భూమ్మీద జనాభా కొంచెం అటూ ఇటూగా 780 కోట్లు. మరి అంత మందినీ కలిపి గట్టి ముద్ద చేస్తే.. మహా అయితే ఓ కిలోమీటర్ వెడల్పుండే ఓ పెద్ద మాంసం ముద్ద తయారవుతుందట. అమెరికాకు చెందిన గణిత శాస్త్రవేత్తలు సరదాగా ఈ లెక్కలేశారు. మనుషుల శరీర సాంద్రత ఘనపు (క్యూబిక్) మీటర్‌కు 985 కిలోలుగా, సగటున ఒక్కొక్కరి బరువును 62 కిలోలుగా లెక్కించి.. అందరినీ కలిపితే ఎంత పెద్ద మాంసం ముద్ద అవుతుందో తేల్చారు.
ఆ మాంసం ముద్ద.. ఈఫిల్ టవర్‌కు మూడింతలు, లేదా న్యూయార్క్‌లోని సెంట్రల్ పార్క్ వెడల్పు అంత ఉంటుందని అంచనా వేశారు. ఇది మొత్తం భూమితో పోలిస్తే.. పెద్ద కొండ ముందు ఆవ గింజంత అన్నమాట. మరి సరదాగా లెక్కలేసినా.. దీనిపై వాళ్లు చేసిన కామెంట్ మాత్రం చెంప చెళ్లుమనేలా ఉంది. అదేంటో తెలుసా..
♦‘మనుషులు ఇంత చిన్న మాంసం ముద్దను మేపడానికి అంత పెద్ద భూమిని నాశనం చేస్తున్నారు’..అని.
భూమ్మీద ఉన్న మనుషులందరినీ.. అమెరికాలోని గ్రాండ్ కాన్యన్(లోయ)లో కుప్పపోస్తే ఎలా ఉంటుందనే దానిపై ఆ దేశ శాస్త్రవేత్త ఒకరు రూపొందించిన చిత్రమిది.
– సాక్షి, సెంట్రల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment