కేసముద్రం(వరంగల్ జిల్లా): ఎండతీవ్రతకు వరంగల్ జిల్లా కేసముద్రం మండలం కోరుకొండపల్లిలో రెండు టన్నుల చేపలు చనిపోయాయి. గ్రామానికి చెందిన మంగి ఉప్పలయ్య చెరువును లీజుకు తీసుకుని 4.50 లక్షల చేప పిల్లలను తెచ్చి చెరువులో పోశాడు. ఇటీవల ఎండల తీవ్రతకు చెరువులో నీళ్లు అడుగంటాయి. ఇప్పటివరకు లీజు దారుడు కేవలం రూ.30 వేల విలువైన చేపలను మాత్రమే పట్టి అమ్మాడు.
తీరా ఎండతీవ్రత ఎక్కువకావడంతో, చేపలన్నీ నీళ్ల వేడిమికి తట్టుకోలేక మృత్యువాత పడ్డాయి. ఒక్కరోజులోనే సుమారు రెండు టన్నుల చేపలు మృతిచెందాయని వీటి విలువ రూ.2లక్షలు ఉంటుందని ఉప్పలయ్య వాపోయాడు.