న్యూఢిల్లీ : ప్రముఖ నిర్మాత సుభాష్‌గాయ్, బీజేపీ ఢిల్లీ విభాగం అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయ శనివారం ఎన్‌డీఎంసీ సమావేశపు హాల్‌లో ఢిల్లీ చలన చిత్రోత్సవం-2014 (డీఐఎఫ్‌ఎఫ్)ను ప్రారంభించారు. 8 రోజుల పాటు నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో 45 దేశాలకు చెందిన 250 చిత్రాలను ప్రదర్శించనున్నారు. డీఐఎఫ్‌ఎఫ్ ప్రచారకర్త రామకిషోర్ పర్చా, ఎన్‌డీఎంసీ చైర్మన్ జలజ శ్రీవాత్సవ పాల్గొన్నారు. హిందీ చలన చిత్రాలకు చేసిన సేవలకు జీవన సాఫల్య పురస్కారం పొందిన గాయ్ మాట్లాడుతూ.. సినిమాలు సమాజాన్ని ప్రభావితం చేస్తాయని చెప్పారు. ‘సినిమాలు సమాజం వాస్తవ దృక్పథాన్ని ప్రతిబింబిస్తాయి.
సమస్యలకు పరిష్కారాన్ని చూపుతాయి. ఇవన్నీ వినోదాత్మక పద్ధతిలోనే ప్రజలకు అందజేస్తాయని’ అందుకే ఒకే వేదికపై వివిధ దేశాల సినిమాల ప్రదర్శన ఏర్పాటు చేసిన నిర్వహకులకు అభినందనలు తెలియజేస్తున్నానన్నారు. ఇలాంటి కార్యక్రమాలకు తన సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. ‘ఢిల్లీలో ఎవరైనా సినిమా నిర్మించాలనుకుంటే, ఒక లేఖ ద్వారానే ఎన్‌డీఎంసీ అనుమతి ఇస్తుందని ఎన్‌డీఎంసీ చైర్మన్ పార్చా తెలిపారు. దర్శకద్వయం మీను గౌర్, ఫర్జాద్ నబీ రూపొందించిన ‘జిందా బాగ్’తో ఈ ఉత్సవాలు ముగుస్తాయి.
విమర్శకుల ప్రశంసలు అందుకొన్న ఈ పాకిస్తాన్ చలన చిత్రంలో ప్రముఖ న టుడు నజీరొద్దీన్‌షా నటించారు. ఇంకా ఈ ఉత్సవాల్లో పాకిస్తాన్ చిత్ర నిర్మాత, దర్శకుడు జామిలీ దేహల్వీ రూపొందించిన ‘ఇన్‌ఫినైట్ జస్టిస్’ బంగ్లాదేశ్‌కు చెందిన కాలిద్ మహ్మద్ మితు రూపొందించిన ‘ గ్లో ఆఫ్ ద ఫైర్‌ఫ్లై’, నేపాలీ చిత్రం ‘తలాక్‌గంజ్ వర్సెస్ తుల్‌కే’ సినిమాలు ప్రముఖంగా ప్రదర్శించనున్నట్లు నిర్వాహకలు పేర్కొన్నారు.
ఢిల్లీ చలన చిత్రోత్సవం ప్రారంభం
Published Sat, Dec 20 2014 10:53 PM | Last Updated on Sat, Sep 2 2017 6:29 PM
Advertisement