న్యూఢిల్లీ: దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎస్‌డీఎంసీ) స్థాయీసంఘం చైర్మన్ పదవికి బీజేపీ నాయకుడు సుభాష్ ఆర్య నామినేషన్ దాఖలు చేశారు. కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో సోమవారం ఉదయం తన నామినేషన్ ఫారాన్ని మున్సిపల్ కార్యదర్శికి అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయ తదితరులు పాల్గొన్నారు. ఈ పదవిలో ఇప్పటిదాకా సతీష్ ఉపాధ్యాయ కొనసాగారు. అయితే ఢిల్లీ శాసనసభకు ఎన్నికలు సమీపిస్తుండడంతో ఆయనకు బీజేపీ రాష్ట్ర శాఖ బాధ్యతలను అధిష్టానం అప్పగించింది. దీంతో ఆయన ఈ పదవినుంచి తప్పుకున్న సంగతి విదితమే. నామినేషన్ దాఖలు అనంతరం ఆర్య మీడియాతో మాట్లాడుతూ ‘ఈ బాధ్యతను నాకు అప్పగించాలని పార్టీ నిర్ణయించింది. నగరవాసుల సంక్షేమం కోసం మేమంతా నిరంతరం శ్రమిస్తాం. మరిం త నిజాయితీతో పనిచేస్తాం’అని అన్నారు. అనంతరం సతీష్ ఉపాధ్యాయ మాట్లాడుతూ సభా నాయకుడిగా రాధేశ్యాం శర్మను నియమించాలని అధిష్టానం నిర్ణయించిందన్నారు.
ఎస్‌డీఎంసీ స్థాయీసంఘం చైర్మన్ రేసులో ఆర్య
Published Tue, Oct 14 2014 12:41 AM | Last Updated on Thu, Mar 28 2019 8:37 PM
Advertisement
Advertisement