ఏటూరునాగారం : గ్రేటర్ వరంగల్ ప్రజలకు గోదావరి జలాలు మరో 24గంటల్లో అందనున్నాయి. వేసవిలో నీటి కష్టాలు ఎదుర్కొం టున్న మహా నగర ప్రజలకు ఏటూరునాగా రం మండలంలోని దేవాదుల ఇన్ టేక్‌వెల్ నుంచి నీరు సరఫరా చేయాలని నిర్ణయిం చగా, కార్పొరేషన్ నుంచి రూ. 8.69 కోట్లు నిధులతో ఎమర్జెన్సీ పంపింగ్ సిస్టం ఏర్పాటు చేసిన విషయం విదితమే. గోదావరి ఒడ్డుపై 70 హార్స్‌పవర్ సామర్థ్యం కలిగిన 16 మో టార్లు, గోదావరి నది మధ్యలో రెండు ఇనుప పడవలపై 50 హార్స్‌పవర్ కలిగిన 16 సబ్ మెర్సిబుల్ మోటార్లు అమర్చి వీటి ద్వారా దేవాదుల ఇన్ టేక్‌వెల్ ఫోర్‌బేలోకి నీరు పం పింగ్ చేస్తున్నారు.
ఇప్పటి వరకు ఆరు క్యూ బిక్ మీటర్ల మేర నీరు చేరడంతో దేవాదుల మొదటి దశలోని ఒక మోటారును మంగళవారం రాత్రి ప్రారంభించారు. 500 హెచ్‌పీ సామర్థం కలిగిన ఒక్క మోటారు ఒక్క సెకండ్‌కు ఐదు వేల లీటర్ల నీటిని డెలివరీ చేస్తోంది. ఈ మేరకు నీరు పైపులైన్ ద్వారా భీంఘన్‌పూర్, పులుకుర్తి, ధర్మసాగర్ రిజర్వాయర్లకు గురువారం నాటికి చేరుతుంది.
నిమిషానికి ఆరు క్యూబిక్ మీటర్లు
దేవాదుల వద్ద ఏర్పాటు చేసిన 32 మోటార్లతో ఒక నిమిషానికి ఆరు క్యూబిక్ మీటర్ల మే ర నీరు ఇన్ టేక్‌వెల్‌కు వెళ్లే కెనాల్‌లోకి పం పింగ్ చేస్తోంది. ఇలా గోదావరి నీరు అంతా ఇన్‌టేక్‌వెల్‌లోని ఫోర్‌బేలకు 72 మీటర్ల మేర చేరుకుంది. ఇలా 24 గంటల పాటు నీరు ఫోర్‌బేలకు చేరడంతో 864 క్యూబిక్ మీటర్లకు నీటి సామర్థ్యం పెరగనుంది. నగర ప్రజలకు కావాల్సిన నీటిని ధర్మసాగర్ రిజర్వాయర్‌లో 350 ఎంసీఎఫ్‌టీ మేర నిల్వ చేసేందుకు 23 రోజుల పాటు దేవాదుల పైపులైన్ నుంచి మోటార్లు ఎత్తిపోయనున్నాయి. ఈక్రమంలో ఇంజనీరింగ్ అధికారులు పర్యవేక్షిస్తున్నారు.
గ్రేటర్ ప్రజలకు గోదారి నీళ్లు
Published Wed, Apr 27 2016 2:33 AM | Last Updated on Tue, Aug 21 2018 12:12 PM
Advertisement