న్యూఢిల్లీ: దేశ రాజధానిలో నీటి సంక్షోభంపై ఢిల్లీ సర్కారు సుప్రీం కోర్టు తలుపు తట్టింది. ఈ మేరకు శుక్రవారం(మే31) అత్యున్నత కోర్టులో ఢిల్లీ సర్కారు పిటిషన్ ఫైల్ చేసింది. హార్యానా, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాలు ఢిల్లీకి అదనపు నీళ్లు కేటాయించేలా ఆదేశాలివ్వాలని పిటిషన్‌లో ప్రభుత్వం కోర్టును కోరింది.
ప్రస్తుతం ఢిల్లీలో ఎండలు దంచి కొడుతున్నందున దేశ రాజధానికి నీళ్లివ్వడం అందరి బాధ్యత అని పిటిషన్‌లో తెలిపింది. కాగా, ఢిల్లీలో నీటి సంక్షోభంపై ప్రభుత్వం ఇప్పటికే వాటర్ ట్యాంకర్ వార్‌రూమ్ ఏర్పాటు చేసి యుద్ధ పప్రాతిపదికన చర్యలు తీసుకుంటోంది.
ఢిల్లీలో నివసించే ప్రతి ఒక్కరికి నీరు అందుబాటులో ఉండేలా చూస్తోంది. మరోపక్క తాగే నీటిని వృథా చేసి ఇతర అవసరాలకు వాడే వారిపై రూ.2వేల జరిమానా విధిస్తామని ఇప్పటికే ప్రకటించింది. నీటి కొరతపై గురువారం ఢిల్లీ జల వనరుల మంత్రి ఆతిషి ప్రత్యేక సమీక్ష నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment