సాక్షి, అనంతపురం: ప్రాణవాయువు ఆక్సిజన్ సరఫరాలో అంతరాయం ఏర్పడడంతో అనంతపురము సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో ఐదుగురు కరోనా బాధితులు మృతి చెందారు. ఈ సంఘటన మంగళవారం రాత్రి 8-9 గంటల మధ్యన చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న వెంటనే కలెక్టర్ గంధం చంద్రుడు, ఎమ్మెల్యే అనంతవెంకటరామిరెడ్డి ఆస్పత్రిని సందర్శించి వివరాలు తెలుసుకున్నారు.
మిగిలిన రోగులకు ఆక్సిజన్ అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని ఆస్పత్రి అధికారులకు కలెక్టర్, ఎమ్మెల్యే ఆదేశించారు. ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఘటన దురదృష్టకరమని తెలిపారు. లోపాలు సరిదిద్దాలని అధికారులకు సూచించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే చెప్పారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకుంటామని, ఈ ఘటనపై సమగ్ర విచారణ చేస్తామని ఎమ్మెల్యే అనంతవెంకటరామిరెడ్డి తెలిపారు.
చదవండి: మన ప్రాణాల కన్నా ప్రధానికి అతడి స్వార్థమే ముఖ్యం
చదవండి: అక్క ఆత్మహత్య.. తట్టుకోలేక హార్పిక్ తాగిన చెల్లెలు
Comments
Please login to add a commentAdd a comment