కేజీవ్రాల్పై ఈసీకి బీజేపీ ఫిర్యాదు | bjp complains allegations of kejriwal | Sakshi
Sakshi News home page

కేజీవ్రాల్పై ఈసీకి బీజేపీ ఫిర్యాదు

Published Thu, Jan 15 2015 5:14 PM | Last Updated on Fri, Mar 29 2019 9:14 PM

కేజీవ్రాల్పై ఈసీకి బీజేపీ ఫిర్యాదు - Sakshi

కేజీవ్రాల్పై ఈసీకి బీజేపీ ఫిర్యాదు

న్యూఢిల్లీ: న్యూఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్పై బీజేపీ ఢిల్లీ విభాగం అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయ్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. గురువారం పార్టీ సహచరులు ప్రభాత్ ఝా, విజయ్ గోయల్ లతో కలిసి సతీష్ ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. అనంతరం సతీష్ విలేకర్లతో మాట్లాడుతూ.... కేజీవ్రాల్ తనపై అసత్యారోపణలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించడమే కాకుండా తన పరువుకు భంగం వాటిల్లే విధంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు.

తనకు సంబంధించిన వాస్తవాలన్నీ ఈసీ ముందుంచామని సతీష్ ఉపాధ్యాయ్ తెలిపారు. అయితే హస్తినలో విద్యుత్ సంస్థలకు సతీష్ ఉపాధ్యాయ్ల మధ్య ఉన్న ఒప్పందాలను బహిర్గతం చేస్తానని కేజీవ్రాల్ బుధవారం వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సతీష్.. తనపై కేజీవ్రాల్పై అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ ఈసీకి ఫిర్యాదు చేశారు.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement