న్యూఢిల్లీ : విధానసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మురికివాడవాసులకు బీజేపీ గాలం వేస్తోంది. వారికి తాగునీటి వసతి, పారిశుధ్యం వంటి ఆశలు కల్పిస్తోంది. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు ఈ విషయంలో విమర్శనాస్త్రాలను సంధిస్తున్నప్పటికీ తనదైన ఎజెండాతో ముందుకు సాగుతోంది. 2022 నాటికల్లా మురికివాడవాసులందరికీ తగు వసతులు కల్పిస్తామంటూ ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయ, సీనియర్ నాయకుడు విజయ్‌గోయల్‌లు భరోసా ఇస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే వారు ఉన్నచోటే ఇళ్లు కట్టిస్తామంటున్నారు.పార్టీ కార్యాలయం వద్ద మంగళవారం ఈ విషయమై రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయ మీడియాతో మాట్లాడుతూ ‘ఎవరినీ ప్రస్తుత నివాసాలనుంచి బయటికి వెళ్లగొట్టం. వారికి అదే స్థలంలో ఇళ్లు కట్టి ఇస్తాం.
అక్కడే పునరావాసం కల్పిస్తాం’అని పేర్కొన్నారు. మురికివాడలున్న చోటే ఇళ్ల నిర్మాణమనేది తమ పార్టీ నినాదమన్నారు. ‘ముంబైలోని మురికివాడవాసుల మాదిరిగానే తాము కూడా ఇక్కడి వారికి కూడా ఆరోగ్యం, పారిశుధ్యం, విద్య తదితర వసతులు కల్పిస్తాం. అంతేకాకుండా ఆయా ప్రాంతాల్లో నైపుణ్య వికాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేస్తాం. అక్కడి యువత మాదక ద్రవ్యాలబారినపడకుండా తగు చర్యలు తీసుకుంటాం’అని అన్నారు. అనంతరం ఆ పార్టీ సీనియర్ నాయకుడు విజయ్ గోయల్ మాట్లాడుతూ ఆప్, కాంగ్రెస్ పార్టీలు తమపై దుష్ర్పచారం సాగిస్తున్నాయన్నారు. ఇళ్లు కట్టించి ఇస్తామని తాము చెబుతుంటే కూల్చివేస్తారంటూ అక్కడి వారిని భయపెట్టేందుకు యత్నిస్తున్నాయన్నారు. వారికి చక్కెర, గోధుమలు, బియ్యం అందేవిధంగా చూస్తామన్నారు.
మురికివాడల్లేని నగరంగా ఢిల్లీ కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు
సాక్షి, న్యూఢిల్లీ : జేజే క్లస్టర్‌వాసుల జీవన స్థితిగతులను మెరుగుపరచడమే లక్ష్యంగా కేంద్రం ముందుకు సాగుతోంది. ఇందులోభాగంగా వచ్చే ఐదేళ్లలో నగరంలోని మొత్తం 685 జేజే క్లస్టర్లను పునరాభివృద్ధి చేయనుంది. కేంద్ర పట్టణాభివద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు మంగళవారం పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖ, గృహనిర్మాణం, పేదరిక నిర్మూలన మంత్రిత్వ శాఖల కార్యదర్శులు, డీడీఏ వైస్‌చైర్మన్, డీయూఎస్‌ఐబీ ప్రధానాధికారితోపాటు ఢిల్లీ ప్రభుత్వ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమావేశంలో ఈ అంశంపై చర్చించారు.
ఢిల్లీని మురికివాడలు లేని నగరంగా అభివృద్ధి చేయాల్సిన ఆవశ్యకతను ఈ సందర్భంగా వెంక య్యనాయుడు నొక్కిచెప్పారు. మురికివాడల అభివృద్ధికి అడ్డంకులు సృష్టించే మాఫియా శక్తులను ఉపేక్షించరాదని, కఠినవైఖరి అవలంబించాలని ఆయన సూచించారు. కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వాలు కలిసి వారంలోగా జేజే క్లస్టర్ల పున రాభివృద్ధికి మార్గదర్శకాలను రూపొందించాలంటూ ఆదేశించారు. గుజరాత్, మహారాష్ట్ర, చైన్నై నమూనాలను ఆధారంగా తీసుకుని నగరంలోని జేజేక్లస్టర్లను పునరాభివృద్ధి చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఈక్లస్టర్లలో లబ్ధిదారుల గుర్తింపు కోసం 1.6.2014ని కటాఫ్ డేట్‌గా పరిగణించాలని కూడా ఇదే సమావేశంలో నిర్ణయించారు.
మురికివాడవాసులకు ఆవాసాలు
Published Wed, Jan 7 2015 12:31 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
Advertisement
Advertisement