
సాక్షి, పెద్దపల్లి : పెద్దపల్లి జిల్లా మంథని మండలం సిరిపురం వద్ద నిర్వహిస్తున్న సుందిళ్ళ బ్యారేజీ, అన్నారం పంపుహౌస్ పనులను మంత్రి హరీష్ రావు మంగళవారం పరిశీలించారు. ఈ సందర్బంగా ఇంజనీరింగ్ అధికారులు, కలెక్టర్‌తో సమావేశం నిర్వహించి కన్నెపల్లి పంప్‌హౌస్ పనుల ప్రణాళికపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
రోజువారి ప్రణాళిక రూపొందించి లక్ష్యాలకు అనుగుణంగా పని చేయాలని ఆదేశించారు. ఆగస్ట్ 15 వరకు బ్యారేజీ పనులను పూర్తి చేస్తామని ఆధికారులు వెళ్లడించారని తెలిపారు. వర్షం కారణంగా పనులు ఆగిపోతున్నాయని, లేబర్లు ఎక్కవ మంది పనిచేస్తే పనులు త్వరగా పూర్తి అవుతాయని ఆధికారులకు మంత్రి సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment