SDMC
-
పౌరసేవలపై త్వరలో కాల్‌సెంటర్
ఎస్డీఎంసీ స్థాయీసంఘం చైర్మన్ సుభాష్ ఆర్య న్యూఢిల్లీ: పౌర సేవలకు సంబంధించిన సమాచారం ఇక అడిగిన వెంటనే అందనుంది. దీంతోపాటు ఫిర్యాదుచేసేందుకు కూడా ఓ అవకాశం లభించనుంది. ఇందుకు సంబంధించి త్వరలో కాల్‌సెంటర్‌ను ఏర్పాటు చేయాలని దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎస్డీఎంసీ) నిర్ణయించింది. ఈ విషయాన్ని ఎస్డీఎంసీ స్థాయీసంఘం నూతన చైర్మన్ సుభాష్ ఆర్య వెల్లడించారు. శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ కార్పొరేషన్‌కు సంబంధించిన సమాచారం ఈ సెంటర్లో అందుబాటులో ఉంటుందన్నారు. దీంతోపాటు తమ సమస్యలను నగరపౌరులు ఈ సెంటర్లో నమోదు చేయవచ్చన్నారు. అంకితభావంతో పనిచేస్తా అధిష్టానం తనకు కీలక బాధ్యతలను అప్పగించిందని బీజేపీ నాయకుడు, ఎస్డీఎంసీ స్థాయీసంఘం నూతన చైర్మన్ అయిన సుభాష్ ఆర్య పేర్కొన్నారు. అంకితభావంతో తన విధులను నిర్వర్తిస్తానన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ చేపట్టిన స్వచ్ఛ్ భారత్ అభియాన్‌ను కొనసాగించడమే తన లక్ష్యమన్నారు. ఎస్డీఎంసీ పరిధిలో పారిశుధ్య వ్యవస్థను మరింత పటిష్టం చేస్తాన న్నారు. అవినీతిని అంతమొందించేందుకు శాయశక్తులా కృషి చేస్తానన్నారు. ఎస్‌డీఎంసీలో ఇన్స్పెక్టర్ రాజ్ లేకుండా చేస్తానని, పనితీరును మెరుగుపరుస్తానని ఆయన పేర్కొన్నారు. -
ఎస్డీఎంసీ స్థాయీసంఘం చైర్మన్ రేసులో ఆర్య
న్యూఢిల్లీ: దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎస్డీఎంసీ) స్థాయీసంఘం చైర్మన్ పదవికి బీజేపీ నాయకుడు సుభాష్ ఆర్య నామినేషన్ దాఖలు చేశారు. కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో సోమవారం ఉదయం తన నామినేషన్ ఫారాన్ని మున్సిపల్ కార్యదర్శికి అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయ తదితరులు పాల్గొన్నారు. ఈ పదవిలో ఇప్పటిదాకా సతీష్ ఉపాధ్యాయ కొనసాగారు. అయితే ఢిల్లీ శాసనసభకు ఎన్నికలు సమీపిస్తుండడంతో ఆయనకు బీజేపీ రాష్ట్ర శాఖ బాధ్యతలను అధిష్టానం అప్పగించింది. దీంతో ఆయన ఈ పదవినుంచి తప్పుకున్న సంగతి విదితమే. నామినేషన్ దాఖలు అనంతరం ఆర్య మీడియాతో మాట్లాడుతూ ‘ఈ బాధ్యతను నాకు అప్పగించాలని పార్టీ నిర్ణయించింది. నగరవాసుల సంక్షేమం కోసం మేమంతా నిరంతరం శ్రమిస్తాం. మరిం త నిజాయితీతో పనిచేస్తాం’అని అన్నారు. అనంతరం సతీష్ ఉపాధ్యాయ మాట్లాడుతూ సభా నాయకుడిగా రాధేశ్యాం శర్మను నియమించాలని అధిష్టానం నిర్ణయించిందన్నారు. -
పార్కింగ్ చార్జీల మోత..!
పెంపునకు ఆమోదం తెలిపిన ఎస్డీఎంసీ సాక్షి, న్యూఢిల్లీ: దక్షిణ ఢిల్లీలో పార్కింగ్ చార్జీలు భారీగా పెరుగనున్నాయి. పార్కింగ్ రేట్లను భారీగా పెంచే ప్రతిపాదనకు దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ స్థాయీ సంఘం గురువారం ఆమోదం తెలిపింది. ప్రస్తుతం పార్కింగ్‌కు రెండు శ్లాబ్‌లు ఉండ గా సవరించిన రేట్ల ప్రకారం ఐదు శ్లాబ్‌లలో పార్కింగ్ చార్జీలను విధిస్తారు. స్థాయీ సంఘం ఆమోదించిన ఈ ప్రతిపాదనను మున్సిపల్ కార్పొరేటర్ల ముందుంచుతారు. సభ దానిని ఆమోదించి న తరవాత వచ్చే నెల నుంచి కొత్త పార్కింగ్ రేట్లను అమల్లోకి తెస్తారు. ప్రస్తుతం మొదటి ఎనమిది గంటలకు కారుకు రూ.10, ద్విచక్ర వాహనాలకు రూ.7 చొప్పున వసూలు చేస్తున్నారు. ఇక 24 గంట లకు కారుకు రూ.20, ద్విచక్ర వాహనాలకు రూ.15 చొప్పున పార్కింగ్ చార్జీలు ఉన్నాయి. పార్కింగ్ రేట్లను 2007లో సవరించారు. సవరించిన ప్రణాళికప్రకారం మొదటి గంట పార్కింగ్ కోసం ద్విచక్రవాహనాలకు గంటకు 10 రూపాయలు, కార్లకు రూ.20 చెల్లించవలసి ఉంటుంది. ఆ తరువాత కార్లకు ప్రతి గంటకు అదనంగా రూ.20 చొప్పున పార్కింగ్ చార్జీ వసూలు చేస్తారు. అయితే 24గంటలకు గరిష్టంగా రూ.100 చెల్లించవలసి ఉంటుం ది. టూవీలర్‌ను పార్క్ చేసినందుకు మొదటి గంటలకు రూ.10 ఆ తరువాత ప్రతి గంటకు అదనంగా రూ.10 చొప్పున గ రిష్టంగా రూ.50 రూపాయలు చెల్లించవలసి ఉంటుంది. పార్కింగ్ రేట్లు తక్కువగా ఉండడం వల్ల నగరవాసులు ప్రజా రవాణా వ్యవస్థకు బదులు వ్యక్తిగత వాహనాలు ఉపయోగించడానికి మొగ్గు చూపుతున్నారని, పార్కింగ్ రేట్లను భారీగా పెంచడం వల్ల ప్రజా రవాణా వ్యవస్థను ఉపయోగించేవారి సంఖ్య పెరుగుతుందని సుప్రీంకోర్టు నియమించిన పర్యావరణ కాలుష్య నియంత్రణ అథారిటీ సిఫారసు చేసింది. ఈ అభిప్రాయంతోనే ఢిల్లీలో పార్కింగ్ చార్జీలను భారీగా పెంచాలని నిర్ణయించారు. -
పార్టీ కార్యకలాపాలపైనే దృష్టి పెడతా: ఉపాధ్యాయ
న్యూఢిల్లీ: దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్(ఎస్డీఎంసీ) స్టాండిగ్ కమిటీ చైర్మన్ పదవికి ఢిల్లీ బీజేపీ ప్రదేశ్ అధ్యక్షుడు సతీశ్ ఉపాధ్యాయ రాజీనామా చేశారు. పార్టీ కార్యకలాపాలపై మరింత దృష్టి పెట్టేందుకే రాజీనామా చేస్తున్నట్లు ఉపాధ్యాయ ప్రకటించారు. బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉపాధ్యాయ మాట్లాడుతూ.. ‘రెండు పడవల్లో ప్రయాణం చేయడం సరికాదు. అలాగే ఓ వ్యక్తి రెండు బాధ్యతలను ఏకకాలంలో నిర్వహించడం కూడా సరికాదు. ఏ బాధ్యను కూడా పూర్తి సామర ్థ్యం మేరకు నిర్వహించలేడు. అందుకే ఎస్డీఎంసీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నాను. ఇక పార్టీ కార్యకలాపాలపైనే పూర్తిగా దృష్టిని కేంద్రీకరిస్తాన’ని చెప్పారు. ఎన్నికలకు వెళ్లాలని బీజేపీ యోచిస్తోందా? అని విలేకరులు అడిగిన ప్రశ్నకు సతీశ్ ఉపాధ్యాయ సమాధానమిస్తూ... ‘మేము దేనికైనా సిద్ధంగానే ఉన్నాం. ఇప్పటికే ఈ విషయాన్ని అనేకసార్లు వెల్లడించాం. పార్టీ శ్రేణులను కూడా ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని ఎప్పుడో పిలుపునిచ్చాం. ఎన్నికలు ఉన్నా... లేకున్నా.. పార్టీ కార్యకర్తల సమస్యలను పరిష్కరించడం, పార్టీని బలోపేతం చేయడం వంటి బాధ్యలను పార్టీ నాకు అప్పగించింది. దానిని సమర్థవంతంగా నిర్వహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాను. చైర్మన్ పదవికి రాజీనామా చేసినా కూడా ఎస్‌డీఎంసీలో నాకు సభ్యత్వం ఉంటుందన్న విషయం గుర్తుంచుకోవాలి. ప్రస్తుతం ఈ స్థాయిలో ఉన్నానంటే అందుకు కారణం ఎస్డీఎంసీనే. కౌన్సిలర్ స్థాయి నుంచి స్టాండింగ్ కమిటీ చైర్మన్ వరకు ఎదిగేలా చేసిన పార్టీ శ్రేణులకు కృతజ్ఞతలు చెబుతున్నా’నన్నారు. -
ఎస్డీఎంసీ కృషి భేష్!
న్యూఢిల్లీ: ‘నీవ్’ పేరుతో దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్(ఎస్డీఎంసీ) చేపట్టిన కార్యక్రమం 12,000 మంది అనాథ పిల్లలను బడిబాట పట్టించింది. 4,000 మంది టీచర్లు, 300 స్వచ్ఛంద సేవా సంస్థల కార్యకర్తల సహకారంతో జూన్ 14 నుంచి 30 వరకు చేపట్టిన ప్రచార కార్యక్రమం ద్వారా 12,050 మంది అనాథ పిల్లలు వివిధ పాఠశాలల్లో చేరారని ఎస్డీఎంసీ విద్యాకమిటీ చైర్మన్ ఆశీష్ సూద్ మంగళవారం తెలిపారు. ఈ ప్రచార కార్యక్రమాన్ని ఎస్‌డీఎంసీకి చెందిన సెంట్రల్, సౌత్, వెస్ట్, నజఫ్‌గఢ్ విభాగాల్లో ప్రారంభించామని, తద్వారా 5,118 మంది బాలురు, 6,932 మంది బాలికలు తమ పేర్లను పాఠశాలల్లో నమోదు చేసుకున్నారని చెప్పారు. జోన్ల వారీగా బాలుర సంఖ్య.. సెంట్రల్ 2,002, సౌత్ 1,038, వెస్ట్ 898, నజఫ్‌గఢ్ 1,180గా ఉండగా బాలికల సంఖ్య సెంట్రల్ 3,429, సౌత్ 1,062, వెస్ట్ 1,220, నజఫ్‌గఢ్ 1221గా ఉందని చెప్పారు. ప్రచార సమయంలో ఎస్డీఎంసీ ప్రారంభించిన హెల్ప్‌లైన్‌కు 70 ఫోన్‌కాల్స్ వచ్చాయన్నారు. ఎన్డీఎంపీ పరిధిలోని ప్రాంతాల నుంచి కూడా దాదాపు నాలుగు డజన్ల ఫోన్‌కాల్స్ వచ్చాయన్నారు. తూర్పు, ఉత్తర ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ల నుంచి 16, 12 కాల్స్ వచ్చినట్లు చెప్పారు. ఇక దక్షిణ ఢిల్లీలోని విభాగాలైన సెంట్రల్ నుంచి 10, సౌత్ నుంచి 16, వెస్ట్ నుంచి 6, నజఫ్‌గఢ్ నుంచి 10 కాల్స్ వచ్చినట్లు చెప్పారు. అయితే వేసవి సెలవుల కారణంగా అన్ని పాఠశాలల పరిధిలో ప్రచారాన్ని పూర్తిస్థాయిలో చేపట్టలేకపోయామన్నారు. ఈ పథకం ప్రచారం విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. నిర్మాణ రంగంలో ఉన్న కార్మికుల పిల్లల్ని బడిలో చేర్చాలనేదే ఎస్డీఎంసీ ప్రధాన లక్ష్యమని, ముఖ్యంగా బాలికలను బడిలోకి పంపాలన్న లక్ష్యంతోనే ఈ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. 6 నుంచి 14 సంవత్సరాల లోపు ఉన్న బాలబాలికలను గుర్తించేందుకు ఇంటింటికీ తిరిగామని చెప్పారు. -
పారిశుద్ధ్య డ్రైవ్ ప్రారంభించిన ఎస్డీఎమ్సీ
న్యూఢిల్లీ: వర్షాకాలం సమీపిస్తుండడాన్ని దృష్టిలో ఉంచుకొని దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎస్డీఎమ్సీ) సోమవారం పారిశుద్ధ్య డ్రైవ్ ప్రారంభించింది. తమ పరిధిలోని మధ్య, దక్షిణ, పశ్చిమ, నజఫ్‌గఢ్ జోన్లలో ఈ కార్యక్రమాన్ని ఆరంభించినట్టు కార్పొరేషన్ అధికారులు ప్రకటించారు. మేయర్ ఖుషీరామ్ చునర్ గ్రేటర్ కైలాష్ నుంచి, స్థాయీసంఘం చైర్మన్ సతీశ్ ఉపాధ్యాయ్, సభా నాయకుడు సుభాష్ ఆర్య, స్థాయీసంఘం డిప్యూటీ చైర్మన్ పంకజ్ సింగ్ సాకేత్, రాజోరీ గార్డెన్, నజఫ్‌గఢ్ నుంచి ఈ డ్రైవ్‌ను మొదలుపెట్టారు. అన్ని ప్రాంతాల్లో పారిశుద్ధ్యంపై పర్యవేక్షణ, ఘనవ్యర్థాలను పారబోయడం, బహిరంగ మూత్రశాలలను శుభ్రపర్చడం తదితర కార్యక్రమాలను ఈ సందర్భంగా చేపడతారు. అంటువ్యాధుల నిరోధం, రోడ్లకు మరమ్మతులు, పార్కులు, వీధి దీపాల నిర్వహణకు కూడా ప్రతేక శ్రద్ధ చూపిస్తామని మేయర్ రామ్ తెలిపారు. తమ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో పారిశుద్ధ్యాన్ని మెరుగుపర్చేందుకు ఎస్డీఎమ్సీ, నివాసుల సంక్షేమ సంఘాలు, ఇతర ప్రభుత్వ విభాగాలకు సహకరిస్తుందని ప్రకటించారు. వ్యర్థాల కేంద్రాలను శుభ్రపర్చడం, అనధికార కాలనీల్లో రోడ్లకు మరమ్మతులపై మరింత శ్రద్ధ చూపిస్తామని తెలిపారు. తమ ప్రాంతంలో పారిశుద్ధ్యం బాగా లేకుంటే స్థానికులు ఎస్డీఎమ్సీ కంట్రోల్‌రూమ్‌కు ఫిర్యాదు చేయవచ్చని స్థాయీసంఘం చైర్మన్ సుభాష్ ఆర్య ఈ సందర్భంగా అన్నారు. ఫిర్యాదులపై సత్వరమే స్పందించాలని ఆయన అధికారులను ఆదేశించారు. పారిశుద్ధ్య డ్రైవ్ కొనసాగుతున్న తీరును ఉన్నతాధికారులు తరచూ తనిఖీ చేస్తారని వెల్లడించారు. ఇదిలా ఉంటే దోమల కారక వ్యాధులపై అవగాహన కల్పించేందుకు ఉత్తరఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఈడీఎమ్సీ) ‘ప్రివెన్షన్ ఆఫ్ మలేరియా అండ్ డెంగీ డే’ పేరుతో శనివారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది. వర్షాకాలం సమీపిస్తుండడాన్ని దృష్టిలో ఉంచుకొని చేపట్టిన ఈ అవగాహన కార్యక్రమంలో ఉత్తరఢిల్లీ ఎంపీ ఉదిత్ రాజ్, మేయర్ యోగేందర్ చందోలియా కూడా పాల్గొన్నారు. వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో తన పరిధిలోని అన్ని ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచేందుకు పశ్చిమఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఈడీఎమ్సీ) కూడా శనివారం ప్రత్యేక డ్రైవ్ ప్రారంభించింది. ఈడీఎమ్సీ మేయర్ మీనాక్షి షహద్రాలోని అన్నార్ మసీదు నుంచి ప్రారంభించిన ఈ కార్యక్రమం పక్షం రోజులపాటు కొనసాగుతుంది. అన్ని ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులపై రోజువారీ సమీక్ష, ఘనవ్యర్థాల తొలగింపు, మూత్రశాలలను శుభ్రపర్చడం తదితర కార్యక్రమాలను ఈ సందర్భంగా నిర్వహిస్తారు. అంటువ్యాధుల నివారణ, రోడ్లకు మరమ్మతులు, పార్కులు, వీధి దీపాల ఆధునీకరణ తదితర కార్యక్రమాలనూ చేపడతామని మేయర్ మీనాక్షి పేరిట విడుదలైన ప్రకటన పేర్కొంది. పారిశుద్ధ్యంపై ఉపాధ్యాయులు, విద్యార్థులకు కూడా అవగాహన కల్పిస్తామని పేర్కొంది. ఈ డ్రైవ్‌లో పాల్గొనాల్సిందిగా ప్రచార, ఎలక్ట్రానిక్ మాధ్యమాలు, నివాసుల సంక్షేమ సంఘాలు, మార్కెట్ సంఘాల ద్వారా ఈడీఎమ్సీ ప్రజలకు విజ్ఞప్తి చేసింది.