![Pranitha To Donate Oxygen Concentrators to Hospitals - Sakshi](/styles/webp/s3/article_images/2021/05/11/Pranitha.jpg.webp?itok=aFFOou6f)
‘‘మనందరం ఎంతో కొంత సాయం చేయాల్సిన తరుణం ఇది. ప్రతి ఒక్కరికీ మనం సాయం చేయలేకపోవచ్చు. కానీ మన సహాయం కొద్దిమందికి ఉపయోగపడినా చాలు’’ అంటున్నారు హీరోయిన్ ప్రణీత. ఈ విషయం గురించి ప్రణీత మాట్లాడుతూ – ‘‘కరోనా ఫస్ట్ వేవ్ సమయంలో మా ఫౌండేషన్ తరఫున చాలామంది కరోనా బాధితులకు అన్నదానం చేశాం. ఇటీవల కూడా కొంత మొత్తాన్ని సేకరించి ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్‌ను కోవిడ్ ఆస్పత్రులకు ఇచ్చాం’’ అన్నారు.
ఇంకా కరోనా జాగ్రత్తల గురించి చెబుతూ – ‘‘ప్రస్తుతం పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ఇంట్లో నుంచి బయటకు వెళ్లకూడదు. నేనైతే వీలు కుదిరినంతవరకు కాలు బయటపెట్టడంలేదు. బయటకు వెళ్లి నాతో పాటు నా కుటుంబ సభ్యుల జీవితాలను కూడా రిస్క్‌లో పెట్టలేను. అందుకే ఇంట్లో నుంచే సాయం చేయాలనుకున్నాను. నా సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా కోవిడ్ బాధితులకు అవసరమైన సమాచారాన్ని షేర్ చేస్తున్నాను. ఇది కొందరికి ఉపయోగపడినా చాలు. నేనే కాదు.. సినిమా ఇండస్ట్రీకి చెందిన చాలామంది సహాయం చేస్తున్నారు. చాలా హ్యాపీగా ఉంది’’ అన్నారు ప్రణీత.
Comments
Please login to add a commentAdd a comment