నాగిరెడ్డిపేట: నిజామాబాద్ జిల్లా నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం ప్రాజెక్టులో ఆదివారం నాడు వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి చేపపిల్లల్ని వదిలారు. ఈ ప్రాజెక్టులో 2.2 లక్షల చేపపిల్లల్ని వదలడం ద్వారా మత్స్య సంపదను పెంపొందించినట్లు అవుతుందన్నారు. చేపలు పట్టుకుని జీవనం సాగించే మత్స్య కారులను, రైతులను ఆదుకుంటామని మంత్రి పోచారం అన్నారు.
వ్యవసాయ అనుబంధ రంగాలను త్వరితగతంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డితో పాటు డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే రవీందర్ రెడ్డి, జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే తదితర నాయకులు పాల్గొన్నారు.