ఎన్నికలకు మేం సిద్ధమే
న్యూఢిల్లీ: ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విషయంలో అనిశ్చితికి బీజేపీ తెరదించింది. ఎన్నికలకు తమ పార్టీ అన్నివిధాలుగా సిద్ధంగా ఉందని ప్రకటించింది. ఈ విషయాన్ని ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయ వెల్లడించారు. కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు రాజ్‌నాథ్‌సింగ్‌ను ఢిల్లీ శాఖ అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయ ఆదివారం ఉదయం కలిశారు. తాజా పరిస్థితిని ఆయనకు ఈ సందర్భంగా సమగ్రంగా వివరిం చారు. ప్రభుత ్వ ఏర్పాటు పెద్ద ఇబ్బందులేవీ ఎదురుకాకపోవచ్చని సతీష్ ఈ సందర్భంగా రాజ్‌నాథ్‌కు తెలియజేశారని సమాచారం. ఈ సమావేశం దాదాపు గంటపాటు జరిగింది. సమావేశం అనంత రం బీజేపీ రాష్ర్ట శాఖ అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యా య మీడియాతో మాట్లాడుతూ ‘ఒకవేళ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్ కనుక ఆహ్వానిస్తే ప్రభుత్వం ఏర్పాటు చేయాలా ? వద్దా ? అనే విషయంలో పార్టీ అధిష్టానం ఓ నిర్ణయం తీసుకుంటుంది.
ఇంతవరకూ తమకు అటువంటి ప్రతిపాదన ఏదీ రాలేదు. ఏదైనా రాజ్యాంగబద్ధంగానే చేస్తాం. ప్రతిపాదన అందగానే ఓ నిర్ణయం తీసుకుంటాం’ అని అన్నారు. తాజా ఎన్నికల్లో సంపూర్ణ మెజారిటీ వస్తుందంటూ ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఒకవేళ రేపే ఎన్నికలకు సంబంధించిన ప్రకటన వచ్చినా తమకు ఎటువంటి ఇబ్బందీ లేదన్నారు. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)లను ఓడిస్తామంటూ ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి తగినంత సంఖ్యాబలం ఉందా ? ఆ విషయంలో ఏమిచేయబోతున్నారు? అంటూ మీడియా ప్రశ్నిం చగా ఎల్జీ నుంచి ఆహ్వానం అందిన తర్వాత పార్టీయే దీనిపై స్పందిస్తుందన్నారు. ఇదిలాఉండగా తాజా ఎన్నికలకు పార్టీ ఎమ్మెల్యేలు ఎంతమాత్రం సుముఖంగా లేరని భేటీ సందర్భంగా రాజ్‌నాథ్‌కు సతీష్ వివరించినట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. నాలుగు రోజుల క్రితం జరిగిన సమావేశంలో వారు ఈ విషయాన్ని తన దృష్టికి తీసుకొచ్చినట్టు రాజ్‌నాథ్‌కు వివరించారని తెలిపాయి.
అటువంటిదేమీ లేదుఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటును ఆర్‌ఎస్‌ఎస్ వ్యతిరేకిస్తున్నట్టు వచ్చిన వార్తలను బీజేపీలో ఇటీవల చేరిన రాంమాధవ్ ఖండించారు. అవన్నీ ఊహాగానాలేనన్నారు. అందులో వాస్తవికత ఎంతమాత్రం లేదన్నారు. ఈ విషయాన్ని ఆర్‌ఎస్‌ఎస్ దృష్టికి తీసుకుపోయామని, అయితే వారు తమకు ఎటువంటి దిశానిర్దేశమూ చేయలేదన్నారు. కాగా ఢిల్లీ శాసనసభ సభ్యుల సంఖ్య 70. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో మొత్తం 31 మంది శాసనసభకు ఎన్నికయ్యారు. అయితే వీరిలో హర్షవర్ధన్, పర్వేష్ వర్మ, రమేశ్ బిధూరీలు ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించడంతో ఆ పార్టీ సభ్యుల సంఖ్య 31 నుంచి 28కి పడిపోయింది. మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యుల సంఖ్య 28 కాగా వారిలో రెబెల్ ఎమ్మెల్యే వినోద్‌కుమార్ బిన్నీని బహిష్కరించడంతో అదికాస్తా 27కు పడిపోయింది. ఇక కాంగ్రెస్‌కు ఎనిమిది, బీజేపీ, అకాలీదళ్ పార్టీలకు ఒక్కొక్కరు చొప్పున సభ్యులు ఉన్నారు.మరోవైపు ప్రజలకు చేరువయ్యేందుకు కాంగ్రెస్ పార్టీ నానాతంటాలు పడుతోంది.