Satish Upadhyay
-
చీలిక దిశగా ఆప్!
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)లో విభజన రానుందని ఢిల్లీ బిజెపి మాజీ అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయ అన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాల మధ్య విబేధాలు తలెత్తాయని, వారి నేతృత్వంలో పార్టీ రెండు వర్గాలుగా చీలనుందని తనకు తెలిసిందని ఆయన ట్వీట్ చేశారు. కేజ్రీవాల్, సిసోడియాల మధ్య విబేధాలకు ముఖ్యకారణం పంజాబ్, గోవా ఎన్నికల్లో ఆప్ ఓటమి చెందడమని అన్నారు. పంజాబ్, గోవా ఎన్నికల్లో ఓటమి తరువాత సిసోడియా వర్గం కేజ్రీవాల్‌పై ఆగ్రహంతో ఉందని చెప్పారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ కు ఎదురుదెబ్బ తగిలింది. పంజాబ్ లో అధికారంలోకి వస్తామన్న అంచనాలు తప్పాయి. గోవాలో అయితే ఖాతా కూడా తెరవలేదు. పంజాబ్, గోవా ఎన్నికల ఫలితాలపై కేజ్రీవాల్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. -
'సీఎం శవరాజకీయాలు'
న్యూఢిల్లీ: ఆప్ నాయకుడు, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై బీజేపీ నాయకులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. హద్దులు దాటొద్దని వార్నింగ్ ఇచ్చారు. ప్రతిదానికి ప్రధాని నరేంద్ర మోదీని వివాదాల్లోకి లాగొద్దని హెచ్చరించారు. కేజ్రీవాల్ మార్కెటింగ్, ప్యాకేజింగ్ నిపుణుడిలా వ్యవహరిస్తున్నారని బీజేపీ ఢిల్లీ అధ్యక్షుడు సతీశ్ ఉపాధ్యాయ్ విమర్శించారు. నీచ రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. రాజ్యాంగబద్దంగా పనిచేయడం లేదని ధ్వజమెత్తారు. ప్రధానికి సలహా ఇచ్చే స్థాయి కేజ్రీవాల్ కు లేదని బీజేపీ ఢిల్లీ ఇన్ చార్జి శ్యామ్ జాజు అన్నారు. పబ్లిసిటీ కోసం ప్రజాధానం వృధా చేస్తున్నారని ఆరోపించారు. ఆనంద్ ప్రభాత్ ప్రాంతంలో జరిగిన 19 ఏళ్ల యువతి హత్యోదంతంతో కేజ్రీవాల్ శవరాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. -
నెల రోజుల్లో చేసిందేమీ లేదు
న్యూఢిల్లీ: అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వంపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) విమర్శల వర్షం కురిపించింది. ఎలాగైనా అధికారంలోకి రావడమే అర్వింద్ కేజ్రీవాల్ లక్ష్యమని ఆరోపించింది. కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల రోజులు పూర్తవుతున్నా చేసింది శూన్యమని దుయ్యబట్టింది. బీజేపీ అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయ ఆదివారం కేజ్రీవాల్ నెల రోజుల పాలనపై విలేకరులతో మాట్లాడారు. ఆప్‌లో నెలకొన్న అంతర్గత పోరుతో పాటు స్టింగ్ ఆపరేషన్ వెలుగు చూడటంతో ఢిల్లీ ప్రజలు తాము కేజ్రీవాల్ చేతిలో మోసపోయామనే భావనలో ఉన్నారని చెప్పారు. మొదటి నుంచి కూడా అధికారం కోసం అర్వింద్ కేజ్రీవాల్ ఆరాటపడ్డారని ఉపాధ్యాయ విమర్శించారు. అంతే కాకుండా ఆప్ మొదటి నెల పాలనతో ఢిల్లీ ప్రజలు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారని తెలిపారు. గత నెల రోజుల పాలనలో ఆప్ చేసిందేమీ లేదన్నారు. కనెక్షన్ ఉన్న ప్రతి కుటుంబానికి నెలకు 20 వేల లీటర్ల వరకు నీటిని సరఫరా చేస్తామని కేజ్రీవాల్ ప్రకటించారు. మరి కనెక్షన్ లేని వారి పరిస్థితేంటి అని సతీష్ ఉపాధ్యాయ ప్రశ్నించారు. అలాగే విద్యుత్ రంగంలో ఢిల్లీని మోడల్ స్టేట్‌గా తీర్చిదిద్దుతామని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. అయితే దానికి సంబంధించి ఎలాంటి రోడ్ మ్యాప్‌ను ఆయన ఇప్పటిదాకా ప్రకటించలేదని విమర్శించారు. -
తాజా పరిస్థితిపై కమలం సమీక్ష
న్యూఢిల్లీ: విధానసభ ఎన్నికల్లో కమలం ఓడిపోతుందని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు పేర్కొన్న నేపథ్యంలో తాజా పరిస్థితులను సమీక్షించేందుకుగాను బీజేపీ రాష్ట్ర శాఖ నాయకులు సోమవారం సమావేశమయ్యారు. పార్టీ కార్యక ర్తల్లో ఉత్తేజితులను చేసేందుకు యత్నించారు.అనంతరం రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయ మీడియాతో మాట్లాడుతూ ‘ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను సవాలు చేయదలుచుకోలేదు. వాటిని నేను ఎందుకు సవాలు చేయాలి. మా పార్టీ అధికారంలోకి వస్తుందనే ధీమా ఉంది. అయితే మేము ఇంతకుముందు చెప్పినంత మెజారిటీ రాకపోవచ్చు.’ అని అన్నారు. -
అరవింద్‌పై ఈసీకి బీజేపీ ఫిర్యాదు
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిన తర్వాత వ్యక్తిగత ఆరోపణలకు దిగుతున్నారంటూ కేజ్రీవాల్‌పై ఎన్నికల సంఘం అధికారులకు బీజేపీ నేతలు గురువారం ఫిర్యాదు చేశారు. ఆయన ఆరోపణలు నిరాధారమైనవని, ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత అటువంటి ఆరోపణలు చేసే హక్కు కేజ్రీవాల్‌కు లేదని తెలిపామని వారు తెలిపారు. ఆప్ నేతపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని తాము ఎన్నికల కమిషన్ ను కోరామని వివరించారు. ఆప్‌పై పరువునష్టం దావా వేయనున్నట్లు చెప్పారు. ఎన్నికల సంఘం అధికారులను కలిసిన వారిలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయ, దక్షిణ ఢిల్లీ ఎంపీ రమేశ్ బిధూడీ, సీనియర్ నేత విజయ్ గోయల్ తదితరులు ఉన్నారు. ఇదిలా ఉండగా, రిలయన్స్ విద్యుత్ కంపెనీలతో బీజేపీ నేత సతీష్‌కు సంబంధాలున్నాయని ఆప్ నేత అరవింద్ ఆరోపించిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన సతీష్ సాక్ష్యాలను చూపిస్తే తాను రాజకీయాలనుంచి తప్పుకుంటానని, లేదంటూ కేజ్రీవాల్ రాజకీయాల నుంచి తప్పుకోవాలని సవాల్ విసిరారు. కాగా, తాను సతీష్‌కు విద్యుత్ కంపెనీలతో ఉన్న సంబంధాలకు సంబంధించి మరిన్ని సాక్ష్యాలను చూపిస్తానని, రాజకీయాల నుంచి తప్పుకునేందుకు ఆయన సిద్ధంగా ఉండాలని కేజ్రీవాల్ మళ్లీ సవాలు విసిరారు. దీంతో రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం మరింత తీవ్రతరమైంది. -
కేజీవ్రాల్‌పై ఈసీకి బీజేపీ ఫిర్యాదు
న్యూఢిల్లీ: న్యూఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌పై బీజేపీ ఢిల్లీ విభాగం అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయ్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. గురువారం పార్టీ సహచరులు ప్రభాత్ ఝా, విజయ్ గోయల్ లతో కలిసి సతీష్ ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. అనంతరం సతీష్ విలేకర్లతో మాట్లాడుతూ.... కేజీవ్రాల్ తనపై అసత్యారోపణలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించడమే కాకుండా తన పరువుకు భంగం వాటిల్లే విధంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. తనకు సంబంధించిన వాస్తవాలన్నీ ఈసీ ముందుంచామని సతీష్ ఉపాధ్యాయ్ తెలిపారు. అయితే హస్తినలో విద్యుత్ సంస్థలకు సతీష్ ఉపాధ్యాయ్‌ల మధ్య ఉన్న ఒప్పందాలను బహిర్గతం చేస్తానని కేజీవ్రాల్ బుధవారం వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సతీష్.. తనపై కేజీవ్రాల్‌పై అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ ఈసీకి ఫిర్యాదు చేశారు. -
ఢిల్లీలో ‘కరెంటు’ మంటలు!
ఎన్నికల నేపథ్యంలో కేజ్రీవాల్, సతీశ్ ఉపాధ్యాయ మాటల యుద్ధం సాక్షి, న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికలు తరుముకొస్తున్న తరుణంలో ఢిల్లీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి! ఎన్నికల్లో బలమైన ప్రత్యర్థుల మధ్య ‘కరెంటు’ మంటలు లేచాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడికి విద్యుత్ కంపెనీలతో సంబంధాలున్నాయని.. ఇదిగో సాక్ష్యాలంటూ ఆమ్ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ఆ ఆరోపణలను రుజువు చేస్తే తాము రాజకీయ సన్యాసం చేస్తామని, లేకుంటే కేజ్రీవాల్ రాజకీయాలు వదిలి వెళ్లిపోవాలని ఢిల్లీ బీజేపీ చీఫ్ సతీశ్ ఉపాధ్యాయ సవాల్ విసిరారు. బుధవారం కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఉపాధ్యాయకు ఢిల్లీలో విద్యుత్ మీటర్లు అమర్చే, రిపేర్ చేసే కంపెనీతో పాటు ఆరు కంపెనీలు ఉన్నాయి. అవన్నీ విద్యుత్ డిస్కంలతో కలిసి పనిచేస్తున్నాయి. ఢిల్లీ బీజేపీ ఉపాధ్యక్షుడు ఆశీష్ సూద్ కూడా ఉపాధ్యాయకు చెందిన ఓ కంపెనీలో గతేడాది వరకు డెరైక్టర్‌గా ఉన్నారు’’ అని చెప్పారు. వారికి విద్యుత్ కంపెనీలతో సంబంధాలున్నాయని తెలిసి కూడా బీజేపీ వారికి పదవులు కట్టబెట్టిందన్నారు. ఇది ప్రజా ప్రయోజనాలను దెబ్బతీయడమేనన్నారు. ఎన్‌సీఎన్‌ఎల్ ఇన్ఫోమీడియా ప్రైవేట్ లిమిటెడ్, ఎన్‌సీఎన్‌ఎల్ పవర్ లిమిటెడ్ కంపెనీలు ఉపాధ్యాయకు చెందినవేనని, ఈ రెండు కంపెనీలు ఇప్పుడు మాయమయ్యాయని, వాటికి రిలయెన్స్, బీఎస్ఈఎస్ భారీ మొత్తంలో చె ల్లింపులు చేశాయని ఆరోపించారు. గతకొద్ది నెలలుగా బీజేపీ మత విద్వేషాలను రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తోందని కేజ్రీవాల్ మండిపడ్డారు. ఆ ఆరోపణలు నిరాధారం: సతీశ్ విద్యుత్ కంపెనీలతో తనకు సంబంధాలున్నాయనే ఆరోపణలను సతీశ్ ఉపాధ్యాయ ఖండించారు. తాను ఉపాధి కోసం వ్యాపారం చేస్తానని, ఇందులో తప్పేం లేదని పేర్కొన్నారు. కేజ్రీవాల్ తనపై చేసిన ఆరోపణలను రుజువు చేస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని, లేకుంటే ఆయన రాజకీయాల నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. దక్షిణాది సమస్యలపై దృష్టి: యోగేంద్ర దేశరాజధానిలోని వివిధ ప్రాంతాల్లో నివిసిస్తున్న దక్షి ణాది రాష్ట్రాల ప్రజల ఇబ్బందుల పరిష్కారంపై ఆప్ ప్రత్యేకంగా దృష్టి సారిస్తుందని ఆ పార్టీ నాయకుడు యోగేంద్రయాదవ్ అన్నారు. తమది కుల, మత, ప్రాంతాలకు అతీతంగా జాతీయ దృక్పథం కలిగిన కలిగిన పార్టీ అని ప్రాంతాల వారీగా ఎజెండాలు ఉండవన్నారు. బుధవారం మధ్యాహ్నం ఢిల్లీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో తెలుగు మీడియాతో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. దక్షిణాది రాష్ట్రాల ప్రజలు పెద్ద సంఖ్యలో ఢిల్లీలో ఉన్నారని, వీరిలో ఎక్కువ మంది మురికి వాడల్లో దుర్బర జీవితం గడుపుతున్నా గత ప్రభుత్వాలు వారి సమస్యలను పట్టించుకోలేదన్నారు. ‘మిషన్ విస్తార్’ పేరిట ఆప్ అన్ని రాష్ట్రాల్లో విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుందన్నారు. -
కేజ్రీవాల్‌పై పోటీకి సిద్ధం
సాక్షి, న్యూఢిల్లీ: న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా పోటీచేయడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు మాజీ మంత్రి కిరణ్ వాలియా ప్రకటించారు. ఆమె మంగళవారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ తనకు పోటీచేయమని బాధ్యత అప్పగించినట్లయితే స్వీకరించడానికి సుముఖంగా ఉన్నానని ఆమె చెప్పారు. కిరణ్ వాలియా అభ్యర్థిత్వాన్ని గురించి కేజ్రీవాల్ వ్యాఖ్యానిస్తూ.. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎక్కడ నుంచైనా పోటీచేయవచ్చన్నారు. న్యూఢిల్లీ నియోజకవర్గంలో కేజ్రీవాల్‌ను ఓడించే సత్తాగల నేతనే బరిలోకి దింపుతామని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా, కాంగ్రెస్ అభ్యర్థుల రెండవ జాబితా బుధవారం వెలువడనుందని తెలియడంతో ఎవరెవరికి ఎక్కడినుంచి పోటీచేయడానికి టికెట్ లభిస్తాయన్న ఊహాగానాలు ఉపందుకున్నాయి. కిరణ్ వాలియాకు న్యూఢిల్లీ, మాజీ స్పీకర్ యోగానంద్ శాస్త్రికి మాలవీయనగర్, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమార్తె శర్మిష్ట ముఖర్జీకి గ్రేటర్ కైలాష్, చౌదరి ప్రేమ్ సింగ్‌కు అంబేద్కర్‌నగర్ టికెట్ లభించవచ్చని అంటున్నారు.గాంధీనగర్ నుంచి ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు అర్విందర్ సింగ్ లవ్లీ పోటీచేయడం అనుమానాస్పదమేనని, ప్రచార బాధ్యతల కారణంగా ఆయన ఎన్నికల్లో పోటీచేయకపోవచ్చని అంటున్నారు. గాంధీనగర్ నుంచి తన భార్యను ఎన్నికల బరిలోకి దింపనున్నట్లు వచ్చిన వార్తలను లవ్లీ ఖండించారు. మాజీ మంత్రి రమాకాంత గోస్వామి ఎన్నికల్లో పోటీచేయడానికి నిరాకరించారు. అనారోగ్యం కారణంగా పోటీచేయలేమని రమాకాంత్ గోస్వోమి, రాజేష్ జైన్ తెలిపినపార్టీవర్గాలు పేర్కొన్నాయి. -
మురికివాడవాసులకు ఆవాసాలు
న్యూఢిల్లీ : విధానసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మురికివాడవాసులకు బీజేపీ గాలం వేస్తోంది. వారికి తాగునీటి వసతి, పారిశుధ్యం వంటి ఆశలు కల్పిస్తోంది. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు ఈ విషయంలో విమర్శనాస్త్రాలను సంధిస్తున్నప్పటికీ తనదైన ఎజెండాతో ముందుకు సాగుతోంది. 2022 నాటికల్లా మురికివాడవాసులందరికీ తగు వసతులు కల్పిస్తామంటూ ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయ, సీనియర్ నాయకుడు విజయ్గోయల్లు భరోసా ఇస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే వారు ఉన్నచోటే ఇళ్లు కట్టిస్తామంటున్నారు.పార్టీ కార్యాలయం వద్ద మంగళవారం ఈ విషయమై రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయ మీడియాతో మాట్లాడుతూ ‘ఎవరినీ ప్రస్తుత నివాసాలనుంచి బయటికి వెళ్లగొట్టం. వారికి అదే స్థలంలో ఇళ్లు కట్టి ఇస్తాం. అక్కడే పునరావాసం కల్పిస్తాం’అని పేర్కొన్నారు. మురికివాడలున్న చోటే ఇళ్ల నిర్మాణమనేది తమ పార్టీ నినాదమన్నారు. ‘ముంబైలోని మురికివాడవాసుల మాదిరిగానే తాము కూడా ఇక్కడి వారికి కూడా ఆరోగ్యం, పారిశుధ్యం, విద్య తదితర వసతులు కల్పిస్తాం. అంతేకాకుండా ఆయా ప్రాంతాల్లో నైపుణ్య వికాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేస్తాం. అక్కడి యువత మాదక ద్రవ్యాలబారినపడకుండా తగు చర్యలు తీసుకుంటాం’అని అన్నారు. అనంతరం ఆ పార్టీ సీనియర్ నాయకుడు విజయ్ గోయల్ మాట్లాడుతూ ఆప్, కాంగ్రెస్ పార్టీలు తమపై దుష్ర్పచారం సాగిస్తున్నాయన్నారు. ఇళ్లు కట్టించి ఇస్తామని తాము చెబుతుంటే కూల్చివేస్తారంటూ అక్కడి వారిని భయపెట్టేందుకు యత్నిస్తున్నాయన్నారు. వారికి చక్కెర, గోధుమలు, బియ్యం అందేవిధంగా చూస్తామన్నారు. మురికివాడల్లేని నగరంగా ఢిల్లీ కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు సాక్షి, న్యూఢిల్లీ : జేజే క్లస్టర్వాసుల జీవన స్థితిగతులను మెరుగుపరచడమే లక్ష్యంగా కేంద్రం ముందుకు సాగుతోంది. ఇందులోభాగంగా వచ్చే ఐదేళ్లలో నగరంలోని మొత్తం 685 జేజే క్లస్టర్లను పునరాభివృద్ధి చేయనుంది. కేంద్ర పట్టణాభివద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు మంగళవారం పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖ, గృహనిర్మాణం, పేదరిక నిర్మూలన మంత్రిత్వ శాఖల కార్యదర్శులు, డీడీఏ వైస్‌చైర్మన్, డీయూఎస్ఐబీ ప్రధానాధికారితోపాటు ఢిల్లీ ప్రభుత్వ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమావేశంలో ఈ అంశంపై చర్చించారు. ఢిల్లీని మురికివాడలు లేని నగరంగా అభివృద్ధి చేయాల్సిన ఆవశ్యకతను ఈ సందర్భంగా వెంక య్యనాయుడు నొక్కిచెప్పారు. మురికివాడల అభివృద్ధికి అడ్డంకులు సృష్టించే మాఫియా శక్తులను ఉపేక్షించరాదని, కఠినవైఖరి అవలంబించాలని ఆయన సూచించారు. కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వాలు కలిసి వారంలోగా జేజే క్లస్టర్ల పున రాభివృద్ధికి మార్గదర్శకాలను రూపొందించాలంటూ ఆదేశించారు. గుజరాత్, మహారాష్ట్ర, చైన్నై నమూనాలను ఆధారంగా తీసుకుని నగరంలోని జేజేక్లస్టర్లను పునరాభివృద్ధి చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఈక్లస్టర్లలో లబ్ధిదారుల గుర్తింపు కోసం 1.6.2014ని కటాఫ్ డేట్‌గా పరిగణించాలని కూడా ఇదే సమావేశంలో నిర్ణయించారు. -
వ్యాపారులను కేజ్రీవాల్ తప్పుదారి పట్టిస్తున్నారు
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) హయాంలో వాణిజ్య సముదాయాలపై అధికారుల దాడులు తగ్గిపోయాయని ప్రకటించడంద్వారా వ్యాపారవర్గాలను అరవింద్ కేజ్రీవాల్ తప్పుదారి పట్టిస్తున్నారని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయ ఆరోపించారు. సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద సేకరించిన వివరాలను సోమవారం ఆయన మీడియా ముందుంచారు. 2014, జనవరి ఐదో తేదీనుంచి ఫిబ్రవరి 14వ తేదీవరకూ ఆప్ అధికారంలో ఉందని, అప్పట్లో మొత్తం 151 పర్యాయాలు వాణిజ్య సముదాయాలపై దాడులు జరిగాయన్నారు. ఇందులో జనవరి ఐదో తేదీనుంచి 31వ తేదీవరకూ 51 జరిగాయని, తమ పార్టీ అధికారంలో ఎక్కువకాలం కొనసాగబోదని అర ్దమయ్యాక మరో 100 సార్లు దాడులు జరిగాయన్నారు. ఆ సమయంలో ప్రభుత్వ రాబడి కూడా గణనీయంగా పెరిగిందన్నారు. కొట్టిపారేసిన ఆప్ వ్యాపారవర్గాలను తాము తప్పుదారి పట్టిస్తున్నామంటూ బీజేపీ చేసిన విమర్శలను ఆప్ కొట్టిపారేసింది. నిరాశకు లోనైనందువల్లనే ఇటువంటి అబద్ధాలను ప్రచారం చేస్తోందంది. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ‘ కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే ఢిల్లీవాసులను తప్పుదారి పట్టించేందుకు బీజేపీ యత్నిస్తోంది. చిన్న చిన్న వ్యాపారులపై మా హయాంలో ఎటువంటి దాడులూ జరగలేదు. పెట్రోల్ బంకుల్లో నమూనాల సేకరణ కోసం జరిపిన తనిఖీలను కూడా దాడులుగా పేర్కొంటోంది. తాము అధికార పీఠం నుంచి తప్పుకున్నాక ప్రతి నెలా 250 నుంచి 300 వరకూ దాడులు జరుగుతున్నాయి.’ అని సదరు ప్రకటనలో పేర్కొంది. -
ఢిల్లీ చలన చిత్రోత్సవం ప్రారంభం
న్యూఢిల్లీ : ప్రముఖ నిర్మాత సుభాష్గాయ్, బీజేపీ ఢిల్లీ విభాగం అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయ శనివారం ఎన్డీఎంసీ సమావేశపు హాల్లో ఢిల్లీ చలన చిత్రోత్సవం-2014 (డీఐఎఫ్ఎఫ్)ను ప్రారంభించారు. 8 రోజుల పాటు నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో 45 దేశాలకు చెందిన 250 చిత్రాలను ప్రదర్శించనున్నారు. డీఐఎఫ్ఎఫ్ ప్రచారకర్త రామకిషోర్ పర్చా, ఎన్డీఎంసీ చైర్మన్ జలజ శ్రీవాత్సవ పాల్గొన్నారు. హిందీ చలన చిత్రాలకు చేసిన సేవలకు జీవన సాఫల్య పురస్కారం పొందిన గాయ్ మాట్లాడుతూ.. సినిమాలు సమాజాన్ని ప్రభావితం చేస్తాయని చెప్పారు. ‘సినిమాలు సమాజం వాస్తవ దృక్పథాన్ని ప్రతిబింబిస్తాయి. సమస్యలకు పరిష్కారాన్ని చూపుతాయి. ఇవన్నీ వినోదాత్మక పద్ధతిలోనే ప్రజలకు అందజేస్తాయని’ అందుకే ఒకే వేదికపై వివిధ దేశాల సినిమాల ప్రదర్శన ఏర్పాటు చేసిన నిర్వహకులకు అభినందనలు తెలియజేస్తున్నానన్నారు. ఇలాంటి కార్యక్రమాలకు తన సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. ‘ఢిల్లీలో ఎవరైనా సినిమా నిర్మించాలనుకుంటే, ఒక లేఖ ద్వారానే ఎన్డీఎంసీ అనుమతి ఇస్తుందని ఎన్డీఎంసీ చైర్మన్ పార్చా తెలిపారు. దర్శకద్వయం మీను గౌర్, ఫర్జాద్ నబీ రూపొందించిన ‘జిందా బాగ్’తో ఈ ఉత్సవాలు ముగుస్తాయి. విమర్శకుల ప్రశంసలు అందుకొన్న ఈ పాకిస్తాన్ చలన చిత్రంలో ప్రముఖ న టుడు నజీరొద్దీన్షా నటించారు. ఇంకా ఈ ఉత్సవాల్లో పాకిస్తాన్ చిత్ర నిర్మాత, దర్శకుడు జామిలీ దేహల్వీ రూపొందించిన ‘ఇన్ఫినైట్ జస్టిస్’ బంగ్లాదేశ్‌కు చెందిన కాలిద్ మహ్మద్ మితు రూపొందించిన ‘ గ్లో ఆఫ్ ద ఫైర్‌ఫ్లై’, నేపాలీ చిత్రం ‘తలాక్గంజ్ వర్సెస్ తుల్కే’ సినిమాలు ప్రముఖంగా ప్రదర్శించనున్నట్లు నిర్వాహకలు పేర్కొన్నారు. -
దళితులకు ఆర్థిక, సామాజిక భద్రత
న్యూఢిల్లీ: దళితుల అభ్యున్నతికి 2015 సంవత్సరాన్ని అంకితమిస్తామని బీజేపీ నాయకులు సోమవారం ఇక్కడ హామీల వర్షం కురిపించారు. రామ్‌లీలా మైదాన్‌లో ఆల్ ఇండియా కాన్ఫెడరేషన్ ఆఫ్ ఎస్సీ/ఎస్టీ సంస్థ నిర్వహించిన సభలో బీజేపీ ఢిల్లీ విభాగం అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయ మాట్లాడుతూ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సైతం దళితులను ఉద్ధరిస్తామని చెప్పారని అన్నారు. రాజకీయ పార్టీలు దళితులను ఓటు బ్యాంకుగానే పరిగణిస్తున్నాయని, ఇకపై ఇది మాత్రం కొనసాగబోదని ఉపాధ్యాయ పేర్కొన్నారు. ఢిల్లీలోని దళితుల కోసం పని చేయాలని వచ్చే సంవత్సరాన్ని బీజేపీకి వారికి అంకితమిస్తోందని చెప్పారు. ఆ ఏడాదంతా దళితులు నివాసముండే ఢిల్లీలోని మురికివాడలపైనే దృష్టిని కేంద్రీకరిస్తామని అన్నారు. ఈ సభలో మాట్లాడిన రోడ్డు రవాణా, జాతీయ రహదారులు, నౌకాయాన మంత్రి నితిన్ గడ్కరీ సభికులను బీజేపీలో భాగస్వాములు కావాలని కోరారు. ఢిల్లీలోని ప్రతిపక్ష పార్టీలు బీజేపీని దళిత వ్యతిరేక పార్టీగా ముద్ర వేశాయని గడ్కరీ ఆరోపించారు. ఓ వ్యక్తి గుణ లక్షణాలు, సాధించిన విజయాలను గూర్చి కేవలం బీజేపీ మాత్రమే మాట్లాడుతుందని, అతని నేపథ్యాన్ని పట్టించుకోదని పేర్కొన్నారు. -
'ఢిల్లీ డైలాగ్'... యువతతో చెలగాటం
న్యూఢిల్లీ: 'ఢిల్లీ డైలాగ్' కార్యక్రమం ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) యువత భావోద్వేగాలతో ఆడుకుంటోందని బీజేపీ విమర్శించింది. ఇటువంటి కార్యక్రమాల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని, ఎవరి వలలోనూ పడొద్దని హెచ్చరించింది. జనతా దర్బార్ తో సహా గత మూడేళ్లలో ఇలాంటి కార్యక్రమాలు ఆప్ చేపట్టి తర్వాత చేతులెత్తేసిందని బీజేపీ ఢిల్లీ అధ్యక్షుడు సతీఫ్ ఉపాధ్యాయ ఆరోపించారు. సీఎం పీఠం ఎక్కిన వ్యక్తి వెనుక డోర్ నుంచి పారిపోయారని కేజ్రీవాల్ ను ఎత్తిపొడిచారు. ప్రస్తుతం నరేంద్ర మోదీని యువత తమ రోల్ మోడల్ గా భావిస్తోందని సతీష్ ఉపాధ్యాయ అన్నారు. -
విజయకేతన మే లక్ష్యం ప్రాబల్యంలేని ప్రాంతాలపై కమలం దృష్టి
న్యూఢిల్లీ: త్వరలో జరగనున్న విధానసభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కమలదళం ముందుకుసాగుతోంది. ఇందులోభాగంగా గత ఎన్నికల్లో అంతగా ప్రభావం చూపని నియోజకవర్గాలపై దృష్టి సారిం చింది. గత విధానసభ ఎన్నికల్లో న్యూఢిల్లీ, తూర్పు న్యూఢిల్లీ నియోజకవర్గాల్లో కమలానికి ఆశించినమేర ఫలితాలు రాలేదు. ఈ నేపథ్యంలో ఈ రెండు నియోజకవర్గాల్లో తన పట్టును పెంచుకోవాలని నిర్ణయించింది. ఆ దిశగా అడుగులు వేస్తోంది. ఇందులోభాగంగా మయూర్ విహార్, షహదారా నియోజకవర్గాలకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలతో శనివారం సమావేశమైంది. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయ, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొందరు నాయకులు మాట్లాడుతూ ఇప్పటికే ఈ రెండు నియోజకవర్గాల్లో సభ్యత్వ కార్యక్రమాన్ని ప్రారంభించామని, ఓటర్లను ఆకట్టుకునేందుకుగాను త్వరలో వినూత్న కార్యక్రమాలతో ముందుకు సాగనున్నామని తెలియజేశారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు కంచుకోటగా భావించే తూర్పు ఢిల్లీ నియోజకవర్గంలో బీజేపీ విజయపతాకం ఎగురవేసింది. అయితే 2013 నాటి విధానసభ ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో ఆప్ విజయకేతనం ఎగురవేసిన సంగతి విదితమే. గత విధానసభ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక పవనాలు బలంగానే ఉన్నప్పటికీ బీజేపీ ఓటుబ్యాంకు పెరగలేదు. అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలో కొత్తగా ఆవిర్భవించిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మాత్రం తూర్పు ఢిల్లీ లోక్‌సభ పరిధిలోని పది నియోజకవర్గాలకుగాను ఆరింటిని కైవసం చేసుకుంది. ఈ విషయమై ఆ పార్టీ నాయకుడొకరు మాట్లాడుతూ తూర్పుఢిల్లీ నియోజకవర్గంపైనే ప్రధానంగా దృష్టి సారించామన్నారు. ఓటర్లను ఆకట్టుకునేందుకుగాను బూత్‌స్థాయిలో సమావేశాలను నిర్వహిస్తున్నామన్నారు. ఓటర్ల జాబితాను కూడా త్వరలో పరిశీలిస్తామన్నారు.కాగా ఢిల్లీ శాసనసభ సభ్యుల సంఖ్య 70. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో బీజేపీ తరఫున మొత్తం 31 మంది శాసనసభకు ఎన్నికయ్యారు. అయితే వీరిలో హర్షవర్ధన్, పర్వేష్ వర్మ, రమేశ్ బిధూరీలు ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించడంతోపాటు కేంద్రమంత్రలుగా బాధ్యతలను నిర్వహిస్తుండడంతో ఆ పార్టీ సభ్యుల సంఖ్య 31 నుంచి 28కి పడిపోయింది. మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యుల సంఖ్య 28. ఇందులో రెబెల్ ఎమ్మెల్యే వినోద్‌కుమార్ బిన్నీని ఆ పార్టీ బహిష్కరించడంతో వారి సంఖ్య 27కు పడిపోయింది. ఇక కాంగ్రెస్‌కు ఎనిమిది, ఎల్జేపీ, అకాలీదళ్ పార్టీలకు ఒక్కొక్కరు చొప్పున సభ్యులు ఉన్నారు. ఆప్ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కొన్నాళ్లక్రితం ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సన్నద్ధత వ్యక్తం చేసినప్పటికీ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చేందుకు నిరాకరించడంతో అది సాధ్యం కాలేదు.ఇదిలాఉంచితే ఈ ఏడాది ఫిబ్రవరిలో అప్పటి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేసిన సంగతి విదితమే. 49 రోజులపాటు అధికారంలో ఉన్న కేజ్రీవాల్... జన్‌లోక్‌పాల్ బిల్లును సభ లోకి ప్రవేశపెట్టలేదనే సాకుతో ఆయన తన పదవినుంచి దిగిపోయారు. ఆ తర్వాత ఢిల్లీలో రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చింది. ప్రస్తుతం లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్ సారథ్యంలో అధికారిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఢిల్లీ విధానసభను రద్దు చేసిన సంగతి విదితమే. -
ఓటమిని ఒప్పుకున్నట్లనిపిస్తోంది
న్యూఢిల్లీ: ఆరుగురు మాజీ శాసనసభ్యులకు త్వరలో జరగనున్న ఎన్నికల్లో టికెట్లు ఇవ్వకపోవచ్చనే వార్తల నేపథ్యంలో కమలదళం.. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)పై చెణుకులు విసిరింది. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తన ఓటమిని అంగీకరిస్తుందనడానికి ఈ యోచనే ఓ సంకేతమంది. షహధారా ప్రాంతంలో ఆదివారం జరిగిన పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశంలో బీజేపీ రాష్ర్ట శాఖ అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయ ప్రసంగించారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయానికి అన్నివిధాలుగా కృషి చేయాలని నాయకులు, కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు. ఇంటింటి ప్రచారం చేపట్టాలని కోరారు. కాగా మాజీ స్పీకర్ మణిందర్‌సింగ్ ధర్, రాజు ధింగన్, ధర్మేంద్ర సింగ్ కోలి, హరీష్ ఖన్నా, రాజేష్గార్గ్తోపాటు మరొకరికి త్వరలో జరగనున్న ఎన్నికలకు సంబంధించి టికెట్లు ఇవ్వకూడదని ఆప్ నిర్ణయించిందని సమాచారం. వారు పనితీరును ఆధారంగా చేసుకునే ఈ నిర్ణయానికి వచ్చిందని తెలియవచ్చింది. అనంతరం ఎంపీ మనోజ్ తివారీ మాట్లాడుతూ తన పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోని పది నియోజకవర్గాల్లో పార్టీ విజయకేతనం ఎగురవేసేలా అంతా సమష్టిగా కృషి చేయాలన్నారు. త్వరలో వెబ్సైట్ విధానసభకు త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వెబ్‌సైట్‌ను ప్రారంభించాలని బీజేపీ నిర్ణయించింది. కొన్ని కారణాల వల్ల ఈ సైట్‌ను గత నాలుగు నెలలుగా మూసివేసిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో కొత్త వెబ్‌సైట్‌ను ప్రారంభించాలని నిర్ణయించింది. రెండు లేదా మూడు రోజుల్లో ఇది ప్రారంభమయ్యే అవకాశముంది. ప్రత్యర్థి పార్టీ అయిన ఆప్... తన వెబ్‌సైట్‌ను ఎన్నికల ప్రచారం కోసం ఎంతో బాగా వినియోగిస్తున్న నేపథ్యంలో బీజేపీ కూడా అదే బాట పట్టింది. కాగా ఢిల్లీ శాసనసభ సభ్యుల సంఖ్య 70. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో మొత్తం 31 మంది శాసనసభకు ఎన్నికయ్యారు. అయితే వీరిలో హర్షవర్ధన్, పర్వేష్ వర్మ, రమేశ్ బిధూరీలు ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించడంతో ఆ పార్టీ సభ్యుల సంఖ్య 31 నుంచి 28కి పడిపోయింది. మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యుల సంఖ్య 28 కాగా వారిలో రెబెల్ ఎమ్మెల్యే వినోద్‌కుమార్ బిన్నీని బహిష్కరించడంతో వారి సంఖ్య 27కు పడిపోయింది. ఇక కాంగ్రెస్‌కు ఎనిమిది, ఎల్జేపీ, అకాలీదళ్ పార్టీలకు ఒక్కొక్కరు చొప్పున సభ్యులు ఉన్నారు. ఆప్ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కొన్నాళ్లక్రితం సన్నద్ధత వ్యక్తం చేసినప్పటికీ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చేందుకు నిరాకరించడంతో అది సాధ్యం కాలేదు. ఇదిలాఉంచితే ఈ ఏడాది ఫిబ్రవరిలో అప్పటి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేసిన సంగతి విదితమే. 49 రోజులపాటు అధికారంలో ఉన్న కేజ్రీవాల్... జన్‌లోక్‌పాల్ బిల్లును సభ లోకి ప్రవేశపెట్టలేదనే సాకుతో ఆయన తన పదవినుంచి దిగిపోయారు. ఆ తర్వాత ఢిల్లీలో రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చింది. ప్రస్తుతం లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్ సారథ్యంలో అధికారిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. -
రోడ్డుపై చెత్త వేసి మరీ ‘స్వచ్ఛభారత్’!
ఢిల్లీలో బీజేపీ నేతల నిర్వాకం న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఇటీవల అట్టహాసంగా ప్రారంభమైన ‘స్వచ్ఛభారత్’ కార్యక్రమం దేశ రాజధాని ఢిల్లీలో నవ్వులపాలైంది. బీజేపీ ఢిల్లీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయ్ సమక్షంలో జరిగిన ‘స్వచ్ఛభారత్’ కార్యక్రమం ఇందుకు వేదికైంది. బుధవారం ఢిల్లీలో శుభ్రంగా ఉన్న లోధీ రోడ్డులోని ఇండియా ఇస్లామిక్ సెంటర్ వద్ద పురపాలక సంఘం పారిశుద్ధ్య కార్మికులు చెత్త, వ్యర్థాలను తెచ్చి పడేశారు. ఆ ప్రాంతమంతా పరుచుకునేలా కాళ్లతో చెత్తను నెట్టేశారు. అనంతరం సెంటర్ నుంచి బయటికొచ్చిన బీజేపీ ఢిల్లీ శాఖ అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయ్(కాషాయం రంగు కుర్తా ధరించిన వ్యక్తి), మాజీ ‘ఆప్’ నాయకురాలు షాజియా ఇల్మీ, ఇంకొందరు నేతలు ఎంచక్కా చీపుర్లు చేతబట్టి అదే స్థలాన్ని ఊడ్చేశారు. అపరిశుభ్ర ప్రాంతాలను గాలికి వదిలేసి శుభ్రంగా ఉన్న ప్రాంతాల్లో బీజేపీ నేతలు ‘స్వచ్ఛభారత్’ నిర్వహించడంతో విమర్శలు వెల్లువెత్తాయి. స్వచ్ఛభారత్ పట్ల కేంద్ర ప్రభుత్వం, బీజేపీ పార్టీ చిత్తశుద్ధి, ద్వంద్వ వైఖరి ఈ ఘటనతో తేటతెల్లమైందని కాంగ్రెస్, ఆప్ పార్టీలు దుమ్మెత్తిపోశాయి. చెత్త వేసిన సంగతే తనకు తెలియదని ఉపాధ్యాయ్ వివరణ ఇచ్చారు. -
సమష్టిగా ఎన్నికల బరిలోకి
న్యూఢిల్లీ: సమష్టి నాయకత్వం నేతృత్వంలో విధానసభ ఎన్నికల బరిలోకి దిగుతామని బీజేపీ రాష్ర్ట శాఖ అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయ పేర్కొన్నారు. విధానసభను కేంద్ర మంత్రివర్గం మంగళవారం రద్దుచేసిననేపథ్యంలో పార్టీ కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలతో సమావేశమై తాజా రాజకీయ పరిస్థితిని సమీక్షించారు. దీంతోపాటు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపైనా చర్చించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ విధానసభ ఎన్నికల్లో విజయం తమదేనంటూ ధీమా వ్యక్తం చేశారు. విధానసభ రద్దు ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడంపట్ల హర ్షం వ్యక్తం చేశారు. ‘సుపరిపాలనతోపాటు విశ్వాసం పేరిట ప్రజల వద్దకు వెళతాం. విజయం సాధిస్తాం’ అని అన్నారు. బీజేపీ సీఎం అభ్యర్థి ఎవరంటూ మీడియా ప్రశ్నించగా జవాబిచ్చేందుకు నిరాకరించారు. సరైన సమయంలో పార్టీ ఓ నిర్ణయం తీసుకుంటుందన్నారు. అయితే తాను మాత్రం ఆ పదవి రేసులో లేనన్నారు. -
బీజేపీ ఢిల్లీ విభాగం కొత్త కార్యవర్గం
సాక్షి, న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ ఢిల్లీ విభాగం అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయ కొత్త టీమ్‌ను ప్రకటిం చారు. పార్టీ అధ్యక్షునిగా పదవిని చేపట్టిన మూడు నెలల అనంతరం తన కార్యవర్గాన్ని నియమించుకున్నారు. కేంద్ర నాయకత్వం, ఆర్ఎస్ఎస్తో సంప్రదిం పులు జరిపిన తరువాత ప్రకటించిన కొత్త బృందంలో సీనియర్ నాయకులకు సంతృప్తి కలిగించేలా అన్ని వర్గాల వారికి చోటు కల్పించారు. అరుణ్ జైట్లీ, సుష్మాస్వరాజ్, విజయ్ గోయల్, హర్షవర్దన్లతో పాటు మదన్‌లాల్ ఖురానాకు సన్నిహితులైనవారికి కూడా చోటు కల్పించారు. మారుతోన్న రాజకీయ పరిణామాల దృష్ట్యా ఎమ్మెల్యేలకు ఎవరికీ కొత్త జట్టులో చోటు కల్పించలేదు. నగరంలో ఎన్నికలు జరిగే అవకాశం ఉండడం వల్ల ఎమ్మెల్యేలకు కొత్త జట్టులో చోటు కల్పించి వారికి పనిభారం పెంచరాదని ఆర్ఎస్ఎస్ సూచించిందని అంటున్నారు. నగర రాజకీయాలలో కౌన్సిలర్లు కీలకపాత్ర పోషించే అవకాశం ఉండడంతో తన జట్టులో ఎక్కువ మంది కౌన్సిలర్లకు చోటు దక్కేలా సతీష్ ఉపాధ్యాయ జాగ్రత్త పడ్డారు. జనరల్ సెక్రటరీలుగా తనకు అత్యంత సన్నిహితులైన దక్షిణ ఢిల్లీ ఎంపీ రమేష్ బిధూడీ, కౌన్సిలర్లు రేఖా గుప్తా, ఆశీష్ సూద్‌లను నియమించుకున్నారు.వీరు కాక ఎనిమిది మంది ఉపాధ్యక్షులను, ఎని మిది మంది కార్యదర్శులను నియమించారు. ఉపాధ్యక్షులుగా తిలక్‌రాజ్ కటారీ, రజనీ అబ్బీ, విశాఖ సైలానీ, జైప్రకాశ్, శిఖా రాయ్, అభయ్ వర్మ, కిరణ్ చద్దా, కుల్జీత్ కమల్‌లను నియమించారు. కమల్జీత్ షెరావత్‌ను మహిళా విభాగం ప్రెసిడెంట్‌గా, నకుల్ భరద్వాజ్‌ను యువ విభాగం అధ్యక్షునిగా నియమిం చారు. అమన్ సిన్హా, పూనం ఆజాద్, గిరీష్ ఖురానా, రాజీవ్ బబ్బర్, దీపికా శర్మను ప్రతినిధులుగా, ప్రవీణ్ శంకర్ కపూర్‌ను మీడియా కన్వీనర్‌గా నియమిం చారు. శ్యామ్‌లాల్ గర్గ్‌ను కోశాధికారిగా నియమిం చారు. విజయ్‌శర్మ ఆర్గనైజేషన ల్ జనరల్ సెక్రటరీగా ఉంటారు. సతీ్‌ష్ ఉపాధ్యాయ తనకు సన్నిహితంగా మెలిగే ముగ్గురు శాసనసభ్యులను మూడు మున్సిపల్ కార్పొరేషన్లకు కన్వీనర్లుగా నియమించారు. సుభాష్ సచ్‌దేవాను దక్షిణ ఢిల్లీ, కుల్వంత్ రాణాను ఉత్తర ఢిల్లీ, మనోజ్ షౌకీన్ను తూర్పు ఢిల్లీ కార్పొరేషన్ కన్వీనర్లుగా నియమించారు. స్వచ్చ్ భారత్ అభియాన్ కోసం ప్రత్యేకంగా సెల్‌ను కూడా నియమించారు. -
ఛత్ పూజ రోజు సెలవు
న్యూఢిల్లీ: ఛత్‌పూజను పురస్కరించుకుని బుధవారం ప్రభుత్వ సెలవుదినంగా ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించిం ది. ఈ డిమాండ్‌ను చాలకాలంగా నగరంలోని పూర్వాంచల్ వాసులు డిమాండ్ చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ డిమాండ్‌కు సానుకూల స్పం దన వచ్చింది. ఇందుకు బీజేపీ నగరశాఖ బాసటగా నిలిచింది. బీజేపీ ప్రతినిధి బృందం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్పోలియాను సోమవారం కలిసింది. ఛత్‌ను పురస్కరించుకుని బుధవారం సెలవు దినంగా ప్రక టించాలని కోరింది. ఈ ప్రతిపాదనను లెప్టినెంట్ గవర్నర్ ఆమోదించడంతో ఢిల్లీ ప్రభుత్వం సెలవు దినం గా ప్రకటిస్తూ నోటిఫికేషన్ జారీచేసింది. తమ విజ్ఞప్తి మేరకు సెలవు దినంగా ప్రకటించినందుకు బీజేపీ ఢిల్లీ శాఖ అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయ హర్షం ప్రకటించారు. నిరాకరించిన గత ప్రభుత్వం: ఛత్ పూజ రోజు సెలవు దినంగా ప్రకటించడానికి గత షీలాదీక్షిత్ ప్రభుత్వం నిరాకరించింది. బీజేపీ పాలిత మున్సిపల్ కార్పొరేష న్లు పలు మార్లు ఈ డిమాండ్ చేసినా ఫలితం లేకపోయింది. ఛత్ ఇది వరకే పరిమిత సెలవు దినాల జాబి తాలో ఉందని, గెజిటెడ్ సెలవు దినాల జాబితాలో లేద ని ప్రభుత్వం అభిప్రాయపడింది. నగర జనాభాలో పూర్వాంచల్వాసుల సంఖ్య భారీగా నమోదు అయ్యిం ది. సుమారు 40 లక్షల మంది ఉండవచ్చని అంచనా. -
మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు తర్వాతే ఢిల్లీలో రాజకీయ అనిశ్చితిపై నిర్ణయం
ఢిల్లీలో రాజకీయ అనిశ్చితిపై కమలదళం త్వరలో ఓ నిర్ణయం తీసుకోనుంది. మహారాష్ట్రలో నూతన ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ విషయంపై స్పష్టత రానుంది. దేశవ్యాప్తంగా తమ పార్టీకి చక్కని ఆదరణ ఉందని, తాజా ఎన్నికలకు తాము సిద్ధమేనని, ఈ విషయంలో జంకుతున్నామంటూ ఇతర పార్టీలు చేస్తున్న ఆరోపణలను రాష్ర్ట శాఖ కొట్టిపారేసింది. న్యూఢిల్లీ: మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు తర్వాత ఢిల్లీలో రాజకీయ అనిశ్చితిపై కేంద్రంతోపాటు తమ పార్టీ అధిష్టానం తుది నిర్ణయం తీసుకుంటుందని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయ స్పష్టం చేశారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ తాజా ఎన్నికల విషయంలో తమ పార్టీ పలాయనం చిత్తగిస్తోందంటూ కాంగ్రెస్‌తోపాటు ఆమ్ ఆద్మీ పార్టీ చేసిన విమర్శలను ఆయన తోసిపుచ్చారు. ఎన్నికలకు తమ పార్టీ అన్నివిధాలుగా సిద్ధంగానే ఉందన్నారు. ‘దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల ప్రజలకు తమ పార్టీపై సంపూర్ణ విశ్వాసం ఉంది. మహారాష్ర్టలో ప్రభుత్వ ఏర్పాటు తర్వాతే ఢిల్లీ విషయంలో తమ పార్టీ అధిష్టానం తుది నిర్ణయం తీసుకుంటుంది. రాజకీయ అనిశ్చితికి త్వరలోనే తెరపడుతుతుంది’ అని అన్నారు. మూడు శాసనసభ నియోజకవర్గాలకు ఉప ఎన్నికల తేదీలను ప్రకటించడమంటే తాము తాజా ఎన్నికలకు దూరంగా జరుగుతున్నామని కాదన్నారు. మెజారిటీ తథ్యం శాసనసభ ఎన్నికలు జరిగితే తమకు స్పష్టమైన మెజారిటీ రావడం తథ్యమన్నారు. మూడు శాసనసభ నియోజక వర్గాలకు ఉప ఎన్నికలు జరగడమనేది అనివార్యమని, అది రాజ్యాంగబద్ధ అవసరమని సతీష్ పేర్కొన్నారు. వీటి ఫలితాలు ఢిల్లీ శాసనసభ ఎన్నికలపై ఉండబోవన్నారు. తాము ఎన్నికలకు అన్నివిధాలుగా సిద్ధంగానే ఉన్నామని, తమపై మాటిమాటికీ విమర్శనాస్త్రాలు సంధిస్తున్న కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలే ఎన్నికలకు సన్నద్ధంగా లేవన్నారు. ప్రజాదరణకు అవే రుజువులు హర్యానా, మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల ఫలితాలు దేశవ్యాప్తంగా తమ పార్టీకి ఉన్న ఆదరణకు రుజువులని సతీష్ పేర్కొన్నారు. ఢిల్లీలోనూ అదే జరుగుతుందనే విశ్వాసం తమకు ఉందన్నారు. ప్రభుత్వ ఏర్పాటు విషయంలో ఆర్ఎస్ఎస్ అనుకూలంగా లేదని ఆయన స్పష్టం చేశారు. ఇదే విషయమై అదే పార్టీకి చెందిన మరో సీనియర్ నాయకుడు మాట్లాడుతూ ఒకవేళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటూ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్ తమను ఆహ్వానించినా తిరస్కరిస్తామన్నారు. కాగా ఢిల్లీ శాసనసభ సభ్యుల సంఖ్య 70. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో మొత్తం 31 మంది శాసనసభకు ఎన్నికయ్యారు. అయితే వీరిలో హర్షవర్ధన్, పర్వేష్ వర్మ, రమేశ్ బిధూరీలు ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించడంతో ఆ పార్టీ సభ్యుల సంఖ్య 31 నుంచి 28కి పడిపోయింది. మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యుల సంఖ్య 28 కాగా వారిలో రెబెల్ ఎమ్మెల్యే వినోద్‌కుమార్ బిన్నీని బహిష్కరించడంతో వారి సంఖ్య 27కు పడిపోయింది. ఇక కాంగ్రెస్‌కు ఎనిమిది, ఎల్జేపీ, అకాలీదళ్ పార్టీలకు ఒక్కొక్కరు చొప్పున సభ్యులు ఉన్నారు. ఆప్ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కొన్నాళ్లక్రితం సన్నద్ధత వ్యక్తం చేసినప్పటికీ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చేందుకు నిరాకరించడంతో అది సాధ్యం కాలేదు. ఇదిలాఉంచితే ఈ ఏడాది ఫిబ్రవరిలో అప్పటి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేసిన సంగతి విదితమే. 49 రోజులపాటు అధికారంలో ఉన్న కేజ్రీవాల్... జన్‌లోక్‌పాల్ బిల్లును సభ లోకి ప్రవేశపెట్టలేదనే సాకుతో ఆయన తన పదవినుంచి దిగిపోయారు. ఆ తర్వాత ఢిల్లీలో రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చింది. ప్రస్తుతం లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్ సారథ్యంలో అధికార కార్యక్రమాలు జరుగుతున్నాయి. -
పార్టీ కార్యకలాపాలపైనే దృష్టి పెడతా: ఉపాధ్యాయ
న్యూఢిల్లీ: దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్(ఎస్డీఎంసీ) స్టాండిగ్ కమిటీ చైర్మన్ పదవికి ఢిల్లీ బీజేపీ ప్రదేశ్ అధ్యక్షుడు సతీశ్ ఉపాధ్యాయ రాజీనామా చేశారు. పార్టీ కార్యకలాపాలపై మరింత దృష్టి పెట్టేందుకే రాజీనామా చేస్తున్నట్లు ఉపాధ్యాయ ప్రకటించారు. బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉపాధ్యాయ మాట్లాడుతూ.. ‘రెండు పడవల్లో ప్రయాణం చేయడం సరికాదు. అలాగే ఓ వ్యక్తి రెండు బాధ్యతలను ఏకకాలంలో నిర్వహించడం కూడా సరికాదు. ఏ బాధ్యను కూడా పూర్తి సామర ్థ్యం మేరకు నిర్వహించలేడు. అందుకే ఎస్డీఎంసీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నాను. ఇక పార్టీ కార్యకలాపాలపైనే పూర్తిగా దృష్టిని కేంద్రీకరిస్తాన’ని చెప్పారు. ఎన్నికలకు వెళ్లాలని బీజేపీ యోచిస్తోందా? అని విలేకరులు అడిగిన ప్రశ్నకు సతీశ్ ఉపాధ్యాయ సమాధానమిస్తూ... ‘మేము దేనికైనా సిద్ధంగానే ఉన్నాం. ఇప్పటికే ఈ విషయాన్ని అనేకసార్లు వెల్లడించాం. పార్టీ శ్రేణులను కూడా ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని ఎప్పుడో పిలుపునిచ్చాం. ఎన్నికలు ఉన్నా... లేకున్నా.. పార్టీ కార్యకర్తల సమస్యలను పరిష్కరించడం, పార్టీని బలోపేతం చేయడం వంటి బాధ్యలను పార్టీ నాకు అప్పగించింది. దానిని సమర్థవంతంగా నిర్వహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాను. చైర్మన్ పదవికి రాజీనామా చేసినా కూడా ఎస్‌డీఎంసీలో నాకు సభ్యత్వం ఉంటుందన్న విషయం గుర్తుంచుకోవాలి. ప్రస్తుతం ఈ స్థాయిలో ఉన్నానంటే అందుకు కారణం ఎస్డీఎంసీనే. కౌన్సిలర్ స్థాయి నుంచి స్టాండింగ్ కమిటీ చైర్మన్ వరకు ఎదిగేలా చేసిన పార్టీ శ్రేణులకు కృతజ్ఞతలు చెబుతున్నా’నన్నారు. -
ఈ-రిక్షాలపై నిషేధాన్ని ఎత్తివేయండి
న్యూఢిల్లీ: నగరంలో ఈ-రిక్షాలపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని కోరుతూ బీజేపీ, ఆప్ నేతలు కేంద్ర మంత్రి నితిన్ రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిశారు. బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు సతీశ్ ఉపాధ్యాయ నేతృత్వంలోని ప్రతినిధి బృందం మంగళవారం ఉదయం గడ్కరీతో సమావేశమైంది. ఈ-రిక్షాలు నడుపుకునేవారి ఉపాధికి ఎటువంటి ఆటంకం కలగకుండా ఉత్తమమైన విధివిధానాలను రూపొందించాలని వారు గడ్కరీని కోరారు. ఈ-రిక్షాల విధివిధానాల రూపకల్పనకు సంబంధించి సూచనలు, సలహాలు పదిరోజుల్లోగా ఇవ్వాల్సిందిగా కోరుతూ రవాణా మంత్రిత్వశాఖ నోటిఫికేషన్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. దీంతో తాము నిషేధాన్ని రద్దు చేయాలని కోరామని, రిక్షాలు నడుపుకునేవారికి ప్రయోజనం కలిగేలా చూడాలని సూచించినట్లు చెప్పామని ఢిల్లీ బీజేపీ ప్రదేశ్ అధ్యక్షుడు సతీశ్ ఉపాధ్యాయ తెలిపారు. ‘నగరంలో వేలమంది రిక్షా కార్మికులను కలిసి అభిప్రాయాలు సేకరించాం. వారి కష్టాల గురించి విన్న తర్వాత నిషేధం విధిస్తే కార్మికుల కుటుంబాలు ఆకలితో అలమటిస్తాయనే విషయాన్ని గుర్తించాం. ఇదే విషయాన్ని కేంద్రమంత్రి గడ్కరీతో చెప్పామ’ని ఉపాధ్యాయ తెలిపారు. ఈ విషయమై గడ్కరీ మాట్లాడుతూ.. మరో పదిరోజుల్లో ఈ-రిక్షాలకు సంబంధించి విధివిధానాలు ఖరారు చేస్తామని చెప్పారు. -
షీలా రివర్స్‌గేర్..!
సాక్షి, న్యూఢిల్లీ:ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాన్ని భారతీయ జనతా పార్టీకి ఇవ్వాలని కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, మాజీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ అభిప్రాయపడ్డారు. ప్రజలు, ఎమ్మెల్యేలు ఎన్నికలను కోరుకోవడం లేదన్నారు. ప్రభుత్వం ఏర్పాటుచేయగలమని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయ అంటున్నారని, ఆయన బాధ్యతతోనే ఈ మాటలు అని ఉంటారని షీలాదీక్షిత్ పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలకు ప్రాతినిథ్యం వహించే ప్రభుత్వాలు ఏర్పాటు కావడం మంచిదేనని, ఒకవేళ బీజేపీ ఈ స్థాయికి చేరుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే అది ఢిల్లీకి మంచిదేనని షీలాదీక్షిత్ చెప్పారు. ‘ఆప్, కాంగ్రెస్ పార్టీల నుంచి ఎమ్మెల్యేలుగా ఎన్నికైనవారేకాకుండా ఇతరులు కూడా ఎన్నికలను కోరుకోవడంలేదు. మరోవైపు ప్రజలు కూడా ఢిల్లీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావాలనే కోరుకుంటున్నారు తప్ప ఎన్నికలు జరగాలను కోరుకోవడంలేదు. తాము ఎనుకున్న ప్రజాప్రతినిధుల పదవీకాలం కనీసం ఏడాది కూడా పూర్తి కాలేదనే అభిప్రాయం జనాల్లో కూడా వ్యక్తమవుతోంది. ఇటువంటి సమయంలో తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలమని బీజేపీ అంటున్నప్పుడు.. ముఖ్యంగా పార్టీ అధ్యక్షుడే ఈ మాటలు చెబుతున్నప్పుడు ఆయన బాధ్యతతో మాట్లాడుతున్నారనే భావించారు. అందుకే ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే ప్రయత్నం చేయడానికి బీజేపీకి అవకాశాన్ని ఇవ్వాలి. ఢిల్లీలోనేకాదు మరే ఇతర రాష్ట్రంలోనూ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం లేకపోవడం ప్రజాస్వామ్యంలో సరికాదు. ప్రజలకు వ్యక్తిగతంగా, సమిష్టిగా ఎన్నో సమస్యలు ఉంటాయి. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం లేనట్లయితే తమ సమస్యల పరిష్కారం కోసం వారంతా ఎక్కడికి వెళ్లాలి? ఏం చేయాలో వారికి అర్థం కాదు. అందుకే ప్రభుత్వ ఏర్పాటుకు సుముఖంగా ఉన్న బీజేపీ ప్రయత్నాన్ని అన్ని పార్టీలు స్వాగతించాల’ని షీలాదీక్షిత్ పేర్కొన్నారు. అసెంబ్లీ ఢిల్లీలో కాంగ్రెస్ దాదాపుగా తుడిచిపెట్టుకుపోవడం, దీంతో కేరళ గవర్నర్‌గా షీలా వెళ్లిపోవడం వంటివి జరిగిన తర్వాత క్రీయాశీల రాజకీయాలకు ఆమె దూరంగా ఉన్నారు. ఇటీవల కేరళ గవర్నర్ పదవికి షీలాదీక్షిత్ రాజీనామా చేసిన తర్వాత మళ్లీ ఢిల్లీ రాజకీయాల్లో ఆమె క్రీయాశీలంగా వ్యవహరించనుందనే సంకేతాలు కాంగ్రెస్ నేతల నుంచి వెలువడ్డాయి. ఇక ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటు సంబంధించి రోజుకో పరిణామం చోటుచేసుకోవడం, కాంగ్రెస్, ఆప్‌లు బీజేపీని రోజుకోరకంగా ఇబ్బంది పెడుతున్న తరుణంలో కాంగ్రెస్ నుంచి మూడుసార్లు ముఖ్యమంత్రిగా ప్రాతినిథ్యం వహించిన షీలా వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. షీలా వ్యాఖ్యలు విశ్లేషకులనుసైతం ఆశ్చర్యానికి గురిచేశాయి. బీజేపీ హర్షం షీలాదీక్షిత్ మాటలు కాంగ్రెస్‌కు మింగుడుపడకపోయినా బీజేపీ మాత్రం హర్షం వ్యక్తం చేసింది. ఒక రాజకీయ నేతగా షీలాదీక్షిత్ వ్యాఖ్య పరిణితితో కూడినట్లుగా ఉందని సతీష్ ఉపాధ్యాయ అభిప్రాయపడ్డారు. ‘షీలాజీ సీనియర్ నేత, ఆమెకు రాజ్యాంగ ప్రక్రియ గురించి తెలుస’ని సతీష్ ఉపాధ్యాయ అన్నారు. మద్దతిస్తే సిద్ధమే: అమిత్ షాఇదిలాఉండగా ప్రభుత్వ ఏర్పాటు కోసం బీజేపీ సుముఖంగానే ఉందని, మద్దతు ఇవ్వడానికి ఎవరైనా తమంతట తాముగా ముందుకు వస్తే స్వీకరించడానికి సంకోచించమని పార్టీ అధ్యక్షుడు అమిత్ షా స్పష్టం చేశారు. ఓ ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని తెలిపారు. ఆ వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగత అభిప్రాయమే: కాంగ్రెస్ అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలు జరిపించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తుండగా, మాజీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ అందుకు విరుద్ధంగా మాట్లాడడంపై కాంగ్రెస్ నేతలు విస్మయం చెందుతున్నారు. బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుపై షీలాదీక్షిత్ చేసిన వ్యాఖ్య ఆమె వ్యక్తిగత అభిప్రాయమని కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ స్పష్టం చేశారు. షీలాదీక్షిత్ వ్యాఖ్య దిగ్భ్రమ కలిగించిందని, దానిని ఆమె వ్యక్తిగత అభిప్రాయంగా తాము భావిస్తున్నామని కాంగ్రెస్ నేత ముఖేష్ శర్మ చెప్పారు. కాంగ్రెస్ వైఖరి షీలాదీక్షిత్ మాటలకు భిన్నంగా ఉందన్నారు. ఎన్నికలు జరగాలని తాము కోరుకుంటున్నామని, అనైతిక పద్ధతిలో బీజేపీ ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తే అసెంబ్లీలో తాము బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేస్తామని ఆయన చెప్పారు. ఢిల్లీ అసెంబ్లీలో ఓటింగ్ జరిగితే తమ పార్టీ విప్ జారీచేస్తుందని ఆయన చెప్పారు. షీలాదీక్షిత్ వంటి సీనియర్ నేత ఇటువంటి వ్యాఖ్య చేయడం ఆశ్చర్యంగా ఉందని మాజీ మంత్రి హరూన్ యూసఫ్ అన్నారు. షీలాదీక్షిత్ తన వైఖరిని స్పష్టం చేయాలని మాజీ ఎమ్మెల్యే భీష్మ్ శర్మ డిమాండ్ చేశారు. షీలాదీక్షిత్ బీజేపీతో చేతులు కలిపారని ఆయన ఆరోపించారు. షీలాదీక్షిత్‌కు వ్యతిరేకంగా ఆయన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖరాశారు. షీలాదీక్షిత్‌ను సమర్థించే మతీన్ అహ్మద్ మాత్రం వ్యాఖ్యలను సమర్థించారు. -
సర్కారు ఏర్పాటు చేస్తాం
రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోందని సమాచారం. ఈ మేరకు కాషాయపార్టీకి ఎల్జీ నుంచి సోమవారం ఆహ్వానం అందే అవకాశముందని తెలుస్తోంది. ఇక ముఖ్యమంత్రి రేసులో బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే జగ్దీశ్ ముఖి ముందున్నారు. ఇదిలా ఉంటే ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ ఆహ్వానించకుండా చూడాలని ఆప్ నాయకుల బృందం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కోరింది. సాక్షి, న్యూఢిల్లీ: దేశరాజధానిలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సుముఖంగా ఉన్నట్టు బీజేపీ అధికారికంగా ప్రకటించింది. లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ) నజీబ్ జంగ్ ఆహ్వానిస్తే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయ చెప్పారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలు మద్దతు ఇస్తామంటూ తమను సంప్రదిస్తున్నారని తెలిపారు. తాజాగా ఎన్నికలు జరిపించినా తమకు అభ్యంతరం లేదని చెప్పారు. అసెంబ్లీలో అతి పెద్ద పార్టీ అయిన బీజేపీని ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఆహ్వానించేందుకు అనుమతివ్వాలంటూ ఎల్జీ రాసిన లేఖను హోం మంత్రిత్వశాఖ పరిశీలిస్తోందని తెలిసింది. ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీకి సోమవారం ఆహ్వానం అందవచ్చని కూడా అంటున్నారు. పభుత్వం ఏర్పాటు చేసి అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకోవలసిందిగా ఎల్జీ బీజేపీని కోరవచ్చు. ఎన్టీటీ చట్టం సెక్షన్ 9 ప్రకారం ఎల్జీ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశపర్చవచ్చు. అసెంబ్లీ స్పీకర్ సీక్రెట్ బ్యాలెట్ ద్వారా సీఎంను ఎంపిక చేసుకునే అవకాశం కల్పిస్తే ఇతర పార్టీలను చీల్చికుండానే ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయవచ్చని అంటున్నారు. పార్టీలు విప్ జారీ చేయవచ్చా లేదా అన్నది స్పీకర్ ఇష్టాయిష్టాలపై ఆధారపడి ఉంటుంది. అసెంబ్లీలో అతిపెద్ద పార్టీ అయినప్పటికీ ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సిన సంఖ్యాబలం బీజేపీకి లేదు. మళ్లీ ఎన్నికలు వద్దని, ప్రభుత్వం ఏర్పాటే మేలని బీజేపీ ఎమ్మెల్యేలు అధిష్టానానికి సూచిస్తున్నారు. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యేలు కూడా ఎన్నికలు కోరడం లేదని, వారిలో కొందరు తమ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వవచ్చని బీజేపీ ఎమ్మెల్యేలు చెబుతున్నారు. ఇతర పార్టీలను చీల్చి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన అపఖ్యాతి మూటగట్టుకోవడానికి బీజేపీ సంశయిస్తోంది. ఈ పద్ధతిలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంపై బీజేపీకి నమ్మకం లేదని హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ శనివారం మరోసారి చెప్పారు. పార్టీలను చీల్చకుండానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగగలిగే మార్గాలను బీజేపీ అన్వేషిస్తోంది. ఈ నేపథ్యంలోనే బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఢిల్లీ బీజేపీ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. ప్రభుత్వం ఏర్పాటు చేస్తే తప్పేంటి ?: షా ప్రభుత్వ ఏర్పాటుకు తమ పార్టీ చేస్తున్న ప్రయత్నాలను బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమర్థించారు. ‘ఢిల్లీలో బీజేపీ అతిపెద్ద పార్టీ. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ మాకు స్పష్టమైన ఆధిక్యం దక్కింది. ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నిస్తే అది అనైతికం ఎలా అవుతుంది ? మళ్లీ ఎన్నికలు వద్దని అంతా కోరుకుంటున్నారు’ అని షా అన్నారు. ఇండియాటీవీ షో ఆప్ కీ అదాలత్‌లో మాట్లాడుతూ ఆయన పైవిధంగా అన్నారు. ఎమ్మెల్యేలను కొంటున్నామన్న ఆరోపణలను తోసిపుచ్చారు. -
గడ్కరీని కలిసిన బీజేపీ నేతలు
న్యూఢిల్లీ: బీజేపీ రాష్ర్ట శాఖ ప్రతినిధుల బృందం మంగళవారం కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిసింది. వివాదాస్పద ఈ-రిక్షాల అంశంపై ఈ సందర్భంగా ఆయనతో చర్చించింది. కాగా వీటిపై హైకోర్టు నిషేధం విధించిన తర్వాత వాటిపై ఆధారపడినవారి జీవితాలు అగమ్యగోచరంగా మారిన నేపథ్యంలో బీజేపీ నాయకులు మంత్రిని కలిశారు. ఈ-రిక్షాలపై నిషేధం త్వరలోనే ఎత్తివేసే అవకాశముందని గడ్కరీ ఈ సమావేశంలో ధీమా వ్యక్తం చేశారని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సతీశ్ ఉపాధ్యాయ తెలిపారు. -
అభివృద్ధి పనులకు అనుమతించాలి: బీజేపీ
న్యూఢిల్లీ: అనధికార కాలనీల క్రమబద్ధీకరణ కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఓ ముసాయిదాను రూపకల్పన చేయనుందని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయ స్పష్టం చేశారు. పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కాలనీల క్రమబద్ధీకరణకు ఎదురవుతున్న ఆటంకాలను అధిగమించేందుకు సంబంధించి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఈ సందర్భంగా అవసరమైన సూచనలు చేశారన్నారు. 15 రోజుల్లోగా ముసాయిదాను రూపొందించాలంటూ సంబంధిత అధికారులను కేంద్ర మంత్రి ఆదేశించారన్నారు. కాలనీల క్రమబద్ధీకరణకు కేంద్ర ప్రభుత్వం కచ్చితంగా అనుమతించాలంటూ తాము కేంద్ర మంత్రిని డిమాండ్ చేశామన్నారు. అనధికార కాలనీల్లో అభివృద్ధి పనులను చేపట్టేందుకు మున్సిపల్ కార్పొరేషన్లను అనుమతించాల్సిందిగా ఈ సందర్భంగా మంత్రిని కోరామన్నారు. ఈ కాలనీల్లో సౌకర్యాలు మెరుగుపడితే అక్కడి ప్రజలకు ఎంతో వెసులుబాటు కలుగుతుందన్నారు. మంత్రి ఆదేశాల మేరకు వచ్చేనెల 30వ తేదీలోగా అన్ని విభాగాలు బెటర్ ఢిల్లీ ప్రచార కార్యక్రమాన్ని చేపట్టాల్సి ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో భగంగా నగరవ్యాప్తంగా ల్యాండ్ మ్యాపింగ్ జరుగుతుందన్నారు. ఇందువల్ల పార్కింగ్, పాఠశాలలు, ఆస్పత్రులు,మహిళా హాస్టళ్లు తదితరాలు అందుబాటులోకి వస్తాయన్నారు. -
జోష్ మీదున్న ఢిల్లీ బీజేపీ
సాక్షి, న్యూఢిల్లీ: జవహర్ లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో శనివారం నిర్వహించిన బీజేపీ జాతీయ మండలి సమావేశం విజయవంతం కావడం ఢిల్లీ బీజేపీ నేతల్లో ఉత్సాహాన్ని నింపింది. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన త రువాత, ఢిల్లీ బీజేపీ అధ్యక్షునిగా సతీష్ ఉపాధ్యాయ బాధ్యతలు చేపట్టిన తరువాత ఢిల్లీ బీజేపీ నిర్వహించిన మొట్టమొదటి భారీస్థాయి కార్యక్రమం ఇదే కావ డంతో ఢిల్లీ బీజేపీ దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ కార్యక్రమం కోసం ఢిల్లీ బీజేపీ 90 లక్షల రూపాయలు ఖర్చు చేసింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా అమిత్ షా పగ్గాలు చేపట్టడం కోసం జరిగిన ఈ సమావేశంలో ప్రధానమంత్రి , కేంద్ర మంత్రులతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పార్టీ అగ్రనేతలు మొత్తం దాదానె రెండువేల మందికి పాల్గొన్నారు. వారి ప్రయాణ, వసతి సదుపాయాలు, భోజనం, టెంట్లు, పుష్పాలంకరణ కోసం ఈ సొమ్ము ఖర్చయినట్లు చెబుతున్నారు.రవాణా సదుపాయాలను కల్పించడం కోసం పార్టీ ఆదేశాల మేరకు ఒక్కో కౌన్సిలర్ రెండేసి వాహనాలను అందుబాటులో ఉంచినట్లు చెబుతున్నారు. పుష్పాలంకరణకు 5 లక్షల రూపాయలు, టెంట్లకు 12 లక్షలు, భోజనం కోసం 14 లక్షల రూపాయలు ఖర్చు చేశారు. నాలుగు లక్షల రూపాయలు స్టేడియం అద్దె కింద చెలించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా కార్యక్రమ ఏర్పాట్లను ప్రశంసించారని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు ఆనందంతో మీడియాకు చెప్పారు. 1952 నుంచి ఇప్పటి వరకు తాను పాల్గొన్న బీజేపీ కార్యక్రమాలన్నింటికెల్లా ఇది అత్యుత్తమంగా జరిగిందని సీనియర్ నేత అద్వానీ వ్యాఖ్యానించారని సతీష్ ఉపాధ్యాయ సంబరపడ్డారు. -
సుప్రీం ఆదేశంపై హర్షం
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ భవితవ్యాన్ని నిర్ణీత సమయంలో తేల్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ఆదేశించడంపై కాంగ్రెస్, బీజేపీ, ఆప్ హర్షం వ్యక్తం చేశాయి. ఢిల్లీవాసులు కరెంటు, నీటి సమస్యలతో సతమతమవుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుపై త్వరగా తేల్చాలని కోర్టు ఆదేశించడం ముదాహవమని ఆ పార్టీలు పేర్కొన్నాయి. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయ్ మాట్లాడుతూ..‘ రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు లెఫ్టినెంట్ గవర్నర్ మమ్నల్ని ఏ క్షణంలో పిలిచిన వెంటనే సమాధానమిచ్చేందుకు సిద్ధంగా ఉన్నా’మన్నారు. కేంద్ర ప్రభుత్వ జోక్యంతో ఇప్పుడు రాష్ట్రంలో మెజారిటీ ప్రభుత్వమో, మైనారిటీ ప్రభుత్వమో లేక మళ్లీ ఎన్నికలు జరపడమో అనేది ఎల్జీ నిర్ణయిస్తారన్నారు. ప్రజలు విద్యుత్, మంచినీటి సమస్యలతో సతమతమవుతున్నారని, వాటి నుంచి ఢిల్లీవాసులకు విముక్తి రావాలంటే ప్రజా ప్రభుత్వం ఏర్పడాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ ఢిల్లీ శాఖ అధికార ప్రతినిధి ముఖేష్ శర్మ అన్నారు. నిబంధనల ప్రకారం నగరంలోని తుగ్లకాబాద్, క్రిష్ణ నగర్, మెహ్రౌర్లీ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆరు నెలల్లో ఉప ఎన్నికలు జరపాల్సి ఉన్నందున, వాటిని తప్పించుకోవడానికి ఢిల్లీ అసెంబ్లీని రద్దుచేయాలని శర్మ సూచించారు. ఇదిలా ఉండగా, అన్ని పార్టీల నుంచి ప్రభుత్వ ఏర్పాటుపై ఎల్జీ ఎందుకు రాతపూర్వక సమాధానం కోరడం లేదని ఆప్ ప్రశ్నించింది. ప్రభుత్వ ఏర్పాటుపై వీలైనంత త్వరగా తమ అభిప్రాయం చెప్పాలని బీజేపీని ఎల్జీ అడగాలని ఆప్ నేత యోగేంద్ర యాదవ్ డిమాండ్ చేశారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఇప్పటికైనా అసెంబ్లీని రద్దుచేసి వెంటనే ఎన్నికలు నిర్వహించాలన్నారు. -
అందరూ అందరే..
అసెంబ్లీని రద్దుచేసి మళ్లీ ఎన్నికలు జరపాలనే డిమాండ్ పెరుగుతున్న కొద్దీ రాష్ట్రంలో రాజకీయ పార్టీలు ఒకరిపై మరొకరు విమర్శలదాడిని విస్తృతం చేస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ఆద్మీ పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఒకరు మరొకరితో ములాఖత్ అవుతున్నారని ఆరోపిస్తున్నారు. అసలు అక్కడ ఏం జరుగుతోందో సామాన్యుడికి ఏమాత్రం అర్థం కావడంలేదు.. న్యూఢిల్లీ: ఆమ్ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ కలిసి మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు నాటకాలు ఆడుతున్నాయని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయ్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ ఆప్, కాంగ్రెస్ పార్టీలు తోడుదొంగలని ఆరోపించారు. ఆప్ గతంలో కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. వారిద్దరూ పాత స్నేహితులు. అధికారం కోసం ఆ రెండు పార్టీలూ తమపై పుకార్లు సృష్టించి బురదజల్లేందుకు యత్నిస్తున్నాయి. మేం మొదటినుంచి ఒకే మాట మీద ఉన్నాం.. ఇప్పటికీ అదే మాటకు కట్టుబడ్డాం..’ అని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకునేందుకు బీజేపీ యత్నిస్తోందని సోమవారం కాంగ్రెస్ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఆప్‌లో చీలిక తెచ్చి, ఆ పార్టీకి చెందిన 15 మంది ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకునేందుకు బీజేపీ పావులు కదుపుతోందని కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు ఆరోపించారు. దీనిపై ఉపాధ్యాయ్ స్పందిస్తూ..‘ఆ రెండుపార్టీల ఎత్తుగడలు అందరికీ తెలిసిందే. కాంగ్రెస్‌లో బీజేపీ ఎమ్మెల్యేలు చేరుతున్నారని ఆప్ ఇంతకుముందు విమర్శిస్తే, ఇప్పుడు ఆప్ ఎమ్మెల్యేలు చేరుతున్నారని కాంగ్రెస్ ప్రచారం చేస్తోంది.. దీన్ని బట్టి వారిద్దరి మధ్య ఉన్న సంబంధాన్ని సులభంగా అర్థం చేసుకోవచ్చు..’ అని ఎద్దేవా చేశారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను జరిపేందుకు బీజేపీ, లెఫ్టినెంట్ జనరల్ భయపడుతున్నారని ఆదివారం జరిగిన భారీ ర్యాలీలో ఆప్ ఆరోపించింది. కాగా, ప్రస్తుత పరిస్థితికి ఆప్ నిర్వాకమే కారణమని బీజేపీ ఆరోపిస్తోంది. ‘లోక్‌సభ ఎన్నికలు పూర్తయిన తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆప్ అప్పట్లో ఎల్జీకి లేఖ రాసింది. దాన్ని ఇప్పటివరకు ఆ పార్టీ వెనక్కి తీసుకోలేదు. ప్రస్తుత అనిశ్చితికి వారిదే బాధ్యత..’ అంటూ ఆప్‌పై మండిపడింది. ఆప్ ప్రభుత్వం రాజీనామా చేసినప్పటి నుంచి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన నడుస్తోన్న విషయం తెలిసిందే. లోక్‌సభ ఎన్నికల్లో దేశవ్యాప్తం గా మోడీ ప్రభంజనంతో బీజేపీ మెజారిటీ స్థానాలు సాధించి కేంద్రం లో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. ఇదే క్రమంలో ఢిల్లీలోనూ అసెంబ్లీ ఎన్నికలు జరిపిస్తే బీజేపీకి అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశముం దని ఆ పార్టీ భావిస్తోంది. అందులో భాగంగానే పార్లమెంట్లో బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఢిల్లీ రాష్ట్ర బడ్జెట్‌పై విస్తృత ప్రచారం చేపట్టాలని బీజేపీ రాష్ట్ర శాఖ నాయకత్వం కార్యకర్తలను ఆదేశించింది. అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనేందుకు రాష్ట్ర శాఖలోనూ భారీ మార్పులు చేయనున్నారు. దీని నిమిత్తం అప్పుడే కసరత్తు కూడా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 9వ తేదీన జరగనున్న బీజేపీ జాతీ య సమావేశం అనంతరం రాష్ట్ర శాఖలో ఎంపికలపై పూర్తి దృష్టి పెట్టనున్నారు. ‘కొత్త టీంలో అందరూ కొత్తవారే ఉంటారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారికి, పార్టీలో చురుకుగా లేనివారికి మా కొత్త టీంలో స్థానం ఉండదు. ఈ టీంలో అనుభవానికి, నూతనత్వానికి సమాన ప్రాధాన్యమివ్వనున్నాం..’ అంటూ ఉపాధ్యాయ్ ప్రకటించారు. -
షీలాను తొలగించాల్సిందే
న్యూఢిల్లీ: కేరళ గవర్నర్ షీలా దీక్షిత్‌ను వెంటనే ఆ పదవి నుంచి తొలగించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అనధికార కాలనీల్లో చేపట్టిన అభివృద్ధి పనుల్లో అవకతవకలు జరిగినట్లు కాగ్ ఆరోపించడంతో వెంటనే ఆమెను కేరళ గవర్నర్ పదవి నుంచి తొలగించాలని వారు డిమాండ్ చేశారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని లెఫ్టినెంట్ గరవ్నర్ నజీబ్ జంగ్‌ను కోరినట్లు బీజేపీ ఢిల్లీ శాఖ అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయ్ తెలిపారు. అలాగే ఢిల్లీ ప్రభుత్వం ఆమెపై పోలీస్ కేసు నమో దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు 2012-13లో కూడా షీలాదీక్షిత్ ప్రభుత్వం పలు అవినీతి కార్యకలాపాలకు పాల్పడిందని ఉపాధ్యాయ్ ఆరోపించారు. అధికారంలో ఉన్న చివరి రోజుల్లోనూ ఆ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందంటే 15 ఏళ్లలో షీలా ప్రభుత్వం ఎంత అక్రమాలకు పాల్పడిందో సామాన్య ఢిల్లీవాసికి సైతం అర్థమవుతుందని ఎద్దేవాచేశారు. అనధికార కాలనీల్లో షీలా సర్కార్ చేపట్టిన పనులు, వాటిలో జరిగిన అవకతవకలు తదితర విషయాలపై కాగ్ బయటపెట్టిన విషయాలను అధ్యయనం చేసేం దుకు బీజేపీ రాష్ట్ర శాఖ ఆదివారం సమావేశం నిర్వహించిందని ఉపాధ్యాయ్ వివరించారు. ‘అనధికార కాలనీలను క్రమబద్ధీకరించనున్నట్లు 2008 ఎన్నికల సమయం లో షీలా సర్కార్ ప్రజలకు ప్రకటించింది. ఆ మేరకు పలు కాలనీల్లో ధ్రువీకరణ పత్రాలను సైతం పంపి ణీ చేసింది. అప్పటినుంచి స్థానికులను భ్రమల్లోనే ఉంచి అక్కడ ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టకుండానే నిధుల దుర్వినియోగానికి పాల్పడిం ది. ఒక్క 2012-13లోనే అనధికార కాలనీల్లో సుమారు రూ. కోట్లాది విలువైన పనులు చేసినట్లు చూపించారు. అయితే అక్కడ సుమారు రూ. 3 వేల కోట్ల కుంభకోణం జరిగినట్లు కాగ్ నివేదిక బహిర్గత పరిచింద’ని ఉపాధ్యాయ్ వివరించారు. అలాగే ఆయా అనధికార కాలనీల్లో రోడ్ల మరమ్మతుల నిమిత్తం డీఎస్‌ఐఐడీసీ రూ. 206 కోట్లు ఖర్చుచేసింది. అయితే నీటిపైపుల ఏర్పాటు నిమిత్తం ఆ రోడ్లను తవ్వేశారు. నిజానికి నగరంలో 685 అనధికార కాలనీలు ఉండగా, కేవలం 158 కాలనీల్లోనే నీటిపైపుల పనులు జరిగినట్లు కాగ్ నివేదించింది. అలాగే డ్రైనేజీ పనుల నిమిత్తం సుమారు రూ.49 కోట్లు ఖర్చు పెట్టినట్లు ఆ ప్రభుత్వం లెక్కలు చూపించినా కాగ్‌కు మాత్రం ఏ ఒక్క కాల నీలోనూ డ్రైనేజీలు కనిపించకపోవడం కాంగ్రెస్ అవినీతికి అద్దం పడుతోంద..’ని ఆయన విమర్శించారు. ఇదిలా ఉండగా, ఎన్నికలు వెంటనే జరిపించాలని జంతర్ మంతర్ వద్ద ఆదివారం ఆమ్ఆద్మీ పార్టీ నిర్వహించిన ర్యాలీపై ఉపాధ్యాయ్ స్పం దిం చారు. ఆప్‌ది మొసలి కన్నీరని ఆయన విమర్శిం చారు. తమ రాజకీయ మనుగడ కోసమే ఆప్ నాయకులు ర్యాలీ డ్రామాలాడుతున్నారని ఆయన విమర్శించారు. ఒకవేళ వారికి ఢిల్లీవాసులపై అభిమానముంటే, కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వాన్ని ఎందుకు ఏర్పాటుచేయడంలేదని ఉపాధ్యాయ్ ప్రశ్నించారు. ఇంతా చేస్తే ఆ పార్టీ ర్యాలీకి కేవలం 3,500 మంది హాజరయ్యారంటే వారికి ప్రజల్లో ఉన్న గుర్తింపు ఏమాత్రమో అర్థమవుతోందని ఢిల్లీ బీజేపీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ రమేష్ బిధూరీ ఎద్దేవా చేశారు. -
ఎల్జీ కోర్టులో బంతి
సాక్షి, న్యూఢిల్లీ: రాజధాని రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. బీజేపీ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యేలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చన్న ఊహాగానాలు ఒకరోజు వినిపిం చాయి. మరుసటి రోజు కాంగ్రెస్ అండతో ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చన్న వార్తలు వచ్చాయి. ఆప్, కాంగ్రెస్ ఉమ్మడిగా ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చన్న వార్తలు మరోరోజు వ్యాపించాయి. ఇవేవీ కావు.. ఎన్నికలు జరగడం తథ్యమని మరోరోజు ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఎమ్మెల్యే బేరసారాల గురించి ఆరోపణ లు, ప్రత్యారోపణలు రోజూ వినబడుతూనే ఉన్నాయి. ఢిల్లీ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయ ఆదివారం రాత్రి హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలవడంతో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశముందనే ఊహాగానాలు మరోమారు వ్యాపించాయి. ఈ నేపథ్యంలో 24 మంది ఆప్ ఎమ్మెల్యేలతోపాటు అరవింద్ కేజ్రీవాల్ లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ) నజీబ్ జంగ్‌తో సోమవారం భేటీ అయ్యారు. దీనిపై రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటయ్యే అవకాశాలు దాదాపు శూన్యంగానే కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ తన ఎనిమిది మంది ఎమ్మెల్యేలను విలేకరుల సమావేశంలో హాజరుపర్చి తన బలం చెక్కు చెదరలేదని చూపింది. అయితే ఎల్జీతో ఆప్ సభ్యుల సమావేశానికి రోహిణి ఎమ్మెల్యే రాజేష్ గార్గ్ గెర్హాజరయ్యారు. ఎమ్మెల్యేలు ఎన్నికలు కోరుకోవడం లేదని, ప్రభుత్వ ఏర్పాటుకు ప్రత్యామ్నాయాలను పరిశీలించాలని గార్గ్ ఇదివరకే అన్నారు. ఈ నేపథ్యంలో ఆయన గైర్హాజరు చర్చనీయాంశంగా మారింది. మరోమారు ఎన్నికలకు వెళ్లడానికి పలువురు ఎమ్మెల్యేలు సుముఖంగా లేకపోవడంతో ఊహాగానాలకు ఊపిరి లభిస్తోంది. ఎన్నికల్లో పోటీచేస్తే మరోమారు గెలుస్తామా? అన్న భయంతో ఎమ్మెల్యేలు ప్రజల ముందుకు ఓట్ల కోసం వెళ్లడానికి వెనుకాడుతున్నారు. ఆప్, బీజేపీ అగ్రనాయకత్వం ఎన్నికలనే కోరుతుండడంతో ప్రభుత్వం ఏర్పాటుకు దారులు తెరచుకోవడం లేదు. అన్ని పక్షాలూ తమ వైఖరిని స్పష్టం చేసిన నేపథ్యంలో ఇక నిర్ణయం తీసుకోవలసిన బాధ్యత ఎల్జీ చేతిలోనే ఉంది. ఆయన ఆహ్వానిస్తే ప్రభుత్వం ఏర్పాటుకు ప్రయత్నిస్తామని బీజేపీ ప్రకటించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా ఆయన బీజేపీని కోరుతారా లేక అసెంబ్లీని రద్దు చేస్తారా లేదా మరో ఆరు నెలల పాటు రాష్ట్రపతి పాలన విధిస్తారా అన్న విషయం తేలాల్సి ఉంది. అందరితో చర్చించిన తరువాత రాష్ట్రపతికి నివేదిక సమర్పిస్తానని మాత్రమే లెఫ్టినెంట్ గవర్నర్ అన్నారు. ఢిల్లీలో త్వరలో ఎన్నికలు జరగకపోవచ్చన్న అనుమానాలకు ఆయన మాటలు తావిస్తున్నాయి. -
అధికారంలోకి వస్తే..షీలా పాలనలో అవినీతిపై దర్యాప్తు
న్యూఢిల్లీ: తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మాజీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ పాలనలో చోటుచేసుకున్న అవినీతి అక్రమాలపై దర్యాప్తు జరిపిస్తామని ఢిల్లీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు సతీశ్ ఉపాధ్యాయ్ ప్రకటించారు. ఆర్థికంగా చోటుచేసుకున్న అవకతవకలతోపాటు కామన్వెల్త్ క్రీడల సమయంలో చోటుచేసుకున్న అక్రమాలపై ప్రధానంగా దృష్టిసారిస్తామని చెప్పారు. ఇది కక్ష సాధింపు చర్య ఎంతమాత్రం కాదని, అక్రమాలు, కుంభకోణాలతో నగరానికి వచ్చిన చెడ్డపేరును తుడిచివేసేందుకే నిజానిజాల నిగ్గు తేలుస్తామని ఉపాధ్యాయ్ చెప్పారు. దోషులుగా తేలినవారు కఠిన శిక్షలు అనుభవించక తప్పదన్నారు. గత పదిహేనేళ్ల పాలనలో చోటుచేసుకున్న అవినీతిపై దర్యాప్తు జరిపించడం కొత్తగా అధికారంలోకి వచ్చే ప్రభుత్వ బాధ్యత అని, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆ బాధ్యతను సమర్థవంతంగా పూర్తి చేస్తుందన్నారు. ఇందుకోసం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ముందుగా సమీక్షించాల్సి ఉంటుందని, ముఖ్యంగా ఎంసీడీని విభజించడం వెనుక ఉన్న కాంగ్రెస్ కుట్ర గురించి ప్రజలకు తెలియాల్సి ఉందన్నారు. కార్పొరేషన్లుగా విభజించి, అందుకు అవసరమైన ఉద్యోగుల నియామకాలు షీలా ప్రభుత్వం చేపట్టలేదన్నారు. తద్వారా కార్పొరేషన్లలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చేలా కుట్రలు పన్నారని, దీనివల్ల ప్రజలకు కలిగే కష్టనష్టాల గురించి కాంగ్రెస్ ప్రభుత్వం కనీస మాత్రం కూడా ఆలోచించలేదన్నారు. షీలా ప్రభుత్వం అక్రమాలకు పాల్పడినట్లు ఇప్పటికే కాగ్ చెప్పిందని, షుంగ్లూ కమిటీతోపాటు సీవీసీ పరిశీలనలో కూడా షీలా ప్రభుత్వం తప్పుడు నిర్ణయాలు తీసుకున్నట్లు వెల్లడైందన్నారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వీటన్నింటిపై సీబీఐ దర్యాప్తు జరపాలని ఆదేశిస్తామని చెప్పారు. -
ఎన్నికలకు మేం సిద్ధమే
న్యూఢిల్లీ: ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విషయంలో అనిశ్చితికి బీజేపీ తెరదించింది. ఎన్నికలకు తమ పార్టీ అన్నివిధాలుగా సిద్ధంగా ఉందని ప్రకటించింది. ఈ విషయాన్ని ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయ వెల్లడించారు. కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు రాజ్‌నాథ్‌సింగ్‌ను ఢిల్లీ శాఖ అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయ ఆదివారం ఉదయం కలిశారు. తాజా పరిస్థితిని ఆయనకు ఈ సందర్భంగా సమగ్రంగా వివరిం చారు. ప్రభుత ్వ ఏర్పాటు పెద్ద ఇబ్బందులేవీ ఎదురుకాకపోవచ్చని సతీష్ ఈ సందర్భంగా రాజ్‌నాథ్‌కు తెలియజేశారని సమాచారం. ఈ సమావేశం దాదాపు గంటపాటు జరిగింది. సమావేశం అనంత రం బీజేపీ రాష్ర్ట శాఖ అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యా య మీడియాతో మాట్లాడుతూ ‘ఒకవేళ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్ కనుక ఆహ్వానిస్తే ప్రభుత్వం ఏర్పాటు చేయాలా ? వద్దా ? అనే విషయంలో పార్టీ అధిష్టానం ఓ నిర్ణయం తీసుకుంటుంది. ఇంతవరకూ తమకు అటువంటి ప్రతిపాదన ఏదీ రాలేదు. ఏదైనా రాజ్యాంగబద్ధంగానే చేస్తాం. ప్రతిపాదన అందగానే ఓ నిర్ణయం తీసుకుంటాం’ అని అన్నారు. తాజా ఎన్నికల్లో సంపూర్ణ మెజారిటీ వస్తుందంటూ ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఒకవేళ రేపే ఎన్నికలకు సంబంధించిన ప్రకటన వచ్చినా తమకు ఎటువంటి ఇబ్బందీ లేదన్నారు. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)లను ఓడిస్తామంటూ ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి తగినంత సంఖ్యాబలం ఉందా ? ఆ విషయంలో ఏమిచేయబోతున్నారు? అంటూ మీడియా ప్రశ్నిం చగా ఎల్జీ నుంచి ఆహ్వానం అందిన తర్వాత పార్టీయే దీనిపై స్పందిస్తుందన్నారు. ఇదిలాఉండగా తాజా ఎన్నికలకు పార్టీ ఎమ్మెల్యేలు ఎంతమాత్రం సుముఖంగా లేరని భేటీ సందర్భంగా రాజ్‌నాథ్‌కు సతీష్ వివరించినట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. నాలుగు రోజుల క్రితం జరిగిన సమావేశంలో వారు ఈ విషయాన్ని తన దృష్టికి తీసుకొచ్చినట్టు రాజ్‌నాథ్‌కు వివరించారని తెలిపాయి. అటువంటిదేమీ లేదుఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటును ఆర్ఎస్ఎస్ వ్యతిరేకిస్తున్నట్టు వచ్చిన వార్తలను బీజేపీలో ఇటీవల చేరిన రాంమాధవ్ ఖండించారు. అవన్నీ ఊహాగానాలేనన్నారు. అందులో వాస్తవికత ఎంతమాత్రం లేదన్నారు. ఈ విషయాన్ని ఆర్ఎస్ఎస్ దృష్టికి తీసుకుపోయామని, అయితే వారు తమకు ఎటువంటి దిశానిర్దేశమూ చేయలేదన్నారు. కాగా ఢిల్లీ శాసనసభ సభ్యుల సంఖ్య 70. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో మొత్తం 31 మంది శాసనసభకు ఎన్నికయ్యారు. అయితే వీరిలో హర్షవర్ధన్, పర్వేష్ వర్మ, రమేశ్ బిధూరీలు ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించడంతో ఆ పార్టీ సభ్యుల సంఖ్య 31 నుంచి 28కి పడిపోయింది. మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యుల సంఖ్య 28 కాగా వారిలో రెబెల్ ఎమ్మెల్యే వినోద్‌కుమార్ బిన్నీని బహిష్కరించడంతో అదికాస్తా 27కు పడిపోయింది. ఇక కాంగ్రెస్‌కు ఎనిమిది, బీజేపీ, అకాలీదళ్ పార్టీలకు ఒక్కొక్కరు చొప్పున సభ్యులు ఉన్నారు.మరోవైపు ప్రజలకు చేరువయ్యేందుకు కాంగ్రెస్ పార్టీ నానాతంటాలు పడుతోంది. -
బీజేపీకి త్వరలో సభాపక్ష నేత
న్యూఢిల్లీ: రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు వార్తలు వచ్చిన నేపథ్యంలో త్వరలోనే తమ శాసనసభా పక్ష నాయకుణ్ని నియమిస్తామని ఈ పార్టీ ప్రకటించింది. లెఫ్టినెంట్ గవర్నర్ ఆహ్వానిస్తే ప్రభుత్వ ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తామని తెలిపింది. ఎల్జీ నుంచి ఇంత వరకు తమకు ఆహ్వానం అందలేదని పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు సతీశ్ ఉపాధ్యాయ శనివారం విలేరులతో అన్నారు. అయితే రాష్ట్రంలో ప్రస్తుతం ప్రభుత్వం ఏర్పాటయ్యేందుకు అనుకూల పరిస్థితులు లేవని అభిప్రాయపడ్డారు. సర్కారు ఏర్పాటుపై తమ ఎమ్మెల్యేల్లో భిన్నాభిప్రాయాలు ఉన్న మాట నిజమేనని, ఈ సమస్యకు త్వరలోనే పరిష్కారం కనుగొంటామన్నారు. గతంలో సభాపక్ష నేతగా వ్యవహరించిన ఎమ్మెల్యే డాక్టర్ హర్షవర్ధన్ ఎంపీగా ఎన్నికై కేంద్రమంత్రిగా పనిచేస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, పార్టీ ఢిల్లీ వ్యవహారాల ఇన్చార్జ్ షకీల్ అహ్మద్ ఈ విషయమై శనివారం విలేకరులతో మాట్లాడుతూ ఆప్, బీజేపీ ఉమ్మడిగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. నరేంద్ర మోడీ తన 50 రోజుల పాలనలో అన్నింటా విఫలమైనందున, తాజాగా ఎన్నికలకు వెళ్లేందుకు బీజేపీ జడుస్తోందని ఆరోపించారు. ఆప్ కూడా ఎన్నికలకు సిద్ధంగా లేదన్నారు. -
త్వరలో నిర్ణయం తీసుకుంటాం
న్యూఢిల్లీ: ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలా లేకపోతే తాజాగా ప్రజల తీర్పు కోరాలా అనే విషయమై త్వరలో ఓ నిర్ణయానికొస్తామని బీజేపీ రాష్ట్ర శాఖ నూతన అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయ పేర్కొన్నారు. ఇందుకోసం పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతోపాటు సీనియర్లతో సమావేశమై వారి సలహాలు, సూచనలను స్వీకరిస్తామన్నారు. బీజేపీ రాష్ట్ర శాఖ నూతన అధ్యక్షుడిగా శనివారం ప్రమాణ స్వీకారం చేసిన సతీష్ ఆదివారం మీడియాతో తన మనోభావాలను పంచుకున్నారు. ఒకవేళ తాజాగా ఎన్నికలు జరిగితే తమకు అత్యధిక స్థానాలు వస్తాయని ఆర్ఎస్ఎస్ నేతలతో సత్సంబంధాలు కలిగిన 52 ఏళ్ల సతీష్ చెప్పారు. కాగా తాజా ఎన్నికలకు కొంతమంది ఎమ్మెల్యేలు సుముఖంగా ఉండగా, మరికొందరు అయిష్టంగా ఉన్నారు. తాజా రాజకీయ స్థితిగతులను మరికొంతమంది ఇప్పటికే అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. అయితే అధిష్టానం ఇంకా ఎటువంటి నిర్ణయానికి రాలేదు. ఆ ఆరోపణలు సరికాదు తమ పార్టీ ఎమ్మెల్యేలను వారివైపు తిప్పుకునేందుకు బీజేపీ నాయకులు యత్నిస్తున్నారంటూ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చేసిన ఆరోపణలను సతీష్ ఖండించారు. ఆప్ లేదా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో తాను సంప్రదింపులు జరపలేదన్నారు. ఢిల్లీలో తాము కనుక అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలను 30 శాతం మేర తగ్గిస్తామన్నారు. గత ఎన్నికల సమయంలో తమ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టోలో కూడా ఇదే ఉందన్నారు. మేనిఫెస్టో తమకు బైబిల్‌తో సమానమన్నారు. అందులో తాము ఏదిచెబితే అది చేయాల్సిందేనన్నారు. కాగా 2014-15కు సంబంధించి చార్జీల వివరాలను ప్రకటించేందుకు ఢిల్లీ విద్యుత్ నియంత్రణ సంస్థ (డీఈఆర్సీ) అన్నివిధాలుగా సన్నద్ధమైంది. పెరిగే అవకాశాలున్నాయంటూ సంబంధిత అధికారులు ఇప్పటికే సూచనప్రాయంగా వెల్లడించారు. ఈ విషయమై మీడియా సతీష్‌ను ప్రశ్నించగా పైవిధంగా స్పందించారు. ఢిల్లీలో ఎన్నికైన ప్రభుత్వం లేనికారణంగా స్థానికులు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. అందువల్ల ఎన్నికలు జరిగితేనే బాగుంటుందన్నారు. ఢిల్లీకి స్వతంత్ర రాష్ట్ర ప్రతిపత్తి కోసం కృషి చేస్తానన్నారు. ఈ దిశగానే ముందుకు సాగుతున్నా మన్నారు. ఇదిలాఉంచితే కొద్దినెలల క్రితం జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీకి స్వయంప్రతిపత్తి కల్పిస్తామంటూ బీజేపీ నాయకులు హామీ ఇచ్చిన సంగతి విదితమే. మరోవైపు రాష్ర్టంలో తాజా రాజకీయ స్థితిగతులపై లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్ త్వరలో కేంద్ర ప్రభుత్వానికి ఓ నివేదిక పంపించే అవకాశముంది. దీని ఆధారంగా చేసుకుని రాష్ర్టపతి పాలనను కొనసాగించాలా లేక ఎన్నికలు నిర్వహించాలా అనే విషయమై కేంద్రం నిర్ణయం తీసుకుంటుంది.