చేపలు మనుషులను గుర్తుపడతాయి..
లండన్: చేపలు మనుషుల ముఖాన్ని కచ్చితత్వంతో గుర్తు పట్టగలవని తేలింది. మనుషుల ముఖాలన్నీ ప్రాథమికంగా ఒకే నిర్మాణాన్ని కలిగి ఉంటాయనీ, అయినా ఆశ్చర్యకరంగా చేపలు వివిధ వ్యక్తుల ముఖాల మధ్య తేడాలను గుర్తించాయని అధ్యయనం జరిపిన క్వీన్స్‌లాండ్, ఆక్స్‌ఫర్డ్ వర్సిటీల శాస్త్రవేత్తలు తెలిపారు.
మానవ మెదడులో మనుషులను గుర్తించే ప్రాంతం చిన్న జంతువుల్లో కూడా ఉంటుందో లేదో తాము పరీక్షించామన్నారు. చేపలు 44 వరకు ముఖాల మధ్య తేడాలను గుర్తించాయన్నారు.