న్యూఢిల్లీ: ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ వీకే సక్సేనాపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీలోని చివరి స్థానానికి(18వ ) కోసం ఎన్నిక జరిపించేందుకు ఎందుకు అంత తొందర అని లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాను సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నించింది.
అలాగే.. దీనికి సంబంధించిన ఛైర్మన్ ఎన్నికునే ప్రక్రియపై కూడా స్టే విధించింది. నియమావళిని స్పష్టంగా ఉల్లంఘిస్తూ ఎన్నికలకు లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశించడం వెనుక న్యాయపరమైన ఆధారం ఏంటని జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ ఆర్ మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం ప్రశ్నించింది.
"నామినేషన్ సమస్య కూడా ఉంది... మేయర్ (అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన షెల్లీ ఒబెరాయ్) అధ్యక్షత వహించారు. మీకు (ఎల్జీ) అధికారం ఎక్కడ లభిస్తుంది?" అని కోర్టు ప్రశ్నించింది.
‘నామినేషన్ అంశం కూడా ఉంది. దానిని పర్యవేక్షించేందుకు అక్కడ మేయర్(ఆప్‌కు చెందిన షెల్లీ ఒబెరాయ్) ఉన్నారు. మీకు అధికారం ఎక్కడి నుంచి వచ్చింది? ఇలా జోక్యం చేసుకొంటూ పోతే ప్రజాస్వామ్యం ఏమైపోతుంది. దీనిలో కూడా రాజకీయాలా?’ అని న్యాయమూర్తులు లెఫ్టినెంట్ గవర్నర్‌ను నిలదీశారు. అయితే ఇతర రాష్ట్రాల గవర్నర్ల ప్రవర్తనపై సుప్రీంకోర్టు, వివిధ హైకోర్టులు విచారిస్తున్న కేసులను దృష్టిలో ఉంచుకుని ధర్మాసనం ఈ విధమైన వ్యాఖ్యలు చేసింది.
అనంతరం బీజేపీకి చెందిన సుందర్ సింగ్ తన్వర్‌ను కమిటీలోకి ఎన్నుకోవడంపై మేయర్ షెల్లీ ఓబ్రాయ్ దాఖలు చేసిన పిటిషన్‌పై స్పందన తెలియజేయాలని ఎల్జీని సుప్రీంకోర్టు ఆదేశించింది.మరోవైపు ఆప్ తరపున అభిషేక్ సింఘ్వీ మను దాఖలు చేసిన పిటిషన్‌పై బెంచ్ స్పందిస్తూ..ఇప్పట్లో ఎన్నికలు నిర్వహించవద్దని.. రెండు వారాల తర్వాత చూడాలని సూచించింది,
Comments
Please login to add a commentAdd a comment