పార్కింగ్ చార్జీల మోత..!
పెంపునకు ఆమోదం తెలిపిన ఎస్డీఎంసీ
సాక్షి, న్యూఢిల్లీ: దక్షిణ ఢిల్లీలో పార్కింగ్ చార్జీలు భారీగా పెరుగనున్నాయి. పార్కింగ్ రేట్లను భారీగా పెంచే ప్రతిపాదనకు దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ స్థాయీ సంఘం గురువారం ఆమోదం తెలిపింది. ప్రస్తుతం పార్కింగ్‌కు రెండు శ్లాబ్‌లు ఉండ గా సవరించిన రేట్ల ప్రకారం ఐదు శ్లాబ్‌లలో పార్కింగ్ చార్జీలను విధిస్తారు. స్థాయీ సంఘం ఆమోదించిన ఈ ప్రతిపాదనను మున్సిపల్ కార్పొరేటర్ల ముందుంచుతారు.
సభ దానిని ఆమోదించి న తరవాత వచ్చే నెల నుంచి కొత్త పార్కింగ్ రేట్లను అమల్లోకి తెస్తారు. ప్రస్తుతం మొదటి ఎనమిది గంటలకు కారుకు రూ.10, ద్విచక్ర వాహనాలకు రూ.7 చొప్పున వసూలు చేస్తున్నారు. ఇక 24 గంట లకు కారుకు రూ.20, ద్విచక్ర వాహనాలకు రూ.15 చొప్పున పార్కింగ్ చార్జీలు ఉన్నాయి. పార్కింగ్ రేట్లను 2007లో సవరించారు. సవరించిన ప్రణాళికప్రకారం మొదటి గంట పార్కింగ్ కోసం ద్విచక్రవాహనాలకు గంటకు 10 రూపాయలు, కార్లకు రూ.20 చెల్లించవలసి ఉంటుంది.
ఆ తరువాత కార్లకు ప్రతి గంటకు అదనంగా రూ.20 చొప్పున పార్కింగ్ చార్జీ వసూలు చేస్తారు. అయితే 24గంటలకు గరిష్టంగా రూ.100 చెల్లించవలసి ఉంటుం ది. టూవీలర్‌ను పార్క్ చేసినందుకు మొదటి గంటలకు రూ.10 ఆ తరువాత ప్రతి గంటకు అదనంగా రూ.10 చొప్పున గ రిష్టంగా రూ.50 రూపాయలు చెల్లించవలసి ఉంటుంది. పార్కింగ్ రేట్లు తక్కువగా ఉండడం వల్ల నగరవాసులు ప్రజా రవాణా వ్యవస్థకు బదులు వ్యక్తిగత వాహనాలు ఉపయోగించడానికి మొగ్గు చూపుతున్నారని, పార్కింగ్ రేట్లను భారీగా పెంచడం వల్ల ప్రజా రవాణా వ్యవస్థను ఉపయోగించేవారి సంఖ్య పెరుగుతుందని సుప్రీంకోర్టు నియమించిన పర్యావరణ కాలుష్య నియంత్రణ అథారిటీ సిఫారసు చేసింది. ఈ అభిప్రాయంతోనే ఢిల్లీలో పార్కింగ్ చార్జీలను భారీగా పెంచాలని నిర్ణయించారు.