సాక్షి, న్యూఢిల్లీ: ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిన తర్వాత వ్యక్తిగత ఆరోపణలకు దిగుతున్నారంటూ కేజ్రీవాల్‌పై ఎన్నికల సంఘం అధికారులకు బీజేపీ నేతలు గురువారం ఫిర్యాదు చేశారు. ఆయన ఆరోపణలు నిరాధారమైనవని, ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత అటువంటి ఆరోపణలు చేసే హక్కు కేజ్రీవాల్‌కు లేదని తెలిపామని వారు తెలిపారు. ఆప్ నేతపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని తాము ఎన్నికల కమిషన్ ను కోరామని వివరించారు. ఆప్‌పై పరువునష్టం దావా వేయనున్నట్లు చెప్పారు. ఎన్నికల సంఘం అధికారులను కలిసిన వారిలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయ, దక్షిణ ఢిల్లీ ఎంపీ రమేశ్ బిధూడీ, సీనియర్ నేత విజయ్ గోయల్ తదితరులు ఉన్నారు.
ఇదిలా ఉండగా, రిలయన్స్ విద్యుత్ కంపెనీలతో బీజేపీ నేత సతీష్‌కు సంబంధాలున్నాయని ఆప్ నేత అరవింద్ ఆరోపించిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన సతీష్ సాక్ష్యాలను చూపిస్తే తాను రాజకీయాలనుంచి తప్పుకుంటానని, లేదంటూ కేజ్రీవాల్ రాజకీయాల నుంచి తప్పుకోవాలని సవాల్ విసిరారు. కాగా, తాను సతీష్‌కు విద్యుత్ కంపెనీలతో ఉన్న సంబంధాలకు సంబంధించి మరిన్ని సాక్ష్యాలను చూపిస్తానని, రాజకీయాల నుంచి తప్పుకునేందుకు ఆయన సిద్ధంగా ఉండాలని కేజ్రీవాల్ మళ్లీ సవాలు విసిరారు. దీంతో రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం మరింత తీవ్రతరమైంది.
అరవింద్‌పై ఈసీకి బీజేపీ ఫిర్యాదు
Published Fri, Jan 16 2015 10:46 PM | Last Updated on Fri, Mar 29 2019 9:13 PM
Advertisement