మృగశిర కార్తె సందర్భంగా మంగళవారం చేపలకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. చేపలను కొనేందుకు వినియోగదారులు దుకాణాల ముందు గుమిగూడారు. కరోనా నిబంధనలకు ఖాతరు చేయకుండా గుంపులు గుంపులుగా తిరగడంతో ఆందోళన వ్యక్తమయింది. కాగా, కోవిడ్ వ్యాక్సిన్, ఔషధాలను జీఎస్‌టీ నుంచి మినహాయించాలని వామపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. హైదరాబాద్‌లోని ప్రగతి భవన్ వద్ద ఇద్దరు అన్నదమ్ములు ఆత్మహత్యాయత్నం చేయడంతో కలకలం రేగింది.
1/10
తలమడుగు మండలం కజ్జర్లలో పల్లె ప్రకృతి వనం, రైతు వేదిక భవనం ఒకే దగ్గర పచ్చదనంతో కళకళలాడున్నాయి. గ్రామపంచాయతీ పరిధిలోని మినీ పార్కులో సర్పంచ్ మొట్టే వెంకటమ్మ కిరణ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రంగు రంగుల పూల మొక్కలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. మినీ పార్కులోని బండరాళ్లపై సీఎం కేసీఆర్, ఐటీ మంత్రి కేటీఆర్ చిత్రపటాలు ఆకర్షణీయంగా మారాయి. మినీ పార్కులో సేద తీరడానికి గుడిసె కూడా ఏర్పాటు చేశారు. హరితహారంలో భాగంగా గ్రామాన్ని పచ్చదనంలా మార్చేందుకు గ్రామస్తులు ముందుంటున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్
2/10
మృగశిర కార్తె సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లోని చేపల మార్కెట్లకు జనం పోటెత్తారు. బాలానగర్ రోడ్‌లో చేపలు కొనేందుకు వచ్చిన జనం ఇలా కనిపించారు.
3/10
తెలంగాణ ముఖ్యమంత్రి అధికార నివాసం ప్రగతి భవన్ వద్ద మంగళవారం మధ్యాహ్నం కలకలం రేగింది. కేబినెట్ సమావేశం ప్రారంభం కావడానికి కొద్ది నిమిషాల ముందు సురేశ్, నర్సింగ్‌రావు అనే ఇద్దరు అన్నదమ్ములు ఆత్మహత్యకు యత్నించారు. నర్సింగ్‌రావును అదుపు చేస్తున్న పోలీసును ఈ ఫొటోలో చూడొచ్చు.
4/10
సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం రామునిపట్ల గ్రామ సమీపంలోని ఓ రైస్‌మిల్లులో కొండను తలపిస్తున్న ధాన్యం బస్తాలు.
5/10
కరోనా వ్యాక్సిన్, ఔషధాలపై జీఎస్‌టీ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ హైదరాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బషీర్‌బాగ్‌లోని జీఎస్‌టీ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.
6/10
లాక్‌డౌన్ అమలు, పరిశీలన, నేర పరిశోధనలు, సమీక్షలు, ప్రెస్‌మీట్లతో బిజీగా ఉండే రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ కాసేపు రాకెట్ పట్టుకుని నేరేడ్‌మెట్ కమిషనరేట్ కార్యాలయ ఆవరణలో బ్యాడ్మింటన్ ఆడారు.
7/10
ముంబైలోని రైల్వే స్టేషన్‌లో మంగళవారం ప్రయాణికులకు థర్మల్ స్క్రీనింగ్ చేస్తున్న ఆరోగ్య సిబ్బంది
8/10
సంధ్యా కిరణాల తాకిడితో నింగీ నేలా కొత్త వర్ణాలు మిళితమై కనువిందు చేస్తున్న ప్రసిద్ధ మైసూరు ప్యాలెస్. మంగళవారం సూర్యస్తమయాన రాజ ప్రసాదం సౌందర్యం అబ్బురపరిచింది. కరోనా లాక్‌డౌన్ కావడంతో పర్యాటకులకు ప్యాలెస్‌లోకి ప్రవేశం లేదు. – సాక్షి, మైసూరు
9/10
యూకేలోని కార్న్‌వాల్‌లో శుక్రవారం ప్రారంభం కానున్న జీ–7 నేతల భేటీని పురస్కరించుకుని పనికి రాని ఎలక్ట్రానిక్ సామగ్రితో ‘మౌంట్ రీసైకిల్ మోర్’ పేరిట రూపొందించిన జీ–7 కూటమిలోని యూకే, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, కెనడా, జర్మనీ, అమెరికా దేశాధినేతల ముఖాకృతులు.
10/10
కోవిడ్ లాక్‌డౌన్ సడలింపుల తర్వాత మంగళవారం ముంబైలోని ఓ జిమ్‌లో వ్యాయామం చేస్తున్న బాలీవుడ్ నటి ఏక్తా జైన్.
Comments
Please login to add a commentAdd a comment