చీలిక దిశగా ఆప్!
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)లో విభజన రానుందని ఢిల్లీ బిజెపి మాజీ అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయ అన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాల మధ్య విబేధాలు తలెత్తాయని, వారి నేతృత్వంలో పార్టీ రెండు వర్గాలుగా చీలనుందని తనకు తెలిసిందని ఆయన ట్వీట్ చేశారు. కేజ్రీవాల్, సిసోడియాల మధ్య విబేధాలకు ముఖ్యకారణం పంజాబ్, గోవా ఎన్నికల్లో ఆప్ ఓటమి చెందడమని అన్నారు. పంజాబ్, గోవా ఎన్నికల్లో ఓటమి తరువాత సిసోడియా వర్గం కేజ్రీవాల్‌పై ఆగ్రహంతో ఉందని చెప్పారు.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ కు ఎదురుదెబ్బ తగిలింది. పంజాబ్ లో అధికారంలోకి వస్తామన్న అంచనాలు తప్పాయి. గోవాలో అయితే ఖాతా కూడా తెరవలేదు. పంజాబ్, గోవా ఎన్నికల ఫలితాలపై కేజ్రీవాల్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.