'ఢిల్లీ డైలాగ్' కార్యక్రమం ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) యువత భావోద్వేగాలతో ఆడుకుంటోందని బీజేపీ విమర్శించింది.
న్యూఢిల్లీ: 'ఢిల్లీ డైలాగ్' కార్యక్రమం ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) యువత భావోద్వేగాలతో ఆడుకుంటోందని బీజేపీ విమర్శించింది. ఇటువంటి కార్యక్రమాల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని, ఎవరి వలలోనూ పడొద్దని హెచ్చరించింది.
జనతా దర్బార్ తో సహా గత మూడేళ్లలో ఇలాంటి కార్యక్రమాలు ఆప్ చేపట్టి తర్వాత చేతులెత్తేసిందని బీజేపీ ఢిల్లీ అధ్యక్షుడు సతీఫ్ ఉపాధ్యాయ ఆరోపించారు. సీఎం పీఠం ఎక్కిన వ్యక్తి వెనుక డోర్ నుంచి పారిపోయారని కేజ్రీవాల్ ను ఎత్తిపొడిచారు. ప్రస్తుతం నరేంద్ర మోదీని యువత తమ రోల్ మోడల్ గా భావిస్తోందని సతీష్ ఉపాధ్యాయ అన్నారు.