మనుషులు నాలుగు రకాలు!
లండన్: ప్రవర్తన ఆధారంగా మనుషులు నాలుగు రకాలని ఓ తాజా పరిశోధనలో వెల్లడైంది. వివిధ రకాల వ్యక్తులను విడిగా, గ్రూపులుగా అధ్యయనం చేసిన చార్లెస్ 3 యూనివర్సిటీ ఆఫ్ మాడ్రిడ్ (స్పెయిన్) శాస్త్రవేత్తలు మనుషులు ఆశావాదులు, నిరాశావాదులు, నమ్మకం గల వారు, అసూయపరులని నాలుగు వర్గాలుగా విభజించారు. 90 శాతం ప్రజలను నాలుగు వర్గాలుగా విభజించిన పరిశోధకులు వీరిలో అసూయపరులు ఎక్కువ అని తేల్చారు.
30 శాతం ప్రజలు అసూయ వర్గానికి చెందిన వారని, వీరు ఏం చేస్తున్నామన్నది పట్టించుకోరని, ఆశావాదులు (20 శాతం) తమ భాగస్వామి ఇద్దరికీ మంచి చేస్తారని నమ్ముతారని, నిరాశావాదులు (20 శాతం) తమకు కనబడింది ఎంచుకుంటారని, నమ్మకం వర్గానికి చెందినవారు ఫలితం గురించి పట్టించుకోకుండా సహాయం చేయడానికి వెనుకాడరని చెబుతున్నారు. మరో 10 శాతం ప్రజలను వర్గీకరించలేకపోయామని వెల్లడించారు.