
న్యూఢిల్లీ: ఢిల్లీకి చెందిన టేబుల్ టెన్నిస్ స్టార్ మనిక బాత్రా కామన్వెల్త్ గేమ్స్‌లో రెండు స్వర్ణాలు, రజతం, కాంస్యం సాధించింది. ఇంతటి ఘనత సాధించి మూడు నెలలు దాటినా... సొంత రాష్ట్రం నుంచి ప్రొత్సాహక బహుమతికి ఇంకా నోచుకోలేకపోయింది. ప్రస్తుత ఢిల్లీ క్రీడా పాలసీ ప్రకారం స్వర్ణ, రజత, కాంస్యాలకు వరుసగా రూ. 14 లక్షలు, రూ. 10 లక్షలు, రూ. 6 లక్షలు నజరానా ఇస్తున్నారు.
ఇది హరియాణా, తమిళనాడు రాష్ట్రాలు ఇచ్చే నజరానా కంటే చాలా తక్కువ. అయితే కొత్త పాలసీ ప్రకారం మనికకు స్వర్ణ, రజత, కాంస్య పతకాలకు వరుసగా రూ. 50 లక్షలు, రూ. 40 లక్షలు, రూ. 30 లక్షలు ఇచ్చే ఆలోచనలో ఉన్నారు. నజరానా ఆలస్యంపై ఢిల్లీ ప్రభుత్వ డిప్యూటీ డైరెక్టర్ (స్పోర్ట్స్) ధర్మేందర్ సింగ్ మాట్లాడుతూ ఫైల్‌ను కేబినెట్ ఆమోదం కోసం పంపినట్లు చెప్పారు.