విధానసభ ఎన్నికల్లో కమలం ఓడిపోతుందని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు పేర్కొన్న నేపథ్యంలో తాజా పరిస్థితులను
న్యూఢిల్లీ: విధానసభ ఎన్నికల్లో కమలం ఓడిపోతుందని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు పేర్కొన్న నేపథ్యంలో తాజా పరిస్థితులను సమీక్షించేందుకుగాను బీజేపీ రాష్ట్ర శాఖ నాయకులు సోమవారం సమావేశమయ్యారు. పార్టీ కార్యక ర్తల్లో ఉత్తేజితులను చేసేందుకు యత్నించారు.అనంతరం రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయ మీడియాతో మాట్లాడుతూ ‘ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను సవాలు చేయదలుచుకోలేదు. వాటిని నేను ఎందుకు సవాలు చేయాలి. మా పార్టీ అధికారంలోకి వస్తుందనే ధీమా ఉంది. అయితే మేము ఇంతకుముందు చెప్పినంత మెజారిటీ రాకపోవచ్చు.’ అని అన్నారు.