ముఖ్యమంత్రికి, మంత్రులకూ మినహాయింపు లేదు | Delhi CM, ministers to come under the ambit of odd-even scheme | Sakshi
Sakshi News home page

ముఖ్యమంత్రికి, మంత్రులకూ మినహాయింపు లేదు

Published Fri, Dec 11 2015 9:38 AM | Last Updated on Sun, Sep 3 2017 1:50 PM

ముఖ్యమంత్రికి, మంత్రులకూ మినహాయింపు లేదు

ముఖ్యమంత్రికి, మంత్రులకూ మినహాయింపు లేదు

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ప్రతిష్టాత్మకంగా అమలుచేయనున్న సరి-బేసి నెంబర్ ప్లేట్ ప్రణాళిక పరిధిలోకి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఆయన మంత్రివర్గ సహచరులు రానున్నారు. 'ముఖ్యమంత్రి సహా మంత్రులందరూ ఈ ప్రణాళికలో పరిధిలోకి రానున్నారు. అయితే కేంద్రమంత్రులు కూడా దీనిని అనుసరించాలా? లేదా? అన్నది కేంద్ర ప్రభుత్వ విచక్షణాధికారానికి రాష్ట్ర ప్రభుత్వం విదిలేసే అవకాశముంది' అని సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు.

హస్తినలో వాయు కాలుష్య నియంత్రణకు జనవరి 1 నుంచి సరి-బేసి నెంబర్ ప్లేట్ ఆధారంగా దినం తప్పించి దినం కార్లను రోడ్ల మీదకు అనుమతించాలని కేజ్రీవాల్ సర్కార్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ ప్రణాళికను సామాన్యులతోపాటు వీఐపీలకూ వర్తింపజేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం భావిస్తున్నది. ఈ ప్రణాళికకు సంబంధించిన సమగ్ర నివేదిక పూర్తయిన తర్వాత సూచనలు, సలహాల కోసం దీనిని కేంద్ర ప్రభుత్వానికి పంపే అవకాశముందని అధికార వర్గాలు తెలిపాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement