సాక్షి,న్యూఢిల్లీ : ఢిల్లీ ప్రభుత్వం తీవ్ర సిబ్బంది కొరతను ఎదుర్కొంటోంది. పలు ప్రభుత్వ శాఖల్లో సగటున 50 ఉద్యోగాలు ఖాళీగా పడిఉన్నాయి. శాఖలవారీగా చూస్తే సిబ్బంది కొరత న్యాయ శాఖలో 87 శాతం ఉండగా, విద్యుత్ శాఖలో 20 శాతం వరకూ సిబ్బంది కొరత వేధిస్తోంది. కీలక శాఖల్లో ఉద్యోగులు కొరవడటంతో పాలన కుంటుపడుతోందని అధికార వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కీలక ప్రాజెక్టుల అమలులోనూ ప్రతికూల ప్రభావం పడుతోందని పేర్కొన్నాయి.
ఢిల్లీ కాలుష్య కోరల్లో కూరుకుపోయిన క్రమంలో కీలకమైన రవాణా శాఖలో సిబ్బంది కొరత అత్యధికంగా 63 శాతం నెలకొంది. రెవెన్యూ, ఎక్సైజ్, సంక్షేమ, విద్యా, గణాంక, ప్రణాళికా శాఖల్లో దాదాపు సగం పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఓ నివేదిక వెల్లడించింది. మౌలిక ప్రాజెక్టుల అమలు, పర్యవేక్షణలో కీలకమైన ప్రజా పనుల శాఖలో 40 శాతం ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఢిల్లీ హైకోర్టు తీర్పుకు అనుగుణంగా సేవల ఇన్‌ఛార్జ్‌గా లెఫ్టినెంట్ గవర్నర్ వ్యవహరిస్తుండటంతో తమ పరిధిలో ఉద్యోగాల భర్తీకి చేసేదేమీ లేదని కేజ్రీవాల్ సర్కార్ చేతులెత్తేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment