
సాక్షి, కరీంగనర్/పెద్దపల్లి: హైకోర్టు న్యాయవాది వామన్‌రావు దంపతుల హత్య కేసు రాష్ట్ర వ్యాప్తంగా అలజడి సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసు రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. కుంట శీను, చిరంజీవి ఇద్దరూ పథకం ప్రకారమే న్యాయవాద దంపతులను హతమార్చినట్టు తెలుస్తోంది. హత్య చేసిన తర్వాత నిందితులు రామగిరి నుంచి మహరాష్ట్రకు పరారయినట్లు పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత సుందిళ్ల బ్యారేజ్‌లో కత్తులు, బట్టలు పడేసినట్టు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.
అనంతరం సుందిళ్ల బ్యారేజ్ దగ్గరే వేరే బట్టలు మార్చుకుని పరారయ్యారని పోలీసులు తెలిపారు. న్యాయవాది వామన్‌రావుకు సంబంధించిన సమాచారాన్ని లచ్చయ్య ఎప్పటికప్పుడు కుంట శీనుకు అందించేవాడని తెలిసింది. హత్యకు వినియోగించిన కత్తులు, వాహనం బిట్టు శీను సమకూర్చాడని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఈ కేసులో ఇప్పటివరకు ముగ్గురిని అరెస్ట్ చేసినట్టు పేర్కొన్న పోలీసులు.. మరో ఇద్దరు నిందితులు కుంట శ్రీను, లచ్చయ్య పరారీలో ఉన్నట్లు వెల్లడించారు.
చదవండి:
'నా భర్తను వామన్‌రావు హత్య చేశాడు’
న్యాయవాద దంపతుల హత్య: బిట్టు శ్రీను ఏం చెప్పాడు?
Comments
Please login to add a commentAdd a comment