక తరగతులు ప్రారంభం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదువుతూ ఇంటర్మీడియెట్ ఫెయిలైన విద్యార్థుల కోసం ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. వారికోసం ప్రత్యేక శిక్షణ తరగతులు (రెమిడియల్ శిక్షణ)కు శ్రీకారం చుట్టింది. వీరందరికీ ఈ నెల 21 వరకు (21 రోజులపాటు) తరగతులు నిర్వహించి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు సిద్ధం చేయనుంది. సోమవారం నుంచి ప్రారంభమైన శిక్షణకు విద్యార్థుల సంఖ్యను అనుసరించి అధికారులు ఏర్పాట్లు చేశారు. మూడు సబ్జెక్టుల లోపు ఫెయిలైన వారికి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు, అంతకంటే ఎక్కువ సబ్జెక్టులు పోయినవారికి సాయంత్రం వరకు తరగతులు నిర్వహించేలా ఇంటర్ బోర్డు చర్యలు తీసుకుంది. రెండు షిఫ్టుల్లో తరగతులకు హాజరయ్యే విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కూడా అందిస్తారు. తరగతుల నిర్వహణ, కాలేజీలను జిల్లా కలెక్టర్లు పర్యవేక్షిస్తారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా రెసిడెన్షియల్ తరహా శిక్షణపై కూడా అధికారులు దృష్టి సారించారు. విద్యార్థుల ఆసక్తి మేరకు డివిజనల్ కేంద్రాల్లో హాస్టల్ వసతి కల్పించి శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. ఫెయిలైన బాలికలకు ప్రత్యేక ఏర్పాట్లు ఇంటర్ పరీక్షల్లో ఫెయిలైన బాలికలకు కూడా రెసిడెన్షియల్ శిక్షణ అందించడానికి అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వారికి పూర్తి రక్షణ వాతావరణం ఉండే కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయా (కేజీబీవీ)ల్లో వసతి, శిక్షణ ఇవ్వనున్నారు. విద్యార్థులు తమకు నచ్చిన విధానం ఎంచుకుని తరగతులకు హాజరు కావచ్చు. బీసీ గురుకులాల్లో ఫెయిలైన విద్యార్థులు 195 మంది ఉండగా.. వారికి ఆన్లైన్, రెసిడెన్షియల్ విధానంలో తరగతులు నిర్వహిస్తున్నారు. 10 మంది కంటే తక్కువ విద్యార్థులు ఉంటే వారికి ఆన్‌లైన్‌లోనూ, అంతకు మించి విద్యార్థులు ఉన్నచోట 14 సెంటర్లలో రెసిడెన్షియల్ తరగతులకు శ్రీకారం చుట్టారు. ఇంటర్ పాసైనా మార్కులు పెంచుకునేందుకు ఇంప్రూవ్మెంట్ రాసే విద్యార్థులు కూడా రెమిడియల్ శిక్షణ తరగతులకు హాజరు కావచ్చని ఇంటర్ బోర్డు అధికారులు తెలిపారు. ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు చెల్లింపునకు నేడు ఆఖరు ఇంటర్మీడియెట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు రాసే విద్యార్థులు ఫీజు చెల్లించడానికి మే 3 చివరి తేదీ అని ఇంటర్ బోర్డు ప్రకటించింది. ఈ నెల 24 నుంచి జూన్ 1 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులు బుధవారం సాయంత్రంలోగా ఫీజు చెల్లించాలని ఇంటర్ బోర్డు పేర్కొంది. -
ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు రద్దు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసింది. కరోనా నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గురువారం తెలిపారు. ఈ ఏడాది సెకండియర్ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులందరినీ పాస్ చేస్తూ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో 1.47 లక్షల మంది విద్యార్థులకు ఊరట కలగనుంది. ఈ మేరకు ఫెయిల్ అయిన విద్యార్థులను కంపార్ట్మెంట్ పాస్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. (డిగ్రీ,పీజీ పరీక్షలపై హైకోర్టు విచారణ) ‘ఈ ఏడాది ఇంటర్ సెకండియర్ పరీక్షల్లో 1.47 లక్షల మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. పాస్ అయిన వారిని కూడా రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకోమని చెప్పాం. అందుకు దాదాపు 73 వేల దరఖాస్తులు వచ్చాయి. ఆ ప్రక్రియ కూడా 10 రోజుల్లో పూర్తి అవుతుంది. ఆ తర్వాత వారి రిజల్ట్స్‌ను ప్రకటిస్తాం. సెకండియర్‌లో ఫెయిల్ అయిన విద్యార్థులను కంపార్టమెంట్ పాస్ చేస్తున్నాం. జూలై 31 తర్వాత వారి మార్కుల మెమోలు సంబంధిత కళాశాలల్లో అందుబాటులో ఉంటాయి. విద్యార్థుల పైచదువులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు’ అని సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. -
తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు
హైదరాబాద్: ఇంటర్మీడియెట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను ఈ నెల 24 నుంచి 31 వరకు నిర్వహిస్తున్నట్లు ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషన్ బోర్డ్ ఆర్ఐవో ఎ.రవికుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం పరీక్షకు 47,308, ద్వితీయ సంవత్సరం పరీక్షకు 30,619 మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. ఈ పరీక్షల కోసం హైదరాబాద్ జిల్లాలో 118 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్ష కేంద్రానికి గంట ముందుగా చేరుకోవాలని స్పష్టం చేశారు. జిల్లా పరీక్షల నిర్వహణకు కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కమిటీ కన్వీనర్‌గా ఆర్ఐవో ఎ.రవికుమార్, సభ్యులుగా గవర్నమెంట్ సిటీ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఎం.చంద్రకళ, కస్తూర్భా బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రతిమారెడ్డి, మహబూబియా ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శ్యామూల్బాబు, జూనియర్ లెక్చరర్స్ ఆర్.సత్యానందం, డి.భద్రసేన్ తదితరులు వ్యవహరిస్తారని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ అధ్యక్షతన డీవీఈవో కాశీనాథ్, ప్రభుత్వ కళాశాల సీనియర్ ప్రిన్సిపాల్ సి.హెచ్.హరీంద్రనాథ్, ఆయా సబ్జెక్టులలో నిష్ణాతులచే కూడిన హై పవర్ కమిటీని, 4 ఫ్లయింగ్, 4 సిట్టింగ్ స్క్వాడ్లను నియమించినట్లు తెలిపారు.