న్యూఢిల్లీ: ఢిల్లీని రాష్ట్రంగా ప్రకటించాలంటూ ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ప్రభుత్వం దాఖలు చేసిన సివిల్ వ్యాజ్యాన్ని, అది కేంద్ర పాలిత ప్రాంతంగానే కొనసాగుతుందంటూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అప్పీలును కలిపి సుప్రీంకోర్టు విచారించనుంది.
హైకోర్టు తీర్పుపై అప్పీల్‌కు వెళతామని కేజ్రీవాల్ ప్రభుత్వం తెలిపిన నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ విషయాన్ని స్పష్టం చేసింది. పరిపాలనాధికారిగా లెఫ్టినెంట్ గవర్నరే ఉంటారన్న హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలన్న ఆప్ అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించింది.
రెండు వ్యాజ్యాలూ ఒకేసారి విచారిస్తాం
Published Sat, Aug 6 2016 2:00 PM | Last Updated on Mon, Aug 20 2018 2:35 PM
Advertisement