administarton
-
ఎలన్ మస్క్ కంపెనీకి యూఎస్ గట్టి హెచ్చరిక...!
వాషింగ్టన్: ఎలన్ మస్క్ కంపెనీ స్పేస్ ఎక్స్ అంగారక గ్రహం, చంద్రుడిపైకి మానవులను తీసుకెళ్లాలని ఎంతగానో తహతహలాడుతున్నాడు. అందుకోసం ఇప్పటికే మానవులను ఇతరగ్రహలపైకి రవాణాచేసే అంతరిక్షనౌక స్టార్‌షిప్ ప్రయోగాలను స్పేస్ఎక్స్ కంపెనీ ప్రారంభించిన విషయం తెలిసిందే. అనేక పరాజయాల తరువాత అంతరిక్షనౌక స్టార్‌షిప్.. నింగిలోకి నిప్పులు చిమ్ముకుంటూ ఎగిసి గాల్లో చక్కర్లు కొడుతూ హై ఆల్టిట్యూడ్ టెస్ట్‌ను విజయవంతంగా స్పేస్ఎక్స్ సంస్థ పరీక్షించింది. తాజాగా స్టార్‌షిప్‌ను తొలిసారిగా భూ నిర్ణీత కక్ష్యలోకి పంపాలని స్పేస్ ఎక్స్ ప్రణాళిక చేస్తోంది. కాగా ప్రస్తుతం ఈ ప్రయోగానికి ఫెడరల్ ఏవియేషన్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్ఏఏ) నుంచి ఆమోదం రాలేదు. ఎఫ్ఏఏ నుంచి ఆమోదం రాకపోయినా స్పేస్ ఎక్స్ స్టార్‌షిప్ భూ నిర్ణీత కక్ష్యలోకి పంపే ప్రయోగాన్ని కొనసాగిస్తుంది. టెక్సాస్‌లోని బోకా చికా ప్రయోగ స్థలంలో పర్యావరణ సమీక్ష అసంపూర్తిగా ఉందని యూఎస్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఎఎ) స్పేస్ఎక్స్ సంస్థను హెచ్చరించింది. ప్రస్తుతం స్పేస్ఎక్స్ ప్రతిపాదిత రాకెట్ అసెంబ్లీ "ఇంటిగ్రేషన్ టవర్" పై ఏజెన్సీ పర్యావరణ సమీక్ష చేస్తోందని ఎఫ్ఎఎ ప్రతినిధి బుధవారం పేర్కొన్నారు. కాగా కంపెనీ రిస్క్ తీసుకొని టవర్ నిర్మాణం చేపడుతుందనీ ఎఫ్ఏఏ ప్రతినిధి ఆరోపించారు.ఒకవేళ పర్యావరణ సమీక్షలో స్పేస్ఎక్స్ ఫెయిల్ ఐతే స్టార్‌షిప్ రాకెట్ అసెంబ్లీ లాంఛింగ్ టవర్‌ను కూల్చివేయడానికి ఎఫ్ఏఏ ఆదేశాలను ఇవ్వొచ్చును. అంతేకాకుండా ప్రయోగ సమయంలో పర్యారణానికి హాని చేకూరితే కఠిన చర్యలను తీసుకోవడానికి ఎఫ్ఏఏ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. మే ఆరో తేదీనా ఎఫ్ఏఏ ప్రతినిధులు చేస్తోన్న పర్యావరణ సమీక్ష స్టార్‌షిప్ ప్రయోగ ప్రక్రియను క్లిష్టతరం చేస్తాయని స్పేస్ఎక్స్ తన లేఖలో పేర్కొంది. కాగా ఈ ప్రయోగానికి పర్యావరణ అనుమతులు తొందరలోనే వస్తాయని స్పేస్ఎక్స్ సంస్థ అధ్యక్షురాలు గ్విన్నే షాట్వెల్ ఆశాభావం వ్యక్తం చేశారు. స్టార్‌షిప్ ప్రయోగం విజయవంతమైతే ఎలన్ మస్క్ కంపెనీ స్పేస్ ఎక్స్ అంతరిక్ష చరిత్రలో కొత్త అధ్యాయాన్ని సృష్టిస్తోందని నిపుణులు భావిస్తున్నారు. -
రోబోలతో పరిపాలన అందిస్తాం..
అది జపాన్‌లోని టామా అనే పట్టణం.. టోక్యో జిల్లాలో ఉంది.. ఇటీవలే అక్కడ మేయర్ స్థానం కోసం ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. అంటే ఎన్నికల పండుగ మొదలైంది. ఆ స్థానం కోసం చాలా మంది అభ్యర్థులు పోటీలో నిలుచున్నారు. వారి ఎన్నికల ప్రచారంలో ప్రజలకు అనేక హామీలు ఇస్తున్నారు. అయితే మిచిటో మస్తుడా అనే ఓ అభ్యర్థి మాత్రం ఎవరూ ఊహించని రీతిలో హామీలు ఇస్తున్నాడు.. అతడు ఇస్తున్న హామీ ఏంటో తెలుసా.. స్వచ్ఛమైన పరిపాలన అందిస్తానని.. అందులో కొత్తేం ఉందనుకుంటున్నారా..? కృత్రిమ మేధస్సుతో పరిపాలన చేస్తానని చెబుతున్నాడు.. అంటే పరిపాలన మొత్తం రోబోలతో చేసేస్తానని హామీ ఇచ్చేస్తున్నాడు.. ఒకవేళ మనోడు గెలిస్తే కృత్రిమ మేధస్సుతో పనిచేసే మొట్టమొదటి మేయర్ అవుతాడు. తాను గెలిస్తే ప్రభుత్వ పరిపాలన, విధానాల రూపకల్పన, పథకాలు, వాటి అమలు ఇవన్నీ కృత్రిమ మేధస్సుతో నడుపుతానని మస్తుడా చెబుతున్నాడు. దీంతో నిర్ణయాలు చాలా త్వరగా తీసుకోవచ్చని, తద్వారా ప్రజలకు త్వరితగతిన సేవలందించవచ్చని ప్రచారం చేసుకుంటున్నాడు. దాదాపు ప్రభుత్వ ఉద్యోగులను తొలగించి కృత్రిమ మేధతో నడిచే వాటినే నియమిస్తానని చెబుతున్నాడు. దీంతో అవినీతి, లంచం అనే మాట తన పరిపాలనలో ఉండదని అంటున్నాడు. 2014లో టామా నుంచే మేయర్ కోసం పోటీ చేసి డిపాజిట్ కోల్పోయాడు. దీంతో ఈ సారి ఎలాగైనా గెలవాలని ఈ కొత్త పంథా ఎంచుకున్నాడు. అయితే ఇదంతా ఓ రాజకీయ ఎత్తుగడ అని ప్రత్యర్థులు ఎద్దేవా చేస్తున్నారు. ఆదివారం (ఏప్రిల్ 15) జరుగుతున్న ఈ ఎన్నికల్లో మస్తుడా గెలిస్తే తాను ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటాడో లేదో వేచి చూడాల్సిందే. -
అక్కడ సగం ఉద్యోగాలు ఖాళీ
సాక్షి,న్యూఢిల్లీ : ఢిల్లీ ప్రభుత్వం తీవ్ర సిబ్బంది కొరతను ఎదుర్కొంటోంది. పలు ప్రభుత్వ శాఖల్లో సగటున 50 ఉద్యోగాలు ఖాళీగా పడిఉన్నాయి. శాఖలవారీగా చూస్తే సిబ్బంది కొరత న్యాయ శాఖలో 87 శాతం ఉండగా, విద్యుత్ శాఖలో 20 శాతం వరకూ సిబ్బంది కొరత వేధిస్తోంది. కీలక శాఖల్లో ఉద్యోగులు కొరవడటంతో పాలన కుంటుపడుతోందని అధికార వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కీలక ప్రాజెక్టుల అమలులోనూ ప్రతికూల ప్రభావం పడుతోందని పేర్కొన్నాయి. ఢిల్లీ కాలుష్య కోరల్లో కూరుకుపోయిన క్రమంలో కీలకమైన రవాణా శాఖలో సిబ్బంది కొరత అత్యధికంగా 63 శాతం నెలకొంది. రెవెన్యూ, ఎక్సైజ్, సంక్షేమ, విద్యా, గణాంక, ప్రణాళికా శాఖల్లో దాదాపు సగం పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఓ నివేదిక వెల్లడించింది. మౌలిక ప్రాజెక్టుల అమలు, పర్యవేక్షణలో కీలకమైన ప్రజా పనుల శాఖలో 40 శాతం ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఢిల్లీ హైకోర్టు తీర్పుకు అనుగుణంగా సేవల ఇన్‌ఛార్జ్‌గా లెఫ్టినెంట్ గవర్నర్ వ్యవహరిస్తుండటంతో తమ పరిధిలో ఉద్యోగాల భర్తీకి చేసేదేమీ లేదని కేజ్రీవాల్ సర్కార్ చేతులెత్తేస్తోంది. -
తన తప్పులను తానే ఒప్పుకుంటున్న ట్రంప్!
వాషింగ్టన్ : ఓవైపు విదేశాంగ శాఖ మంత్రి టిల్లర్సన్తో విభేధాలు.. మరోవైపు మాజీ భద్రతా సలహాదారు మైకేల్ ఫ్లిన్ వ్యవహారం వెలుగులోకి రావటం... వెరసి అగ్రరాజ్య అధినేత పాలన తీరు సరిగ్గా లేదన్న వాదనను తెరపైకి తెస్తున్నాయి. ఫ్లిన్ తప్పు చేశాడంటూ స్వయంగా ట్రంప్ చేసిన ఓ ట్వీట్ అందుకు నిదర్శనమని విశ్లేషకులు చెబుతున్నారు. ఉపాధ్యక్షుడికి, ఎఫ్‌బీఐకి అబద్ధాలు చెప్పటం వల్లే ఫ్లిన్‌ను తొలగించాల్సి వచ్చిందని.. అతను చేసింది సిగ్గుపడాల్సిన విషయమని.. అందులో దాచేందుకు ఏం లేదని ట్రంప్ గత రాత్రి ఓ ట్వీట్ చేశారు. తద్వారా తన పాలనలో లోపాలున్న మాట వాస్తవమేనని స్వయంగా ట్రంప్ ఒప్పుకున్నట్లు అయ్యిందని వారంటున్నారు. I had to fire General Flynn because he lied to the Vice President and the FBI. He has pled guilty to those lies. It is a shame because his actions during the transition were lawful. There was nothing to hide! — Donald J. Trump (@realDonaldTrump) December 2, 2017 ఇక ట్రంప్ కు, టిల్లర్ సన్ కు విభేదాలు తారస్థాయికి చేరాయని, ఈ నేపథ్యంలో ఆయనకు శ్వేత సౌధం నుంచి ఉద్వాసన తప్పదని మీడియా పేర్కొన్న విషయం తెలిసిందే. ట్రంప్ విదేశాంగ విధానంపై టిల్లర్ సన్ గతంలోనే బహిరంగంగా మండిపడ్డారు. ఉత్తరకొరియా, ఇరాన్, కొన్ని అరబ్బు దేశాలతో ట్రంప్ వైఖరి సరిగ్గాలేదని, ట్రంప్ మూర్ఖుడని టిల్లర్ పేర్కొన్నారు కూడా. ఈ నేపథ్యంలో గుర్రుగా ఉన్న ట్రంప్ ఆయనను తొలగించబోతున్నాడంటూ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అయితే దీనిపై ట్వీట్ చేసిన ట్రంప్.. అదంతా మీడియా ఫేక్ న్యూస్ అంటూ ఎప్పటిలాగే తన పంథాలో చెప్పుకొచ్చాడు. కొన్ని విషయాల్లో ఆయనతో విభేదిస్తా, కానీ అతడిని మాత్రం తొలగించడం లేదు. ఇద్దరం కలిసి పనిచేస్తాం అని ట్రంప్ స్పష్టం చేశారు. ఈ పరంగా ట్రంప్ సొంత ట్వీట్లతోనే తన పాలన తప్పుదారి పడుతోందని ఒప్పుకుంటున్నాడన్నది విశ్లేషకులు చెప్పేది. The media has been speculating that I fired Rex Tillerson or that he would be leaving soon - FAKE NEWS! He’s not leaving and while we disagree on certain subjects, (I call the final shots) we work well together and America is highly respected again!https://t.co/FrqiPLFJ1E — Donald J. Trump (@realDonaldTrump) December 1, 2017 ఒబామా చురకలు? అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ వాడకంపై పరోక్షంగా చురకలు అంటించారు. ఒబామా న్యూఢిల్లీలో నిర్వహించిన హిందుస్థాన్ టైమ్స్ లీడర్షిప్ సమ్మిట్‌లో పాల్గొన్న విషయం తెలిసిందే. 'మాట్లాడటానికి ముందు ఆలోచించండి అన్నది ట్విట్టర్‌కి కూడా వర్తిస్తుంది. అందుకే ట్వీట్ చేసే ముందు ఒకసారి ఆలోచించండి. చూడండి.. నాకు దాదాపు 100 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఈ సంఖ్య రోజూ ట్వీట్ వాడే కొంతమంది కంటే ఎక్కువ' అని ఒబామా అన్నారు. ఈ మాటల్లో పరోక్షంగా డొనాల్డ్ ట్రంప్‌ను ఒబామా ప్రస్తావించినట్లు అనిపిస్తుంది. -
బల్దియా పాలన అధ్వానం
గోదావరిఖని : రామగుండం కార్పొరేషన్లో పాలకవర్గం పాలన అధ్వానంగా ఉందని కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్‌లీడర్ మహాంకాళి స్వామి ఆరోపించారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో శనివారం మాట్లాడారు. కార్పొరేషన్లో చెత్త సేకరణకు రూ.35 లక్షలు వెచ్చించి ట్రైసైకిళ్లను కొనుగోలు చేసి పడేశారని, అవి వినియోగం లేక స్క్రాప్‌గా మారాయన్నారు. ఇంటింటికీ చెత్తను సేకరించేందుకు 40 వేల ప్లాస్టిక్ డబ్బాలు కొనుగోలు చేస్తున్నారని, ఇది కేవలం కమీషన్లు దండుకోవడం కోసమేనని పేర్కొన్నారు. ఈ విషయమై విజిలెన్స్‌కు ఫిర్యాదు చేస్తే వారు కూడా పట్టింపులేకుండా వ్యవహరిస్తున్నారని, నేటికి విచారణ జరపడానికి ముందుకు రాకపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు. కార్పొరేషన్లో అభివృద్ధి పాలనపై ఎంపీ, ఎమ్మెల్యే, మేయర్ తగిన శ్రద్ధ వహించాలని డిమాండ్ చేశారు. సిరిసిల్ల, హుజూరాబాద్, కరీంనగర్ బల్దియాలకు స్థానిక ప్రజాప్రతినిధులు ప్రభుత్వం నుంచి కోట్లాది రూపాయల నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేస్తుంటే స్థానిక ప్రజాప్రతినిధులు మాత్రం రామగుండం కార్పొరేషన్‌కు కనీసం కోటి రూపాయల నిధులు కూడా తీసుకురాలేకపోయారని విమర్శించారు. సింగరేణి సంస్థకు చెందిన సీఎస్ఆర్ నిధులను స్థానికంగా ఖర్చు చేయకుండా సింగరేణికి సంబంధం లేని ఇతర ప్రాంతాలలో ఖర్చు చేస్తున్నారని తెలిపారు. సమావేశంలో డెప్యూటీ ఫ్లోర్ లీడర్ బొంతల రాజేశ్, కార్పొరేటర్లు తానిపర్తి గోపాల్‌రావు, కొలిపాక సుజాత, పెద్దెల్లి ప్రకాశ్, పీచర శ్రీనివాసరావు, తిప్పారపు శ్రీనివాస్, సుతారి లక్ష్మణŠ బాబు, దార కుమార్, ముస్తాఫా, అరుణ్‌కుమార్, పర్శ శ్రీనివాస్, కారెంగుల సురేశ్ తదితరులు పాల్గొన్నారు.