న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ నియామకంపై కేంద్రం, ఆప్ ప్రభుత్వం మధ్య నలుగుతున్న వివాదానికి సుప్రీంకోర్టు ఒక పరిష్కారమార్గం చూపింది. చీఫ్ సెక్రటరీ హోదాకు అర్హులైన అయిదుగురు సీనియర్ పరిపాలనాధికారుల పేర్లను ఈనెల 28న ఉదయం 10.30 గంటల్లోగా సూచించాలని కేంద్రాన్ని కోరింది. అందులో నుంచి ఒకరి పేరును అదే రోజు ఎంపిక చేసుకుని, ఈ వివాదానికి ముగింపు పలకాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
తమతో ఎటువంటి సంప్రదింపులు జరపకుండా కొత్తగా చీఫ్ సెక్రటరీని కేంద్రం నియమించ జాలదంటూ ఢిల్లీ ప్రభుత్వం వేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాల ధర్మాసనం ఈ సూచనలు చేసింది. అంతకుముందు, కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీలోని ఆప్ సర్కార్ చీఫ్ సెక్రటరీ నియామకం విషయంలో పోటాపోటీగా వాదనలు వినిపించాయి.
Comments
Please login to add a commentAdd a comment