న్యూఢిల్లీ: సమష్టి నాయకత్వం నేతృత్వంలో విధానసభ ఎన్నికల బరిలోకి దిగుతామని బీజేపీ రాష్ర్ట శాఖ అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయ పేర్కొన్నారు. విధానసభను కేంద్ర మంత్రివర్గం మంగళవారం రద్దుచేసిననేపథ్యంలో పార్టీ కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలతో సమావేశమై తాజా రాజకీయ పరిస్థితిని సమీక్షించారు. దీంతోపాటు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపైనా చర్చించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ విధానసభ ఎన్నికల్లో విజయం తమదేనంటూ ధీమా వ్యక్తం చేశారు. విధానసభ రద్దు ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడంపట్ల హర ్షం వ్యక్తం చేశారు. ‘సుపరిపాలనతోపాటు విశ్వాసం పేరిట ప్రజల వద్దకు వెళతాం. విజయం సాధిస్తాం’ అని అన్నారు. బీజేపీ సీఎం అభ్యర్థి ఎవరంటూ మీడియా ప్రశ్నించగా జవాబిచ్చేందుకు నిరాకరించారు. సరైన సమయంలో పార్టీ ఓ నిర్ణయం తీసుకుంటుందన్నారు. అయితే తాను మాత్రం ఆ పదవి రేసులో లేనన్నారు.
సమష్టిగా ఎన్నికల బరిలోకి
Published Tue, Nov 4 2014 10:32 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
Advertisement
Advertisement