apex court
-
రాష్ డ్రైవింగ్‌పై సుప్రీం కీలక తీర్పు
సాక్షి, న్యూఢిల్లీ : వాహన ప్రమాద బీమా విషయంలో సుప్రీం కోర్టు కీలక తీర్పు వెలువరించింది. అజాగ్రత్తగా రాష్ డ్రైవింగ్ చేసి ప్రమాదానికి గురైన వారికి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ క్లెయిమ్ వర్తించదని స్పష్టం చేసింది. దిలీప్ భౌమిక్ వర్సెస్ నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ కేసును జస్టిస్ ఎన్వీ రమణ, ఎస్ అబ్దుల్ నజీర్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ మేరకు గతంలో త్రిపుర హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేసింది. కేసు వివరాలు.. తన రాష్ డ్రైవింగ్ కారణంగా త్రిపురకు చెందిన దిలీప్ భౌమిక్ 2012, మే 20న జరిగిన కారు ప్రమాదంలో మరణించాడు. దిలీప్ మృతికి ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి నష్ట పరిహారాన్ని కోరుతూ ఆయన కుటుంబ సభ్యులు కోర్టులో దావా వేశారు. విచారించిన త్రిపుర హైకోర్టు మృతుని కుటుంబ సభ్యులకు 10.57 లక్షల రూపాయలు చెల్లించాలని బీమా కంపెనీని ఆదేశించింది. ఈ తీర్పుపై బీమా కంపెనీ దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించి వాదనలు వినిపించింది. సొంత తప్పిదం వల్లే కారు ప్రమాదానికి గురై దిలీప్ మరణించాడని పేర్కొంది. మోటార్ వెహికల్స్ చట్టం ప్రకారం దిలీప్ థర్డ్ పార్టీ కిందకి రాడని సుప్రీం కోర్టుకు విన్నవించింది. ఈ వాదనలతో ఏకీభవించిన సుప్రీం కోర్టు అజాగ్రత్తగా డ్రైవింగ్ చేసి ప్రాణాలు కోల్పోయిన దిలీప్ భౌమిక్ మృతికి బీమా కంపెనీ ఎలాంటి నష్టపరిహారం చెల్లించాల్సిన అవసరం లేదని తీర్పునిచ్చింది. కానీ, వ్యక్తిగత ప్రమాద బీమా పరిహారంగా మృతుని కుటుంబానికి రెండు లక్షల రూపాయలు (వడ్డీ అదనం) చెల్లించాలని తెలిపింది. అయితే, రాష్ డ్రైవింగ్ వల్ల ప్రమాదానికి గురైన ఇతరులకు (థర్డ్ పార్టీ) నష్టపరిహారం చెల్లించే విషయంలో ఈ తీర్పు ఎటువంటి ప్రభావం చూపించబోదని సుప్రీం వెల్లడించింది. -
‘నీట్’లో ఒకటే సెట్!
న్యూఢిల్లీ: ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్)కు ఈ ఏడాది నుంచి సీబీఎస్ఈ ఒకే సెట్ ప్రశ్నపత్రం రూపొందించనుంది. సుప్రీంకోర్టుకు సీబీఎస్ఈ ఈ విషయం తెలిపింది. ఇప్పటివరకు హిందీ, ఇంగ్లిష్ సహా 10 భాషల్లో పరీక్ష రాసేందుకు విద్యార్థులకు అనుమతి ఉండేదని కోర్టుకు చెప్పింది. వేర్వేరు భాషల్లో ప్రశ్నపత్రం రూపొందిస్తే వాటిని దిద్దడం కష్టమని, పైగా ప్రశ్నలు వేర్వేరుగా ఉన్నప్పుడు విద్యార్థుల సామర్థ్యాన్ని ఎలా అంచనా వేయగలుగుతారని ఉన్నత న్యాయస్థానం గతంలో పేర్కొంది. అన్ని పేపర్లలో కఠినత్వం ఒకే స్థాయిలో ఉంటుందని, అలాంటప్పుడు వేర్వేరు సెట్ల ప్రశ్న పత్రం రూపొందించడంలో తప్పు లేదన్న సీబీఎస్ఈ వాదనను కోర్టు తోసిపుచ్చింది. అయితే కోర్టు సలహాలు విన్న సీబీఎస్ఈ.. ఈ ఏడాది నుంచి ఒకే సెట్ ప్రశ్నపత్రం రూపొందించి వాటిని ప్రాంతీయ భాషల్లోకి తర్జుమా చేస్తామని వెల్లడించింది. ఒకే సెట్ ప్రశ్నపత్రం రూపొందించేలా సీబీఎస్ఈని ఆదేశించాలంటూ ‘సంకల్ప్ చారిటబుల్ ట్రస్టు’ పిటిషన్ దాఖలు చేసింది. -
సహారాకు ఈడీ దెబ్బ
న్యూఢిల్లీ : సహారా అధినేత సుబ్రతోరాయ్ మరిన్ని ఇబ్బందుల్లో చిక్కుకోనున్నారు. ఇటీవల ఆంబే వాలీని అటాచ్ చేయాలంటూ ఆదేశించి సుప్రీంకోర్టు షాకివ్వగా ఇపుడు ఈడీ వంతు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి)తాజా నిర్ణయంతో మరిన్ని కష్టాలు సహారాను చుట్టు ముట్టనున్నాయి. మనీలాండరింగ్ చట్టం కింద ఈడీ మరిన్ని విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు పావులు కదుపుతోంది. సహారా గ్రూప్ హోటల్స్ సహా ఇతర విదేశీ ఆస్తులను అటాచ్ కోసం ఈడీ సిద్ధమవుతోంది. సహారా హోటల్స్, విదేశాల్లో్ ఉన్న నాలుగు ప్రాపర్టీల అటాచ్‌మెంట్‌కు రంగం సిద్ధం చేస్తోంది. దాదాపు రూ. 3,697కోట్ల విలువైన ఈ ఆస్తుల అటాచ్‌మెంట్‌కు అనుమతి కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ ఆస్తులను సహారా అక్రమంగా కూడబెట్టిందని ఈడీ ఆరోపిస్తోంది. సుప్రీం అక్రమ ఆస్తులుగా ప్రకటించిన ఈ ప్రాపర్టీలనున పెట్టుబడిదారుల పెట్టుబడుల నుంచి సంపాదించుకుందని ఈడీ నమ్ముతోంది. కాగా సహారా గ్రూప్ అంటే ఆంబేవాలీ. అత్యంత విలువైన ఆస్తి విలువు రూ.39వేల కోట్లు. ఆంబే వాలీని అటాచ్ చేస్తున్నట్టు పేర్కొన్న సుప్రీంకోర్టు తదుపరి విచారణను ఫిబ్రవరి 20కి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. -
రెండు వ్యాజ్యాలూ ఒకేసారి విచారిస్తాం
న్యూఢిల్లీ: ఢిల్లీని రాష్ట్రంగా ప్రకటించాలంటూ ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ప్రభుత్వం దాఖలు చేసిన సివిల్ వ్యాజ్యాన్ని, అది కేంద్ర పాలిత ప్రాంతంగానే కొనసాగుతుందంటూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అప్పీలును కలిపి సుప్రీంకోర్టు విచారించనుంది. హైకోర్టు తీర్పుపై అప్పీల్‌కు వెళతామని కేజ్రీవాల్ ప్రభుత్వం తెలిపిన నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ విషయాన్ని స్పష్టం చేసింది. పరిపాలనాధికారిగా లెఫ్టినెంట్ గవర్నరే ఉంటారన్న హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలన్న ఆప్ అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. -
హిందూ మందిరం కోసం పోరాడుతున్న ముస్లింలు
అదొక ముస్లిం దేశం. ఇస్లాం పేరిట ఏర్పడ్డ దేశం. అయినా అక్కడి ముస్లింలు ఒక మందిరాన్ని కాపాడాలని ఉద్యమం చేస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల తలుపులు తట్టుతూ, ఉద్యమాలు చేస్తూ ఒక మందిరం కోసం పోరాడుతున్నారు. పాకిస్తాన్ వాణిజ్య రాజధాని కరాచీ లోని 150 ఏళ్ల చరిత్రాత్మక శ్రీ రత్నేశ్వర్ మహాదేవ్ మందిరం ఇప్పుడు ప్రమాదంలో పడింది. దానికి కొద్ది అడుగుల దూరంలోనే ఒక ఫ్లైఓవర్ నిర్మాణమౌతోంది. భారీ క్రేన్లు, ఎర్త్ మూవర్లు భూమిని అతలాకుతలం చేస్తున్నాయి. మీటర్లకు మీటర్లు గోతులు తవ్వేస్తున్నాయి. ఈ పనుల వల్ల కలిగే ప్రకంపనలు శ్రీ రత్నేశ్వర మహాదేవుడి గుడికి ప్రమాదంగా పరిణమించాయి. గుప్పెడు మంది కూడా లేని పాకిస్తానీ హిందువులు గుడి కోసం పోరాడే పరిస్థితిలో లేరు. కానీ కరాచీలోని ముస్లింలు వారికి బాసటగా నిలుస్తున్నారు. పాక్ సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ తసదుక్ హుసేన్ జిలానీ ఈ నిర్మాణం వల్ల మందిరం పై ఎలాంటి ప్రభావం ఉంటుందో తెలపాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. రత్నేశ్వర్ మహాదేవ్ మందిరానికి ఘనమైన చరిత్ర ఉంది. ఒకప్పుడు లాహోర్ లో ఉన్న అతి పెద్ద మందిరాల్లో అదొకటి. అక్కడ శివరాత్రి ఉత్సవాలు మహాఘనంగా జరిగేవి. అయితే ఇప్పుడు అదంతా గతం. కానీ ఆ గతాన్ని ఖతం కానీయబోమంటూ అక్కడి ముస్లింలు ముందుకొస్తున్నారు.