న్యూఢిల్లీ: బీజేపీ రాష్ర్ట శాఖ ప్రతినిధుల బృందం మంగళవారం కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిసింది. వివాదాస్పద ఈ-రిక్షాల అంశంపై ఈ సందర్భంగా ఆయనతో చర్చించింది. కాగా వీటిపై హైకోర్టు నిషేధం విధించిన తర్వాత వాటిపై ఆధారపడినవారి జీవితాలు అగమ్యగోచరంగా మారిన నేపథ్యంలో బీజేపీ నాయకులు మంత్రిని కలిశారు. ఈ-రిక్షాలపై నిషేధం త్వరలోనే ఎత్తివేసే అవకాశముందని గడ్కరీ ఈ సమావేశంలో ధీమా వ్యక్తం చేశారని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సతీశ్ ఉపాధ్యాయ తెలిపారు.
గడ్కరీని కలిసిన బీజేపీ నేతలు
Published Tue, Aug 26 2014 10:59 PM | Last Updated on Thu, Mar 28 2019 8:37 PM
Advertisement
Advertisement