
న్యూఢిల్లీ: దేశంలో ప్రస్తుతం కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజుకు నాలుగు లక్షలకు తక్కువ కాకుండా కేసులు నమోదవుతున్నాయి. దేశంలో ఆక్సిజన్ కొరతతో రోజు వందల మంది తమ ప్రాణాలను కోల్పోతున్నారు. వివిధ ప్రాంతాలనుంచి ఆస్పత్రులకు వాయు, రోడ్డు, రైలు మార్గాలగుండా ఆక్సిజన్‌ను రవాణా చేస్తున్నారు. తాజాగా ఆక్సిజన్‌ను రవాణా చేసే ట్యాంకర్లపై నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఎఐ) కీలక నిర్ణయం తీసుకుంది.
జాతీయ రహదారుల మీదుగా లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ ను మోసే ట్యాంకర్లు, కంటైనర్లకు టోల్ ఫీజును మినహాస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. ఎన్‌హెచ్‌ఎఐ రిలీజ్ చేసిన నోటిఫికేషన్ ప్రకారం, లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్‌ను తీసుకెళ్లే ట్యాంకర్లు, కంటైనర్లను అంబులెన్స్ వంటి ఇతర అత్యవసర వాహనాలతో సమానంగా చూడాలని ప్రకటించారు. కాగా ఈ వాహనాలను టోల్ ఫీజు నుంచి రెండు నెలలపాటు మినహాయింపును ఇచ్చింది.
తదుపరి ఆదేశాల వచ్చేంత వరకు ఈ నిర్ణయం కొనసాగుతుందని ఎన్‌హెచ్‌ఎఐ పేర్కొంది. కరోనా మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా మెడికల్ ఆక్సిజన్‌కు గణనీయంగా డిమాండ్ ఏర్పడటంతో ఎన్‌హెచ్‌ఎఐ ఈ నిర్ణయం తీసుకుంది.
Toll Fee for Tankers Carrying Liquid Medical Oxygen exempted on National Highways.
— NHAI (@NHAI_Official) May 8, 2021
Click here for more details: https://t.co/GmiogH1l8D