South Delhi Municipal Corporation
-
దహన సంస్కారాలు కట్టెలతో కాదు పిడకలతో
న్యూఢిల్లీ: సాధారణంగా చనిపోయిన వారికి దహన సంస్కారాలు చేయాలంటే కట్టెలు వినియోగిస్తారు. కానీ ఇకపై ఢిల్లీలో కట్టెల బదులు ఆవు పేడతో చేసిన పిడకలు వినియోగించనున్నారు. ఈ మేరకు బీజేపీ నేతృత్వంలోని దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. త్వరలోనే ఇది అమలు చేయనున్నట్లు మేయర్ అనామిక ప్రకటించింది. అయితే ఈ నిర్ణయంపై భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. శ్మశానవాటికల్లో అంత్యక్రియలకు వాడే కట్టెల స్థానంలో ఆవుపేడతో చేసిన పిడకలను వినియోగించాలని దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ నిర్ణయం తీసుకుంది. శ్మశానవాటికల్లో దహన సంస్కారాలకు ఆవుపేడతో చేసిన పిడకలను వాడాలని నిర్ణయించినట్లు మేయర్ తెలిపారు. ఆవుపేడతో చేసిన పిడకలతో మృతదేహాలకు దహన సంస్కారాలు చేయడం వల్ల ఖర్చు కూడా తగ్గుతుందని చెప్పారు. ఇప్పటికే ఆవుపేడతో చేసిన పిడకలను శ్మశానవాటికల వద్ద సిద్ధంగా ఉంచామని వెల్లడించారు. దీనికి పలు సామాజిక సంస్థల నుంచి మద్దతు లభిస్తుండగా మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. పిడకలతో దహన సంస్కారాలు సంప్రదాయమని.. దీంతోపాటు ఖర్చు తక్కువ ఉండడంతో పేదలకు ప్రయోజనకరమని మేయర్ అనామిక వివరించారు. బీజేపీ పాలిత కార్పొరేషన్ కావడంతో ఇలాంటి నిర్ణయం తీసకోవడంతో ప్రతిపక్షాలతో పాటు ప్రజలు ఎలా స్పందిస్తారో చూడాలి. గతంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇదే నిర్ణయం అమలుచేసింది. గంగానది కలుషితం కాకుండా పర్యావరణ పరిరక్షణకు దోహదం చేసేలా 2018లో దేశీయ ఆవు పేడతో చేసిన పిడకలను వినియోగించాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. పిడకలతో దహనం చేస్తే దోషం ఉండదని పండితులు చెబుతున్నారు. నాగపూర్, జైపూర్, రోహతక్, జలగావ్, ఇండోర్, రాయ్‌పూర్, రూర్కెలాల్లో కూడా ఆవుపేడతో తయారుచేసిన పిడకలతోనే దహన సంస్కారాలు చేస్తున్నారు. -
బర్డ్ ఫ్లూ: చికెన్ అమ్మకాలపై నిషేధం
న్యూఢిల్లీ: దక్షిణ, ఉత్తర ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్(ఎన్డీఎంసీ) పరిధిలోని రెస్టారెంట్లు, హోటళ్లలో చికెన్ అమ్మకాలపై అధికారులు నిషేధం విధించారు. అదే విధంగా పౌల్ట్రీకి సంబంధించిన అన్ని రకాల ఆహార ఉత్పత్తుల అమ్మకాన్ని నిలిపివేయాలని ఆదేశించారు. దేశ రాజధానిలో బర్డ్ ఫ్లూ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. తదుపరి ఉత్తర్వులు జారీ చేసేంత వరకు పౌల్ట్రీ షాపులు, మాంసం దుకాణాలు, ప్రాసెసింగ్ యూనిట్లు అమ్మకాలు జరుపకూడదని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి ఎన్డీఎంసీ బుధవారం ప్రకటన విడుదల చేసింది. ఇక ఎస్డీఎంసీ సైతం.. ‘‘బర్డ్ ఫ్లూ కారణంగా పౌల్ట్రీ హోల్‌సేల్ మార్కెట్లు మూసివేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అమ్మకాలపై నిషేధం విధిస్తున్నాం. చికెన్, కోడిగుడ్లతో కూడిన వంటకాలు వడ్డించకూడదని రెస్టారెంట్ల యజమానులకు స్పష్టం చేస్తున్నాం. నిబంధనలు అతిక్రమించిన వారి ట్రేడ్ లైసెన్స్ రద్దు చేస్తాం’’ అని గట్టి హెచ్చరికలు జారీ చేసింది. కాగా బర్డ్ ఫ్లూ వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పూర్తిస్థాయిలో ఉడికిన మాంసం, గుడ్లు తినవచ్చని ఆరోగ్య శాఖ నేడు ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. (చదవండి: బర్డ్ ఫ్లూ మనుషులకు సోకుతుందా?) ఈ క్రమంలో తర్వాత మున్సిపల్ కార్పొరేషన్లు ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం. ఇక ఢిల్లీలో ఎనిమిది బర్డ్ ఫ్లూ కేసులు వెలుగుచూసినట్లు కేజ్రీవాల్ ప్రభుత్వం సోమవారం వెల్లడించిన విషయం తెలిసిందే. మయూర్ విహార్ ఫేజ్ 3, సంజయ్ లేక్, ద్వారక నుంచి సేకరించిన నమూనాల్లో ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యినట్లు ప్రకటించింది.(చదవండి: 9 రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ పంజా) -
'క్షమించండి.. అది కావాలని చేయలేదు'
ఢిల్లీ : లాక్డౌన్ నేపథ్యంలో కేంద్రం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శ్రామిక్ రైలులో సొంతూళ్లకు వెళ్లాలని భావించిన వలసకూలీలకు ఢిల్లీలో శుక్రవారం చేదు అనుభవం ఎదురైంది. వివరాల్లోకి వెళితే.. సొంతూళ్లకు వెళ్లేందుకని శ్రామిక్ రైలు ఎక్కేందుకు వచ్చిన వలస కూలీలు ముందుగా హెల్త్ స్ర్కీనింగ్ కోసం ఢిల్లీలోని లజ్‌పత్‌నగర్‌లో ఉన్న పాఠశాలకు చేరుకొని పరీక్షల కోసం క్యూలో నిల్చున్నారు. ఇంతలో అక్కడికి క్రిమి సంహారక మందు చల్లేందుకని సౌత్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎస్డీఎంసీ) అధికారులు అక్కడికి చేరుకున్నారు. అధికారులు క్రిమి సంహారక మందు చల్లే సమయంలో పొరపాటున జెట్టింగ్ మిషన్‌లోని రీకాయిల్ డైరెక్షన్ మారడంతో ఆ మందు మొత్తం వలస కూలీలపై విరజిమ్మింది. దీంతో అక్కడ నిల్చున్న వలస కూలీలు స్ర్పే ఒత్తిడి దాటికి తట్టుకోలేక కొంతమంది సొమ్మసిల్లి పడిపోయారు. అయితే ఈ ఘటనపై ఎస్ఎండీసీ స్పందిస్తూ.. ' క్షమించండి.. అది కావాలని చేసింది కాదు. క్రిమి సంహారక మందు చల్లుతున్న సమయంలో పొరపాటుగా జెట్టింగ్ మిషన్ డైరెక్షన్ మారడంతో వలస కూలీలపైకి స్ర్పే వెళ్లింది. ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయని ముందే ఉహించిన తాము సిబ్బందికి స్ర్పే చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచించాం. అయినా ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం దురదృష్టకరం. అయితే స్ర్పే సమయంలో జెట్టింగ్ మిషన్‌లో రీకాయిల్పై ఒత్తిడి పెరగడంతోనే ఇలా జరిగిందంటూ' తెలిపింది. కాగా వలస కూలీలకు స్ర్కీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్న పాఠశాల జనావాసాలకు దగ్గరగా ఉండడంతో అక్కడి ప్రజల విజ్ఞప్తి మేరకు ప్రతిరోజు పాఠశాల పరిసరాలతో పాటు రోడ్లు మీద క్రిమి సంహారక మందు చల్లుతున్నట్లు ఎస్ఎండీసీ పేర్కొంది. (24 గంటల్లో.. 6654 కరోనా కేసులు) (జ్యోతి కుమారి నిజంగా అద్భుతం : ఇవాంక) -
పోలీసులపై ముఖ్యమంత్రి అసహనం
సాక్షి, న్యూఢిల్లీ : ఆమ్ ఆద్మీ పార్టీ నేతపై గురువారం సాయంత్రం హత్యాయత్నం జరిగింది. 20 నుంచి 25 మంది దుండగులు తుపాకులతో తన ఇంటిపై దాడి చేశారని కౌన్సిలర్ (దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్) జితేందర్ కుమార్ మీడియాకు తెలిపారు. ఇంటి బయటనున్న కారుపై బుల్లెట్ల వర్షం కురిపించారనీ, ఇంట్లోకి దూరేందుకు యత్నించారని వెల్లడించారు. కొంత సేపటి తర్వాత ‘నీ అంతు చూస్తాం’ అంటూ హెచ్చరించి అక్కడ నుంచి వెళ్లిపోయారని తెలిపారు. (ఆయనకు మాత్రమే ఫ్రెష్ ఎయిర్ కావాలా..!!) ‘వ్యక్తిగతంగా నాకు ఎవరితో విభేదాలు లేవు. ఇది రాజకీయ ప్రత్యర్థులు నాపై చేసిన కుట్ర’ అని జితేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలాఉండగా.. ఈ ఘటనపై స్పందించిన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. ‘అసలు ఢిల్లీలో ఏం జరుగుతోంది’ అని పోలీసులపై అసహనం వ్యక్తం చేశారు. దేశ రాజధానిలో.. అదీ పట్టపగలు సాయుధుల గుంపు ఓ ప్రజా ప్రతినిధిని హత్య చేసేందుకు పూనుకోవడంపై ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. What is going on in Delhi? https://t.co/rTjUsyggKP — Arvind Kejriwal (@ArvindKejriwal) November 16, 2018 (చదవండి : 16 మందితో ఆప్ మూడో జాబితా) -
బులెటిన్ బోర్డ
సౌత్ ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్లో 86 ఇంజనీర్ పోస్టులు సౌత్ ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్.. జూనియర్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఖాళీలు: జూనియర్ ఇంజనీర్ (సివిల్)-74, జూనియర్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్)-12. అర్హత: సివిల్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లలో డిగ్రీ లేదా డిప్లొమా, రెండేళ్ల పని అనుభవం ఉండాలి. వయసు: 27 ఏళ్లు మించకూడదు. దరఖాస్తుకు చివరి తేదీ: మే 10 వివరాలకు: http://mcdonline.gov.in బిట్స్ పిలానీలో ఎంఈ, ఎంఫార్మా, పీహెచ్డీ ప్రోగ్రాంలు బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (బిట్స్ పిలానీ).. ఎంఈ, ఎంఫార్మా, పీహెచ్‌డీల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఎంఈ: 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్. ఎంఫార్మా: 60 శాతం మార్కులతో బీఫార్మసీ పీహెచ్డీ: 60 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో పీజీ. దరఖాస్తు: ఆన్లైన్ ద్వారా ఎంపిక విధానం: ఆన్లైన్ పరీక్ష ద్వారా దరఖాస్తుకు చివరి తేది: మే 19 వెబ్సైట్: www.bitsadmission.com చెన్నైలోని హెవీ వెహికల్స్ ఫ్యాక్టరీలో ఖాళీలు చెన్నైలోని భారత ప్రభుత్వ సంస్థ హెవీ వెహికల్స్ ఫ్యాక్టరీ (హెచ్‌వీఎఫ్).. ఇండస్ట్రియల్, నాన్ఇండస్ట్రియల్ క్యాడర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఇండస్ట్రియల్ క్యాడర్: 721 అర్హత: పదోతరగతి ఉత్తీర్ణతతో పాటు ఎన్సీవీటీ నుంచి ఎన్ఏసీ/ఎన్టీసీ పొంది ఉండాలి. వయోపరిమితి: 18 - 32 ఏళ్లు నాన్ ఇండస్ట్రియల్ క్యాడర్ (లోయర్ డివిజన్ క్లర్క్: 15, స్టోర్ కీపర్: 11) అర్హత: ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలి. లోయర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగానికి కంప్యూటర్లో నిమిషానికి 35 పదాల ఇంగ్లిష్ టైపింగ్ సామర్థ్యం ఉండాలి. స్టోర్ కీపర్ ఉద్యోగానికి కంప్యూటర్‌పై అవగాహన తప్పనిసరి వయోపరిమితి: 18 - 27 ఏళ్లు దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది: మే 12 వెబ్సైట్: www.hvf.eadmissions.net -
పార్కింగ్ చార్జీల మోత..!
పెంపునకు ఆమోదం తెలిపిన ఎస్డీఎంసీ సాక్షి, న్యూఢిల్లీ: దక్షిణ ఢిల్లీలో పార్కింగ్ చార్జీలు భారీగా పెరుగనున్నాయి. పార్కింగ్ రేట్లను భారీగా పెంచే ప్రతిపాదనకు దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ స్థాయీ సంఘం గురువారం ఆమోదం తెలిపింది. ప్రస్తుతం పార్కింగ్‌కు రెండు శ్లాబ్‌లు ఉండ గా సవరించిన రేట్ల ప్రకారం ఐదు శ్లాబ్‌లలో పార్కింగ్ చార్జీలను విధిస్తారు. స్థాయీ సంఘం ఆమోదించిన ఈ ప్రతిపాదనను మున్సిపల్ కార్పొరేటర్ల ముందుంచుతారు. సభ దానిని ఆమోదించి న తరవాత వచ్చే నెల నుంచి కొత్త పార్కింగ్ రేట్లను అమల్లోకి తెస్తారు. ప్రస్తుతం మొదటి ఎనమిది గంటలకు కారుకు రూ.10, ద్విచక్ర వాహనాలకు రూ.7 చొప్పున వసూలు చేస్తున్నారు. ఇక 24 గంట లకు కారుకు రూ.20, ద్విచక్ర వాహనాలకు రూ.15 చొప్పున పార్కింగ్ చార్జీలు ఉన్నాయి. పార్కింగ్ రేట్లను 2007లో సవరించారు. సవరించిన ప్రణాళికప్రకారం మొదటి గంట పార్కింగ్ కోసం ద్విచక్రవాహనాలకు గంటకు 10 రూపాయలు, కార్లకు రూ.20 చెల్లించవలసి ఉంటుంది. ఆ తరువాత కార్లకు ప్రతి గంటకు అదనంగా రూ.20 చొప్పున పార్కింగ్ చార్జీ వసూలు చేస్తారు. అయితే 24గంటలకు గరిష్టంగా రూ.100 చెల్లించవలసి ఉంటుం ది. టూవీలర్‌ను పార్క్ చేసినందుకు మొదటి గంటలకు రూ.10 ఆ తరువాత ప్రతి గంటకు అదనంగా రూ.10 చొప్పున గ రిష్టంగా రూ.50 రూపాయలు చెల్లించవలసి ఉంటుంది. పార్కింగ్ రేట్లు తక్కువగా ఉండడం వల్ల నగరవాసులు ప్రజా రవాణా వ్యవస్థకు బదులు వ్యక్తిగత వాహనాలు ఉపయోగించడానికి మొగ్గు చూపుతున్నారని, పార్కింగ్ రేట్లను భారీగా పెంచడం వల్ల ప్రజా రవాణా వ్యవస్థను ఉపయోగించేవారి సంఖ్య పెరుగుతుందని సుప్రీంకోర్టు నియమించిన పర్యావరణ కాలుష్య నియంత్రణ అథారిటీ సిఫారసు చేసింది. ఈ అభిప్రాయంతోనే ఢిల్లీలో పార్కింగ్ చార్జీలను భారీగా పెంచాలని నిర్ణయించారు.