సాక్షి, న్యూఢిల్లీ: కరోనా సెకండ్‌వేవ్ సమయంలో ఆక్సిజన్ కొరత కారణంగా ఒక్కరు కూడా చనిపోలేదని, దీనికి సంబంధించిన రిపోర్టులేవీ తమ వద్ద లేదన్న కేంద్రం తాజాగా కీలక ఆదేశాలు చేసినట్టు తెలుస్తోంది. ఆక్సిజన్ కొరతతో మరణాల సమాచారం కోసం కేంద్రం రాష్ట్రాలకు లేఖ రాసింది. దీంతో పార్లమెంటు వర్షాకాల సమావేశాల లోపే ఆయా రాష్ట్రాలు,కేంద్రపాలిత ప్రాంతాలు ఈ డేటాను సమర్పించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
మెడికల్ ఆక్సిజన్ కొరతతో చనిపోయిన కరోనా బాధితుల డేటాని సమర్పించాల్సిందిగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కేంద్రం కోరింది. ప్రస్తుత పార్లమెంట్ సెషన్ ముగిసే (ఆగస్టు 13) నాటికి ఈ డేటాను పార్లమెంటులో సమర్పించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
కాగా కరోనా రెండో దశలో వేవ్ ఆక్సిజన్ లేకపోవడం వల్ల ఎలాంటి మరణాలు సంభవించలేదన్న కేంద్రం ప్రకటనపై విమర్శలు చెలరేగాయి. ఈ నెల 20న రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ అడిగిన ప్రశ్నకు కోవిడ్ మరణాలపై రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ప్రత్యేక మరణాలను నివేదించలేదని ఆరోగ్యశాఖ సహాయమంత్రి సమాధానం పెద్ద దుమారాన్నే రాజేసింది. ప్రధాన ప్రతిపక్ష పార్టీలు కేంద్రంపై మండిపడిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment