
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మహమ్మారి కరోనా రెండోసారి విజృంభణ అల్లకల్లోలం రేపింది. ఢిల్లీని చలికన్నా తీవ్రంగా గజగజ వణికించింది. ప్రస్తుతం ఇప్పుడు ఢిల్లీలో పరిస్థితులు అదుపులోకి వచ్చాయి. కరోనా రహితం వైపు అడుగులు వేస్తోంది. తాజాగా ఈ కరోనా విషయంలో ఢిల్లీ రికార్డు సృష్టించింది. ఒక్కటంటే ఒక్క కరోనా మరణం కూడా సంభవించలేదు. తాజాగా శనివారం ప్రకటించిన కరోనా బులెటిన్‌లో ఈ విషయాన్ని ఢిల్లీ ప్రభుత్వం తెలిపింది. పైగా పాజిటివ్ కేసుల నమోదు పదుల సంఖ్యకు చేరడం హర్షించే విషయం. పాజిటివిటీ శాతం ఏకంగా సున్నాకు పరిమితమైంది. ఆ విషయాలు ఇలా ఉన్నాయి.
చదవండి: ‘ఆ కుండ తయారు చేసిందెవరో’? వారికి రోడ్లు, బ్రిడ్జిల కాంట్రాక్ట్ ఇద్దాం
తాజా బులెటిన్‌లో గడిచిన 24 గంటల్లో 35 పాజిటివ్ కేసులు మాత్రమే నిర్ధారణ అయ్యాయి. ఇక కరోనా మృతులు సున్నా. రెండో దశ ప్రారంభమైన తర్వాత ఇప్పుడే అతి తక్కువ కేసులు నమోదవుతున్నారు. మరణాలు లేకపోవడం ఇది తొలిసారి. ఇక పాజిటివిటీ 0.05 శాతంగా ఉంది. ఏకంగా 74,540 కరోనా టెస్టులు చేయగా వాటిలో నమోదైన అతి తక్కువ కేసులు ఇవే. బుధవారం 41 నమోదయ్యాయి. ఆగస్టు 30వ తేదీన కేసులు కేవలం 20 నమోదయ్యాయి. ఢిల్లీలో మొత్తంగా 14.12 లక్షల మంది కరోనా నుంచి కోలుకున్నారు.
చదవండి: పట్టపగలు ‘డబ్బులు పంచుతున్న ఈ యువరాజు ఎవరు?
Comments
Please login to add a commentAdd a comment