న్యూఢిల్లీ: దళితుల అభ్యున్నతికి 2015 సంవత్సరాన్ని అంకితమిస్తామని బీజేపీ నాయకులు సోమవారం ఇక్కడ హామీల వర్షం కురిపించారు. రామ్‌లీలా మైదాన్‌లో ఆల్ ఇండియా కాన్ఫెడరేషన్ ఆఫ్ ఎస్సీ/ఎస్టీ సంస్థ నిర్వహించిన సభలో బీజేపీ ఢిల్లీ విభాగం అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయ మాట్లాడుతూ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సైతం దళితులను ఉద్ధరిస్తామని చెప్పారని అన్నారు. రాజకీయ పార్టీలు దళితులను ఓటు బ్యాంకుగానే పరిగణిస్తున్నాయని, ఇకపై ఇది మాత్రం కొనసాగబోదని ఉపాధ్యాయ పేర్కొన్నారు.
ఢిల్లీలోని దళితుల కోసం పని చేయాలని వచ్చే సంవత్సరాన్ని బీజేపీకి వారికి అంకితమిస్తోందని చెప్పారు. ఆ ఏడాదంతా దళితులు నివాసముండే ఢిల్లీలోని మురికివాడలపైనే దృష్టిని కేంద్రీకరిస్తామని అన్నారు. ఈ సభలో మాట్లాడిన రోడ్డు రవాణా, జాతీయ రహదారులు, నౌకాయాన మంత్రి నితిన్ గడ్కరీ సభికులను బీజేపీలో భాగస్వాములు కావాలని కోరారు. ఢిల్లీలోని ప్రతిపక్ష పార్టీలు బీజేపీని దళిత వ్యతిరేక పార్టీగా ముద్ర వేశాయని గడ్కరీ ఆరోపించారు. ఓ వ్యక్తి గుణ లక్షణాలు, సాధించిన విజయాలను గూర్చి కేవలం బీజేపీ మాత్రమే మాట్లాడుతుందని, అతని నేపథ్యాన్ని పట్టించుకోదని పేర్కొన్నారు.
దళితులకు ఆర్థిక, సామాజిక భద్రత
Published Mon, Dec 8 2014 10:34 PM | Last Updated on Thu, Mar 28 2019 8:37 PM
Advertisement
Advertisement