cubic meters
-
మనుషులంతా కలిస్తే.. కిలోమీటర్ మాంసం ముద్ద!
భూమ్మీద జనాభా కొంచెం అటూ ఇటూగా 780 కోట్లు. మరి అంత మందినీ కలిపి గట్టి ముద్ద చేస్తే.. మహా అయితే ఓ కిలోమీటర్ వెడల్పుండే ఓ పెద్ద మాంసం ముద్ద తయారవుతుందట. అమెరికాకు చెందిన గణిత శాస్త్రవేత్తలు సరదాగా ఈ లెక్కలేశారు. మనుషుల శరీర సాంద్రత ఘనపు (క్యూబిక్) మీటర్‌కు 985 కిలోలుగా, సగటున ఒక్కొక్కరి బరువును 62 కిలోలుగా లెక్కించి.. అందరినీ కలిపితే ఎంత పెద్ద మాంసం ముద్ద అవుతుందో తేల్చారు. ఆ మాంసం ముద్ద.. ఈఫిల్ టవర్‌కు మూడింతలు, లేదా న్యూయార్క్‌లోని సెంట్రల్ పార్క్ వెడల్పు అంత ఉంటుందని అంచనా వేశారు. ఇది మొత్తం భూమితో పోలిస్తే.. పెద్ద కొండ ముందు ఆవ గింజంత అన్నమాట. మరి సరదాగా లెక్కలేసినా.. దీనిపై వాళ్లు చేసిన కామెంట్ మాత్రం చెంప చెళ్లుమనేలా ఉంది. అదేంటో తెలుసా.. ♦‘మనుషులు ఇంత చిన్న మాంసం ముద్దను మేపడానికి అంత పెద్ద భూమిని నాశనం చేస్తున్నారు’..అని. భూమ్మీద ఉన్న మనుషులందరినీ.. అమెరికాలోని గ్రాండ్ కాన్యన్(లోయ)లో కుప్పపోస్తే ఎలా ఉంటుందనే దానిపై ఆ దేశ శాస్త్రవేత్త ఒకరు రూపొందించిన చిత్రమిది. – సాక్షి, సెంట్రల్ డెస్క్ -
గ్రేటర్ ప్రజలకు గోదారి నీళ్లు
ఏటూరునాగారం : గ్రేటర్ వరంగల్ ప్రజలకు గోదావరి జలాలు మరో 24గంటల్లో అందనున్నాయి. వేసవిలో నీటి కష్టాలు ఎదుర్కొం టున్న మహా నగర ప్రజలకు ఏటూరునాగా రం మండలంలోని దేవాదుల ఇన్ టేక్‌వెల్ నుంచి నీరు సరఫరా చేయాలని నిర్ణయిం చగా, కార్పొరేషన్ నుంచి రూ. 8.69 కోట్లు నిధులతో ఎమర్జెన్సీ పంపింగ్ సిస్టం ఏర్పాటు చేసిన విషయం విదితమే. గోదావరి ఒడ్డుపై 70 హార్స్పవర్ సామర్థ్యం కలిగిన 16 మో టార్లు, గోదావరి నది మధ్యలో రెండు ఇనుప పడవలపై 50 హార్స్పవర్ కలిగిన 16 సబ్ మెర్సిబుల్ మోటార్లు అమర్చి వీటి ద్వారా దేవాదుల ఇన్ టేక్‌వెల్ ఫోర్‌బేలోకి నీరు పం పింగ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఆరు క్యూ బిక్ మీటర్ల మేర నీరు చేరడంతో దేవాదుల మొదటి దశలోని ఒక మోటారును మంగళవారం రాత్రి ప్రారంభించారు. 500 హెచ్‌పీ సామర్థం కలిగిన ఒక్క మోటారు ఒక్క సెకండ్‌కు ఐదు వేల లీటర్ల నీటిని డెలివరీ చేస్తోంది. ఈ మేరకు నీరు పైపులైన్ ద్వారా భీంఘన్‌పూర్, పులుకుర్తి, ధర్మసాగర్ రిజర్వాయర్లకు గురువారం నాటికి చేరుతుంది. నిమిషానికి ఆరు క్యూబిక్ మీటర్లు దేవాదుల వద్ద ఏర్పాటు చేసిన 32 మోటార్లతో ఒక నిమిషానికి ఆరు క్యూబిక్ మీటర్ల మే ర నీరు ఇన్ టేక్వెల్కు వెళ్లే కెనాల్లోకి పం పింగ్ చేస్తోంది. ఇలా గోదావరి నీరు అంతా ఇన్టేక్వెల్లోని ఫోర్‌బేలకు 72 మీటర్ల మేర చేరుకుంది. ఇలా 24 గంటల పాటు నీరు ఫోర్‌బేలకు చేరడంతో 864 క్యూబిక్ మీటర్లకు నీటి సామర్థ్యం పెరగనుంది. నగర ప్రజలకు కావాల్సిన నీటిని ధర్మసాగర్ రిజర్వాయర్‌లో 350 ఎంసీఎఫ్‌టీ మేర నిల్వ చేసేందుకు 23 రోజుల పాటు దేవాదుల పైపులైన్ నుంచి మోటార్లు ఎత్తిపోయనున్నాయి. ఈక్రమంలో ఇంజనీరింగ్ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. -
రీచ్‌ల్లో చెల్లెమ్మల వాటా చిల్లరే!
టీడీపీ ప్రభుత్వం చెబుతున్నదొకటి... చేస్తున్నదొకటి... ఇసుక రీచ్‌ల వ్యవహారం చూస్తే ఈ విషయం అర్థమైపోతుంది. పొదుపు మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు ఇసుక రీచ్‌లు వారికి కేటాయించామని సీఎం ఘనంగా ప్రకటనలిచ్చారు. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితి ‘సొమ్ము ఒకరిది.. సోకు మరొకరిది అన్నట్లుగా ఉంది. రీచ్‌ల వద్ద పొదుపుసభ్యుల కష్టపడుతోంటే ఆదాయం మాత్రం ప్రభుత్వానికి వెళ్తోంది. సైదాపురం: మండలంలోని తూర్పుపూండ్ల గ్రామ సమీపంలో ఉన్న కైవల్యానది రీచ్‌లో ఎనిమిది నెలల కాలంలో సుమారు 16,816 క్యూబిక్ మీటర్లు ఇసుకను తవ్వి విక్రయించారు. ఒక క్యూబిక్ మీటరు రూ.600 వంతున 16,816 క్యూబిక్ మీటర్లకు రూ.కోటి 60వేల వరకు ప్రభుత్వానికి రాబడి వచ్చింది. రీచ్ వద్ద పనిచేసే కంప్యూటరు అపరేటర్‌కు నెలకు రూ.4,500, అకౌంటెంట్‌కు రూ.4,500, రీచ్ ఇన్చార్జ్కు రూ.4,500 ఇవ్వాలని నిర్ణయించారు. ఎనిమిది నెలలకు ప్రభుత్వం ముగ్గురు ఉద్యోగులకు రూ.1.8లక్షలు ఇచ్చారు. అయితే రీచ్‌లు పర్యవేక్షణ చేసిన పొదుపు మహిళలకు రోజుకు కేవలం రూ.100 ఇచ్చారు. ఇలా ఎనిమిది నెలలకు వీరికి ప్రభుత్వం రూ.96 వేల అందించింది. వెట్టిచాకిరే... తూర్పుపూండ్లలో 45 పొదుపు సంఘాలున్నాయి. వాటిలోని 12 మంది సభ్యులను మాత్రమే ఇసుక రీచ్‌ను పర్యవే క్షణ చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది .ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు వరకు ఉన్నందుకు వారికి దక్కింది కేవలం రూ.100. బయట పనులకు వెళ్తే వారికి రూ.300 వస్తోంది. ఇలా మహిళల చేత ప్రభుత్వం వెట్టిచాకి రి చేయించుకుంది. దక్కింది రూ.56 మాత్రమే.. రీచ్ ప్రారంభమయ్యాక ఇన్సెంటివ్ పేరుతో రూ.50,350ను ప్రభుత్వం విడుదల చేసింది. వాటిలో నిర్వహణకు రూ. 25 వేలు వెచ్చించారు. మిగిలిన రూ.25,350ను పొదుపు సంఘాల మహిళలు పంచుకోవాలని చెప్పారు. గ్రామంలోని 45 పొదుపు సంఘాల్లో సుమారు 450 మంది సభ్యులున్నారు. ఆ డబ్బును వాళ్లు పంచుకోగా ఒక్కొక్కరికీ రూ.56 మాత్రమే వచ్చింది. ఇసుక రీచ్ వల్ల ప్రభుత్వానికి రూ. ఒక కోటి 60 వేలు వచ్చింది. సుమారు రూ.10,12,350లను ఖర్చుచేశారు. మిగిలిన రూ.89,87,650లు ప్రభుత్వ ఖజానాకు జమైంది. రీచ్‌ల ద్వారా పొదుపు మహిళలకు ఎంతో చేస్తున్నామని చెప్పిన ప్రభుత్వం రూ. 56 మాత్రమే ఇస్తుండటంతో సదరు మహిళలు విస్తుపోతున్నారు. వంద రూపాయలే ఇస్తున్నారు: ఇసుకరీచ్ వద్ద పనిచేస్తున్నాం. రోజుకు వంద రూపాయల వంతున నెలకు ఒక్కసారి ఇస్తున్నారు. ఉదయం 6 గంటలకు వస్తే సాయంత్రం 6 గంటల వరకు పనిచేస్తున్నాం. ఊళ్లో పని కావడంతో ఆపనికి వెళ్లుతున్నాం.-ముత్తూకూరు వెంకటరత్నమ్మ కష్టం ఎక్కువ.. వచ్చేది తక్కువ ఇసుక రీచ్ వద్ద ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉంటున్నాం. మాకు వందరూపాయలు మాత్రమే ఇస్తున్నారు. అదనంగా మరో వందరూపాయలు ఇస్తే చాలు. అన్ని పనులు చూసుకుంటాం.-తక్కెళ్ల అంకమ్మ