న్యూఢిల్లీ: ఛత్‌పూజను పురస్కరించుకుని బుధవారం ప్రభుత్వ సెలవుదినంగా ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించిం ది. ఈ డిమాండ్‌ను చాలకాలంగా నగరంలోని పూర్వాంచల్ వాసులు డిమాండ్ చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ డిమాండ్‌కు సానుకూల స్పం దన వచ్చింది. ఇందుకు బీజేపీ నగరశాఖ బాసటగా నిలిచింది. బీజేపీ ప్రతినిధి బృందం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్పోలియాను సోమవారం కలిసింది. ఛత్‌ను పురస్కరించుకుని బుధవారం సెలవు దినంగా ప్రక టించాలని కోరింది. ఈ ప్రతిపాదనను లెప్టినెంట్ గవర్నర్ ఆమోదించడంతో ఢిల్లీ ప్రభుత్వం సెలవు దినం గా ప్రకటిస్తూ నోటిఫికేషన్ జారీచేసింది. తమ విజ్ఞప్తి మేరకు సెలవు దినంగా ప్రకటించినందుకు బీజేపీ ఢిల్లీ శాఖ అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయ హర్షం ప్రకటించారు.
నిరాకరించిన గత ప్రభుత్వం: ఛత్ పూజ రోజు సెలవు దినంగా ప్రకటించడానికి గత షీలాదీక్షిత్ ప్రభుత్వం నిరాకరించింది. బీజేపీ పాలిత మున్సిపల్ కార్పొరేష న్లు పలు మార్లు ఈ డిమాండ్ చేసినా ఫలితం లేకపోయింది. ఛత్ ఇది వరకే పరిమిత సెలవు దినాల జాబి తాలో ఉందని, గెజిటెడ్ సెలవు దినాల జాబితాలో లేద ని ప్రభుత్వం అభిప్రాయపడింది. నగర జనాభాలో పూర్వాంచల్‌వాసుల సంఖ్య భారీగా నమోదు అయ్యిం ది. సుమారు 40 లక్షల మంది ఉండవచ్చని అంచనా.
ఛత్ పూజ రోజు సెలవు
Published Tue, Oct 28 2014 10:14 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
Advertisement