సాక్షి, న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ ఢిల్లీ విభాగం అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయ కొత్త టీమ్‌ను ప్రకటిం చారు. పార్టీ అధ్యక్షునిగా పదవిని చేపట్టిన మూడు నెలల అనంతరం తన కార్యవర్గాన్ని నియమించుకున్నారు. కేంద్ర నాయకత్వం, ఆర్‌ఎస్‌ఎస్‌తో సంప్రదిం పులు జరిపిన తరువాత ప్రకటించిన కొత్త బృందంలో సీనియర్ నాయకులకు సంతృప్తి కలిగించేలా అన్ని వర్గాల వారికి చోటు కల్పించారు. అరుణ్ జైట్లీ, సుష్మాస్వరాజ్, విజయ్ గోయల్, హర్షవర్దన్లతో పాటు మదన్‌లాల్ ఖురానాకు సన్నిహితులైనవారికి కూడా చోటు కల్పించారు. మారుతోన్న రాజకీయ పరిణామాల దృష్ట్యా ఎమ్మెల్యేలకు ఎవరికీ కొత్త జట్టులో చోటు కల్పించలేదు.
నగరంలో ఎన్నికలు జరిగే అవకాశం ఉండడం వల్ల ఎమ్మెల్యేలకు కొత్త జట్టులో చోటు కల్పించి వారికి పనిభారం పెంచరాదని ఆర్‌ఎస్‌ఎస్ సూచించిందని అంటున్నారు. నగర రాజకీయాలలో కౌన్సిలర్లు కీలకపాత్ర పోషించే అవకాశం ఉండడంతో తన జట్టులో ఎక్కువ మంది కౌన్సిలర్లకు చోటు దక్కేలా సతీష్ ఉపాధ్యాయ జాగ్రత్త పడ్డారు. జనరల్ సెక్రటరీలుగా తనకు అత్యంత సన్నిహితులైన దక్షిణ ఢిల్లీ ఎంపీ రమేష్ బిధూడీ, కౌన్సిలర్లు రేఖా గుప్తా, ఆశీష్ సూద్‌లను నియమించుకున్నారు.వీరు కాక ఎనిమిది మంది ఉపాధ్యక్షులను, ఎని మిది మంది కార్యదర్శులను నియమించారు. ఉపాధ్యక్షులుగా తిలక్‌రాజ్ కటారీ, రజనీ అబ్బీ, విశాఖ సైలానీ, జైప్రకాశ్, శిఖా రాయ్, అభయ్ వర్మ, కిరణ్ చద్దా, కుల్జీత్ కమల్‌లను నియమించారు. కమల్‌జీత్ షెరావత్‌ను మహిళా విభాగం ప్రెసిడెంట్‌గా, నకుల్ భరద్వాజ్‌ను యువ విభాగం అధ్యక్షునిగా నియమిం చారు.
అమన్ సిన్హా, పూనం ఆజాద్, గిరీష్ ఖురానా, రాజీవ్ బబ్బర్, దీపికా శర్మను ప్రతినిధులుగా, ప్రవీణ్ శంకర్ కపూర్‌ను మీడియా కన్వీనర్‌గా నియమిం చారు. శ్యామ్‌లాల్ గర్గ్‌ను కోశాధికారిగా నియమిం చారు. విజయ్‌శర్మ ఆర్గనైజేషన ల్ జనరల్ సెక్రటరీగా ఉంటారు. సతీ్‌ష్ ఉపాధ్యాయ తనకు సన్నిహితంగా మెలిగే ముగ్గురు శాసనసభ్యులను మూడు మున్సిపల్ కార్పొరేషన్లకు కన్వీనర్లుగా నియమించారు. సుభాష్ సచ్‌దేవాను దక్షిణ ఢిల్లీ, కుల్వంత్ రాణాను ఉత్తర ఢిల్లీ, మనోజ్ షౌకీన్‌ను తూర్పు ఢిల్లీ కార్పొరేషన్ కన్వీనర్లుగా నియమించారు. స్వచ్చ్ భారత్ అభియాన్ కోసం ప్రత్యేకంగా సెల్‌ను కూడా నియమించారు.
బీజేపీ ఢిల్లీ విభాగం కొత్త కార్యవర్గం
Published Wed, Oct 29 2014 10:59 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
Advertisement