తన తప్పులను తానే ఒప్పుకుంటున్న ట్రంప్‌! | Trump's self tweets raise doubts on his administration | Sakshi
Sakshi News home page

Published Sun, Dec 3 2017 8:26 AM | Last Updated on Sat, Aug 25 2018 7:52 PM

Trump's self tweets raise doubts on his administration - Sakshi

వాషింగ్టన్‌ : ఓవైపు విదేశాంగ శాఖ మంత్రి టిల్లర్‌సన్‌తో విభేధాలు.. మరోవైపు మాజీ భద్రతా సలహాదారు మైకేల్‌ ఫ్లిన్‌ వ్యవహారం వెలుగులోకి రావటం... వెరసి అగ్రరాజ్య అధినేత పాలన తీరు సరిగ్గా లేదన్న వాదనను తెరపైకి తెస్తున్నాయి. 

ఫ్లిన్‌ తప్పు చేశాడంటూ స్వయంగా ట్రంప్ చేసిన ఓ ట్వీట్‌ అందుకు నిదర్శనమని విశ్లేషకులు చెబుతున్నారు. ఉపాధ్యక్షుడికి, ఎఫ్‌బీఐకి అబద్ధాలు చెప్పటం వల్లే ఫ్లిన్‌ను తొలగించాల్సి వచ్చిందని.. అతను చేసింది సిగ్గుపడాల్సిన విషయమని.. అందులో దాచేందుకు ఏం లేదని ట్రంప్‌ గత రాత్రి ఓ ట్వీట్ చేశారు.  తద్వారా తన పాలనలో లోపాలున్న మాట వాస్తవమేనని స్వయంగా ట్రంప్ ఒప్పుకున్నట్లు అయ్యిందని వారంటున్నారు.

ఇక ట్రంప్‌ కు, టిల్లర్‌ సన్‌ కు విభేదాలు తారస్థాయికి చేరాయని, ఈ నేపథ్యంలో ఆయనకు శ్వేత సౌధం నుంచి ఉద్వాసన తప్పదని మీడియా పేర్కొన్న విషయం తెలిసిందే.  ట్రంప్ విదేశాంగ విధానంపై టిల్లర్ సన్‌ గతంలోనే బహిరంగంగా మండిపడ్డారు. ఉత్తరకొరియా, ఇరాన్, కొన్ని అరబ్బు దేశాలతో ట్రంప్ వైఖరి సరిగ్గాలేదని, ట్రంప్ మూర్ఖుడని టిల్లర్ పేర్కొన్నారు కూడా. ఈ నేపథ్యంలో గుర్రుగా ఉన్న ట్రంప్ ఆయనను తొలగించబోతున్నాడంటూ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అయితే దీనిపై ట్వీట్ చేసిన ట్రంప్.. అదంతా మీడియా ఫేక్‌ న్యూస్‌ అంటూ ఎప్పటిలాగే తన పంథాలో చెప్పుకొచ్చాడు. కొన్ని విషయాల్లో ఆయనతో విభేదిస్తా, కానీ అతడిని మాత్రం తొలగించడం లేదు. ఇద్దరం కలిసి పనిచేస్తాం అని ట్రంప్‌ స్పష్టం చేశారు. ఈ పరంగా ట్రంప్‌ సొంత ట్వీట్లతోనే తన పాలన తప్పుదారి పడుతోందని ఒప్పుకుంటున్నాడన్నది విశ్లేషకులు చెప్పేది. 

ఒబామా చురకలు?

అమెరికా మాజీ అధ్యక్షుడు బ‌రాక్ ఒబామా డొనాల్డ్ ట్రంప్‌ ట్విట్ట‌ర్ వాడ‌కంపై పరోక్షంగా చురకలు అంటించారు. ఒబామా న్యూఢిల్లీలో నిర్వ‌హించిన హిందుస్థాన్ టైమ్స్ లీడ‌ర్‌షిప్ స‌మ్మిట్‌లో పాల్గొన్న విషయం తెలిసిందే. 'మాట్లాడ‌టానికి ముందు ఆలోచించండి అన్నది ట్విట్ట‌ర్‌కి కూడా వ‌ర్తిస్తుంది. అందుకే ట్వీట్ చేసే ముందు ఒక‌సారి ఆలోచించండి. చూడండి.. నాకు దాదాపు 100 మిలియ‌న్ల మంది ఫాలోవ‌ర్లు ఉన్నారు. ఈ సంఖ్య రోజూ ట్వీట్ వాడే కొంత‌మంది కంటే ఎక్కువ‌' అని ఒబామా అన్నారు. ఈ మాట‌ల్లో ప‌రోక్షంగా డొనాల్డ్ ట్రంప్‌ను ఒబామా ప్ర‌స్తావించిన‌ట్లు అనిపిస్తుంది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement