sundilla barrage pump house
-
న్యాయవాదుల హత్య: నేడు కత్తుల వెలికితీత
గోదావరిఖని/వరంగల్: హైకోర్టు న్యాయవాద దంపతులు వామన్‌రావు, నాగమణిల హత్య కేసు విచారణను పోలీసులు వేగవంతం చేశారు. ఈ నెల 17న వారిద్దరూ హత్యకు గురైన విషయం తెలిసిందే. కేసులో నిందితులుగా ఉన్న కుంట శ్రీనివాస్, శివందుల చిరంజీవి, అక్కపాక కుమార్‌ను రామగుండం కమిషనరేట్ పోలీసులు గురువారం జ్యుడీషియల్ కస్టడీలోకి తీసుకున్నారు. గురువారం ఉదయం వరంగల్ జైలుకు వెళ్లి ప్రత్యేక ఎస్కార్ట్ మధ్య రామగుండం పోలీస్ కమిషనరేట్‌కు తరలించారు. జైలు నుంచి నిందితులను రామగుండం తరలించేసరికి సాయంత్రం కావడంతో హత్యకు ఉపయోగించిన కత్తుల వెలికితీతను వాయిదా వేశారు. కత్తులను నిందితులు సుందిళ్ల బ్యారేజీలో పడేసిన విషయం తెలిసిందే. పది మీటర్ల లోతులో ఉన్న వీటిని శుక్రవారం వెలికితీయనున్నట్టు తెలుస్తోంది. దీంతోపాటు జంటహత్యల్లో ఎవరి పాత్ర ఏమిటి, సహకరించిందెవరనే దానిపై మరింత లోతుగా విచారించనున్నట్టు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జంట హత్యల కేసుపై హైకోర్టు, గవర్నర్ సైతం స్పందించడంతో పోలీసులు ప్రతీదీ సాక్ష్యాధారాలతో సహా సేకరిస్తున్నారు. చదవండి: ప్రశ్నించే గళాలకు ఇదా శిక్ష?! -
న్యాయవాదుల హత్య: వెలుగులోకి సంచలన విషయాలు
సాక్షి, కరీంగనర్/పెద్దపల్లి: హైకోర్టు న్యాయవాది వామన్‌రావు దంపతుల హత్య కేసు రాష్ట్ర వ్యాప్తంగా అలజడి సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసు రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. కుంట శీను, చిరంజీవి ఇద్దరూ పథకం ప్రకారమే న్యాయవాద దంపతులను హతమార్చినట్టు తెలుస్తోంది. హత్య చేసిన తర్వాత నిందితులు రామగిరి నుంచి మహరాష్ట్రకు పరారయినట్లు పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత సుందిళ్ల బ్యారేజ్‌లో కత్తులు, బట్టలు పడేసినట్టు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. అనంతరం సుందిళ్ల బ్యారేజ్ దగ్గరే వేరే బట్టలు మార్చుకుని పరారయ్యారని పోలీసులు తెలిపారు. న్యాయవాది వామన్‌రావుకు సంబంధించిన సమాచారాన్ని లచ్చయ్య ఎప్పటికప్పుడు కుంట శీనుకు అందించేవాడని తెలిసింది. హత్యకు వినియోగించిన కత్తులు, వాహనం బిట్టు శీను సమకూర్చాడని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఈ కేసులో ఇప్పటివరకు ముగ్గురిని అరెస్ట్ చేసినట్టు పేర్కొన్న పోలీసులు.. మరో ఇద్దరు నిందితులు కుంట శ్రీను, లచ్చయ్య పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. చదవండి: 'నా భర్తను వామన్‌రావు హత్య చేశాడు’ న్యాయవాద దంపతుల హత్య: బిట్టు శ్రీను ఏం చెప్పాడు? -
కుప్పలుగా చేపలు.. ఎగబడ్డ జనం
సాక్షి, మంచిర్యాల : తెలంగాణ ప్రాంతంలో గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాజెక్టులన్నీ నిండుకుండల్లా మారాయి. భారీగా వరదలు రావడంతో దాదాపు అన్ని ప్రాజెక్టుల్లో గేట్లు ఎత్తివేశారు. దీంతో బ్యారేజీల్లోని చేపులు భారీ సంఖ్యల్లో కొట్టుకుని వచ్చాయి. దీంతో చేప ప్రియలు గత 15 రోజులుగా పండగా చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే మంచిర్యాల జిల్లా గోదావరి నదిపై గల సుందిల్ల ప్రాజెక్టు వద్ద గ్రామస్తులు చేపల కోసం భారీగా ఎగబడ్డారు. సుందిళ్ళ బ్యారేజ్‌లో వరద ఉధృతి తగ్గడంతో అధికారులు సోమవారం గేట్లను మూసి వేశారు. దీంతో బ్యారేజ్ ముందు భాగంగా చేపలు కుప్పలు కుప్పలు బయటపడ్డాయి. ఈ విషయం కాస్తా జైపూర్ మండలంలోని కిష్టాపూర్, కుందారం గ్రామ ప్రజలుకు తెలియడంతో చేపల కోసం తండోప తండాలుగా జనం తరలివచ్చారు. బస్తాలకు బస్తాలు చేపలు దొరకడంతో ఆటోలు బైకులు ఇతర వాహనాలపై స్థానికులు తీసుకుని వెళ్లారు. -
మంచిర్యాల: కుప్పలుగా చేపలు..
-
సుందిళ్ళ బ్యారేజీ పనులను పరిశీలించిన హరీష్
సాక్షి, పెద్దపల్లి : పెద్దపల్లి జిల్లా మంథని మండలం సిరిపురం వద్ద నిర్వహిస్తున్న సుందిళ్ళ బ్యారేజీ, అన్నారం పంపుహౌస్ పనులను మంత్రి హరీష్ రావు మంగళవారం పరిశీలించారు. ఈ సందర్బంగా ఇంజనీరింగ్ అధికారులు, కలెక్టర్‌తో సమావేశం నిర్వహించి కన్నెపల్లి పంప్‌హౌస్ పనుల ప్రణాళికపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. రోజువారి ప్రణాళిక రూపొందించి లక్ష్యాలకు అనుగుణంగా పని చేయాలని ఆదేశించారు. ఆగస్ట్ 15 వరకు బ్యారేజీ పనులను పూర్తి చేస్తామని ఆధికారులు వెళ్లడించారని తెలిపారు. వర్షం కారణంగా పనులు ఆగిపోతున్నాయని, లేబర్లు ఎక్కవ మంది పనిచేస్తే పనులు త్వరగా పూర్తి అవుతాయని ఆధికారులకు మంత్రి సూచించారు. -
‘సుందిళ్ల’పై సుప్రీంకు గోలివాడ రైతులు
► హైకోర్టు ఉత్తర్వులపై స్పెషల్ లీవ్ పిటిషన్ ► జూన్ మొదటి వారంలో విచారిస్తామని స్పష్టీకరణ సాక్షి, న్యూఢిల్లీ: పెద్దపల్లి జిల్లా గోలివాడ గ్రామంలో కాళేశ్వరం ఎత్తిపోతల పథకం కోసం నిర్మిస్తున్న సుందిళ్ల బ్యారేజీ పంప్ హౌస్ విషయమై రైతులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పంప్‌హౌస్ నిర్మిస్తున్న 240 ఎకరాల భూముల నుంచి తమను ఖాళీ చేయించకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ రైతులు దాఖలు చేసిన అనుబంధ పిటిషన్ ను ఇటీవల హైకోర్టు కొట్టేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఆ ఉత్తర్వులను సవాలు చేస్తూ వారు సుప్రీంలో స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్పీ) దాఖలు చేశారు. రైతుల తరఫు న్యాయవాది ఆర్.ఎస్.వెంకటేశ్వరన్ బుధవారం న్యాయ మూర్తులు జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ నవీన్ సిన్హాలతో కూడిన ధర్మాసనం ముందు ఈ పిటిషన్ గురించి ప్రస్తావించారు.రైతులను బలవంతంగా భూముల నుంచి ఖాళీ చేయిస్తున్నారని తెలిపారు. గోలివాడలోని 240 ఎకరాల భూముల స్వాధీనంలో తదుపరి ఉత్తర్వులిచ్చే వరకు ఏ రకంగానూ జోక్యం చేసుకోవద్దని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తాత్కా లిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) నేతృ త్వంలోని ధర్మాసనం ఇదివరకే ఉత్తర్వులి చ్చిందని, దానికి విరుద్ధంగా ప్రభుత్వం వ్యహరిస్తోందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వ స్టాండింగ్ కౌన్సిల్ పాల్వాయి వెంకటరెడ్డి పిటిషనర్ల వాదనలను తోసిపుచ్చారు. పిటిషనర్లు కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారని, బాధితులకు పరిహారం కూడా చెల్లించామని అన్నారు. వెంకటరెడ్డి వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం, ఇప్పటికిప్పుడు ఈ వ్యాజ్యంపై అత్యవసరంగా విచారణ చేపట్టాల్సిన అవసరం లేదని, దీనిపై జూన్ మొదటి వారంలో విచారణ జరుపుతామని స్పష్టం చేసింది.