సాక్షి, మంచిర్యాల : తెలంగాణ ప్రాంతంలో గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాజెక్టులన్నీ నిండుకుండల్లా మారాయి. భారీగా వరదలు రావడంతో దాదాపు అన్ని ప్రాజెక్టుల్లో గేట్లు ఎత్తివేశారు. దీంతో బ్యారేజీల్లోని చేపులు భారీ సంఖ్యల్లో కొట్టుకుని వచ్చాయి. దీంతో చేప ప్రియలు గత 15 రోజులుగా పండగా చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే మంచిర్యాల జిల్లా గోదావరి నదిపై గల సుందిల్ల ప్రాజెక్టు వద్ద గ్రామస్తులు చేపల కోసం భారీగా ఎగబడ్డారు. సుందిళ్ళ బ్యారేజ్‌లో వరద ఉధృతి తగ్గడంతో అధికారులు సోమవారం గేట్లను మూసి వేశారు. దీంతో బ్యారేజ్ ముందు భాగంగా చేపలు కుప్పలు కుప్పలు బయటపడ్డాయి. ఈ విషయం కాస్తా జైపూర్ మండలంలోని కిష్టాపూర్, కుందారం గ్రామ ప్రజలుకు తెలియడంతో చేపల కోసం తండోప తండాలుగా జనం తరలివచ్చారు. బస్తాలకు బస్తాలు చేపలు దొరకడంతో ఆటోలు బైకులు ఇతర వాహనాలపై స్థానికులు తీసుకుని వెళ్లారు.
Comments
Please login to add a commentAdd a comment