ఢిల్లీ సీఎంపై సోనియా అల్లుడు ఫైర్
న్యూఢిల్లీ: ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ అల్లుడు, ప్రియాంక భర్త రాబర్ట్ వాద్రా.. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్పై విమర్శలు ఎక్కుపెట్టారు. కాలుష్య నివారణ కోసం ఢిల్లీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'బేసి-సరి పథకం' నుంచి వీఐపీల వాహనాలకు మినహాయింపు ఇవ్వడాన్ని వాద్రా తప్పుపట్టారు.
'బేసి-సరి పథకంలో మినహాయింపు ఇవ్వడం పూర్తిగా వంచనే. ప్రజాప్రయోజనాల కోసం ఓ చట్టాన్ని అమలు చేసినపుడు మనమందరూ పాటించాలి. వీఐపీలకు మినహాయింపు ఇవ్వరాదు' అని వాద్రా తన ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేశారు. ఢిల్లీ ప్రభుత్వం కాలుష్యాన్ని నివారించడం కోసం ఢిల్లీ రోడ్లపై బేసి-సరి నెంబర్లు గల వాహనాలను రోజు మార్చి రోజు అనుమతించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఎవరైనా ఈ నిబంధన ఉల్లంఘిస్తే 2 వేల రూపాయలు జరిమానా వేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే వీఐపీలకు మినహాయింపు ఇచ్చారు. ఢిల్లీ ప్రభుత్వ నిర్ణయంపై ప్రజల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. దీనివల్ల ఇబ్బందులు ఎదురవుతాయని వాపోయారు.