న్యూఢిల్లీ: దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్(ఎస్డీఎంసీ) స్టాండిగ్ కమిటీ చైర్మన్ పదవికి ఢిల్లీ బీజేపీ ప్రదేశ్ అధ్యక్షుడు సతీశ్ ఉపాధ్యాయ రాజీనామా చేశారు. పార్టీ కార్యకలాపాలపై మరింత దృష్టి పెట్టేందుకే రాజీనామా చేస్తున్నట్లు ఉపాధ్యాయ ప్రకటించారు. బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉపాధ్యాయ మాట్లాడుతూ.. ‘రెండు పడవల్లో ప్రయాణం చేయడం సరికాదు. అలాగే ఓ వ్యక్తి రెండు బాధ్యతలను ఏకకాలంలో నిర్వహించడం కూడా సరికాదు. ఏ బాధ్యను కూడా పూర్తి సామర ్థ్యం మేరకు నిర్వహించలేడు. అందుకే ఎస్డీఎంసీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నాను. ఇక పార్టీ కార్యకలాపాలపైనే పూర్తిగా దృష్టిని కేంద్రీకరిస్తాన’ని చెప్పారు. ఎన్నికలకు వెళ్లాలని బీజేపీ యోచిస్తోందా? అని విలేకరులు అడిగిన ప్రశ్నకు సతీశ్ ఉపాధ్యాయ సమాధానమిస్తూ... ‘మేము దేనికైనా సిద్ధంగానే ఉన్నాం.
ఇప్పటికే ఈ విషయాన్ని అనేకసార్లు వెల్లడించాం. పార్టీ శ్రేణులను కూడా ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని ఎప్పుడో పిలుపునిచ్చాం. ఎన్నికలు ఉన్నా... లేకున్నా.. పార్టీ కార్యకర్తల సమస్యలను పరిష్కరించడం, పార్టీని బలోపేతం చేయడం వంటి బాధ్యలను పార్టీ నాకు అప్పగించింది. దానిని సమర్థవంతంగా నిర్వహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాను. చైర్మన్ పదవికి రాజీనామా చేసినా కూడా ఎస్డీఎంసీలో నాకు సభ్యత్వం ఉంటుందన్న విషయం గుర్తుంచుకోవాలి. ప్రస్తుతం ఈ స్థాయిలో ఉన్నానంటే అందుకు కారణం ఎస్డీఎంసీనే. కౌన్సిలర్ స్థాయి నుంచి స్టాండింగ్ కమిటీ చైర్మన్ వరకు ఎదిగేలా చేసిన పార్టీ శ్రేణులకు కృతజ్ఞతలు చెబుతున్నా’నన్నారు.
పార్టీ కార్యకలాపాలపైనే దృష్టి పెడతా: ఉపాధ్యాయ
Published Thu, Sep 18 2014 11:19 PM | Last Updated on Sat, Sep 2 2017 1:35 PM
Advertisement