షీలాను తొలగించాల్సిందే
న్యూఢిల్లీ: కేరళ గవర్నర్ షీలా దీక్షిత్‌ను వెంటనే ఆ పదవి నుంచి తొలగించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అనధికార కాలనీల్లో చేపట్టిన అభివృద్ధి పనుల్లో అవకతవకలు జరిగినట్లు కాగ్ ఆరోపించడంతో వెంటనే ఆమెను కేరళ గవర్నర్ పదవి నుంచి తొలగించాలని వారు డిమాండ్ చేశారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని లెఫ్టినెంట్ గరవ్నర్ నజీబ్ జంగ్‌ను కోరినట్లు బీజేపీ ఢిల్లీ శాఖ అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయ్ తెలిపారు. అలాగే ఢిల్లీ ప్రభుత్వం ఆమెపై పోలీస్ కేసు నమో దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు 2012-13లో కూడా షీలాదీక్షిత్ ప్రభుత్వం పలు అవినీతి కార్యకలాపాలకు పాల్పడిందని ఉపాధ్యాయ్ ఆరోపించారు. అధికారంలో ఉన్న చివరి రోజుల్లోనూ ఆ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందంటే 15 ఏళ్లలో షీలా ప్రభుత్వం ఎంత అక్రమాలకు పాల్పడిందో సామాన్య ఢిల్లీవాసికి సైతం అర్థమవుతుందని ఎద్దేవాచేశారు.
అనధికార కాలనీల్లో షీలా సర్కార్ చేపట్టిన పనులు, వాటిలో జరిగిన అవకతవకలు తదితర విషయాలపై కాగ్ బయటపెట్టిన విషయాలను అధ్యయనం చేసేం దుకు బీజేపీ రాష్ట్ర శాఖ ఆదివారం సమావేశం నిర్వహించిందని ఉపాధ్యాయ్ వివరించారు. ‘అనధికార కాలనీలను క్రమబద్ధీకరించనున్నట్లు 2008 ఎన్నికల సమయం లో షీలా సర్కార్ ప్రజలకు ప్రకటించింది. ఆ మేరకు పలు కాలనీల్లో ధ్రువీకరణ పత్రాలను సైతం పంపి ణీ చేసింది. అప్పటినుంచి స్థానికులను భ్రమల్లోనే ఉంచి అక్కడ ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టకుండానే నిధుల దుర్వినియోగానికి పాల్పడిం ది. ఒక్క 2012-13లోనే అనధికార కాలనీల్లో సుమారు రూ. కోట్లాది విలువైన పనులు చేసినట్లు చూపించారు. అయితే అక్కడ సుమారు రూ. 3 వేల కోట్ల కుంభకోణం జరిగినట్లు కాగ్ నివేదిక బహిర్గత పరిచింద’ని ఉపాధ్యాయ్ వివరించారు.
అలాగే ఆయా అనధికార కాలనీల్లో రోడ్ల మరమ్మతుల నిమిత్తం డీఎస్‌ఐఐడీసీ రూ. 206 కోట్లు ఖర్చుచేసింది. అయితే నీటిపైపుల ఏర్పాటు నిమిత్తం ఆ రోడ్లను తవ్వేశారు. నిజానికి నగరంలో 685 అనధికార కాలనీలు ఉండగా, కేవలం 158 కాలనీల్లోనే నీటిపైపుల పనులు జరిగినట్లు కాగ్ నివేదించింది. అలాగే డ్రైనేజీ పనుల నిమిత్తం సుమారు రూ.49 కోట్లు ఖర్చు పెట్టినట్లు ఆ ప్రభుత్వం లెక్కలు చూపించినా కాగ్‌కు మాత్రం ఏ ఒక్క కాల నీలోనూ డ్రైనేజీలు కనిపించకపోవడం కాంగ్రెస్ అవినీతికి అద్దం పడుతోంద..’ని ఆయన విమర్శించారు. ఇదిలా ఉండగా, ఎన్నికలు వెంటనే జరిపించాలని జంతర్ మంతర్ వద్ద ఆదివారం ఆమ్‌ఆద్మీ పార్టీ నిర్వహించిన ర్యాలీపై ఉపాధ్యాయ్ స్పం దిం చారు.
ఆప్‌ది మొసలి కన్నీరని ఆయన విమర్శిం చారు. తమ రాజకీయ మనుగడ కోసమే ఆప్ నాయకులు ర్యాలీ డ్రామాలాడుతున్నారని ఆయన విమర్శించారు. ఒకవేళ వారికి ఢిల్లీవాసులపై అభిమానముంటే, కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వాన్ని ఎందుకు ఏర్పాటుచేయడంలేదని ఉపాధ్యాయ్ ప్రశ్నించారు. ఇంతా చేస్తే ఆ పార్టీ ర్యాలీకి కేవలం 3,500 మంది హాజరయ్యారంటే వారికి ప్రజల్లో ఉన్న గుర్తింపు ఏమాత్రమో అర్థమవుతోందని ఢిల్లీ బీజేపీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ రమేష్ బిధూరీ ఎద్దేవా చేశారు.