
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, న్యూఢిల్లీ: కోవిడ్-19(కరోనా వైరస్) విస్తరణకు చెక్ పెట్టే చర్యల్లో భాగంగా ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలోని అన్ని మాల్స్‌ను మూసివేస్తున్నట్లు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం ప్రకటించారు. అయితే కిరాణా, ఫార్మసీ కూరగాయల దుకాణాలకు దీన్నుంచి మినహాయింపు వుంటుందని స్పష్టం చేశారు.
ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా, అన్ని మాల్స్ (కిరాణా, ఫార్మసీ, కూరగాయల షాపులు మినహా) మూసివేస్తున్నామని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. ఈ ప్రాంతంలో పెరుగుతున్న కరోనావైరస్ కేసుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. భవిష్యత్తులో కరోనా విస్తృతంగా వ్యాప్తి చెందితే, అలాంటి పరిస్థితులను ఎదుర్కొంనేందుకు ఆస్పత్రులు సిద్ధంగా ఉండాలని కేజ్రీవాల్ పిలుపునిచ్చారు. ఎంఆర్‌ఐ,ఇతర మెషీన్లు, వెంటిలేటర్లు, తగినంత మందులు, వినియోగ వస్తువులు, సిబ్బంది మొదలైనవి అందుబాటులో వుండాలని ఆదేశించారు. దీనికి సంబంధించి ప్రభుత్వ అధికారులు, ఆయా విభాగాల అధిపతులు, కార్యదర్శులతో సమీక్షించినట్టు కేజ్రీవాల్ వెల్లడించారు. కాగా ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ బారిన పడి మరణించిన వారి సంఖ్య 10031కి చేరింది. బాధితుల సంఖ్య 244 602కి చేరింది.
In view of the prevailing situation, we are closing down all Malls (except grocery, pharmacy and vegtable shops in them)
— Arvind Kejriwal (@ArvindKejriwal) March 20, 2020